STOCKS

News


నష్టాల బాటలో అటో షేర్లు

Monday 21st January 2019
Markets_main1548063145.png-23704

మార్కెట్‌ లాభాల ర్యాలీలోనూ అటో షేర్లు నష్టాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో అటో రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ గురువారం 1శాతం క్షీణించింది. హీరోమోటర్‌ కార్ప్‌ 3.50శాతం, మారుతి సుజుకీ 2.50శాతం, టాటామోటర్స్‌ 1.50శాతం క్షీణత అటో షేర్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. మధ్యాహ్నం గం.2:45ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు 8,844.80తో పోలిస్తే 1.20శాతం నష్టంతో 8,737.30ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో మొత్తం 15 షేర్లలో 12 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా, 3 షేర్లు మాత్రం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. టాటామోటర్స్‌ డీవీఆర్‌, అశోక్‌లేలాండ్‌, బజాజ్‌ అటో, భారత్‌ ఫోర్జ్‌, ఎక్సైడ్‌ షేర్లు 2శాతం నష్టపోయాయి. మరోవైపు ఇదే రంగానికి చెందిన మదర్‌సన్‌ సుమీ ఇండెక్స్‌ అత్యధికంగా 4శాతం ర్యాలీ చేసింది. అలాగే, భాష్‌ లిమిటెడ్‌, ఎంఅండ్‌ఎం, ఐషర్‌ మోటర్స్‌, అమరరాజా బ్యాటరీస్‌, అపోలో టైర్స్‌ 1శాతం నుంచి అరశాతం నష్టపోయాయి. ఇదే సమయానికి ఈ సూచీలో హీరోమోటోకార్స్‌, మారుతి షేర్లు నిప్టీ-50 ఇండెక్స్‌లో టాప్‌-5 లూజర్లలో మొదటి రెండు స్థానాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.You may be interested

కోటక్‌ బ్యాంక్‌ లాభంలో 23 శాతం వృద్ధి

Monday 21st January 2019

డిసెంబర్‌ త్రైమాసికంలో కోటక్‌ మహీంద్రా బ్యాంకు రూ. 1291 కోట్ల నికరలాభం నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఈ మొత్తం 23 శాతం అధికం. గతేడాది మూడో త్రైమాసికంలో బ్యాంకు రూ. 1053 కోట్ల లాభం నమోదు చేసింది. ప్రస్తుత సమీక్షా కాలంలో బ్యాంకు ఎన్‌ఐఐ(నికర వడ్డీ ఆదాయం) 23 శాతం దూసుకుపోయి రూ. 2939కి చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 4.20 శాతం నుంచి 4.33

రెండో రోజూ రిలయన్స్‌ ర్యాలీ

Monday 21st January 2019

మూడున్నర గరిష్టం వద్ద షేరు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు వరుసగా రెండో రోజూ ర్యాలీని కొనసాగిస్తుంది. కంపెనీ క్యూ3లో అంచనాలకు మించిన లాభాలను ఆర్జించడం ఇందుకు నేపథ్యం. గతవారంలో గురువారం విడుదుల చేసిన గణాంకాల ప్రకారం పెట్రో, రిటైల్‌, టెలికాం విభాగాల్లో కంపెనీ రాణించడంతో మూడో త్రైమాసికంలో కంపెనీ రూ.10251 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ఒక త్రైమాసికంలో రూ.10వేల కోట్ల పైగా లాభం నమోదు చేసిన తొలి ప్రైవేట్‌ కంపెనీగా రిలయన్స్‌

Most from this category