STOCKS

News


వెలుగులోకి అటో షేర్లు

Friday 30th November 2018
Markets_main1543556188.png-22519

మార్కెట్‌ ర్యాలిలో భాగంగా గురువారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో అటోరంగ షేర్లు వెలుగులోకి వచ్చాయి. ఎన్‌ఎస్‌ఈలోని అటోరంగ షేర్లకు ప్రాతనిథ్యం వహిస్తున్న నిఫ్టీ అటో ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌ ప్రారంభంలో 1శాతం లాభపడింది. ఉదయం 10:20నిల.కు ఇండెక్స్‌ 0.75శాతం లాభపడి 9,270.15 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఎంఅండ్‌ఎం షేరు 3శాతం లాభపడి అటో ఇండెక్స్‌లో అగ్రస్థానంలో కొనసాగడమే కాక, నిఫ్టీ-50 సూచీలో టాప్‌-5 గెయినర్లలో  ద్వితీయ స్థానంలో కొనసాగుతోంది. అశోక్‌లేలాండ్‌, మారుతి షేర్లు 2శాతం ర్యాలీచేశాయి. హీరోమోటర్‌కార్ప్‌, భాష్‌లిమిటెడ్‌ షేర్లు 1శాతం పెరిగాయి. అలాగే బజాజ్‌అటో, ఎక్సైడ్‌, ఐషర్‌ మోటర్స్‌, టీవీఎస్‌ మోటర్‌ షేరు అరశాతం లాభపడ్డాయి. మరోవైపు ఇదే సూచీలోని టాటామోటర్‌ షేరు  4శాతం నష్టపోయింది. చైనాలో డిజిల్‌ కార్ల డిమాండ్‌ తగ్గడం, యూరోజోన్‌లో బ్రెగ్జిట్‌ సమస్య ఇంకా పరిష్కారం కాకపోవడం తదితర అంశాలతో టాటామోటర్స్‌ యూకే అనుబంధ సంస్థ జేఎల్‌ఆర్‌ మోటర్స్‌ తమ ఉత్పత్తులను తాత్కలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అలాగే బ్రిటన్‌లో వోల్వెర్హాంప్టన్ యూనిట్‌లో 500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు కంపెనీ సిద్ధమైంది. మరోవైపు విదేశీ బ్రోకరేజ్‌ సంస్థ యూబీఎస్‌  షేరు టార్గెట్‌ ధరను తగ్గించడం కూడా షేరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఉదయం 10:20నిల.కు 3.50శాతం నష్టంతో నిఫ్టీ-50 సూచీలో టాప్‌-5 లూజర్లలో ద్వితీయస్థానంలో ట్రేడ్‌ అవుతోంది. అలాగే టాటామోటర్స్‌ డీవీఆర్‌ 2.50శాతం క్షీణించింది. మదర్‌సన్‌సుమీ 1శాతం, అమరరాజా బ్యాటరీస్‌, భారత్‌ఫోర్జ్‌, అపోలోటైర్స్‌, ఎంఆర్‌ఎఫ్‌ నష్టపోయాయి.



You may be interested

ఎమర్జింగ్‌ ఈటీఎఫ్‌లకు పావెల్ బూస్ట్‌

Friday 30th November 2018

అభివృద్ది చెందుతున్న దేశాల ఈక్విటీ ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ ఫండ్‌ (ఈటీఎఫ్‌)లకు బిలియర్‌ డాలర్‌ (దాదాపు రూ.7,000 కోట్లు) పెట్టుబడులను అందించిన అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ వ్యాఖ్య. అమెరికా వడ్డీ రేట్లు చారిత్రక ప్రమాణాల కంటే ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయని ఆదేశ సెం‍ట్రల్‌ బ్యాంక్‌ చైర్మన్‌ పావెల్‌ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఎమర్జింగ్స్‌ మార్కెట్‌ ఈటీఎఫ్‌ బుధవారం భారీ పెట్టుబడులను అందుకుంది. ఒక్కరోజులోనే బిలియర్‌ డాలర్ల ఇన్‌ఫ్లో వచ్చి చేరింది.

ఎయిర్‌లైన్స్‌ సంస్థలకు రూ.35,000 కోట్లు కావాలి: ఇక్రా

Friday 30th November 2018

ముంబై: దేశీయ విమానయాన సేవల సంస్థలకు వచ్చే నాలుగేళ్లలో భారీ స్థాయిలో నిధుల అవసరం ఉందని, సుమారు రూ.35,000 కోట్ల మేర మూలధనం అవసరం అవుతుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా. పెరిగిపోయిన చమురు ధరలు, రూపాయి విలువ క్షీణత, తీవ్రమైన పోటీ కారణంగా విమానయాన సంస్థలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్న విషయం తెలిసిందే. జెట్‌ ఎయిర్‌వేస్‌, ఇండిగో, స్పైస్‌జెట్‌ సంస్థలు నష్టాల్లో ఉన్నాయి. ‘‘ఈ ఏడాది ఏప్రిల్‌-నవంబర్‌ మధ్య

Most from this category