STOCKS

News


అటో షేర్ల ర్యాలీ..!

Friday 7th September 2018
Markets_main1536302204.png-20056

ముంబై:- అటో షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో స్పీడుగా ర్యాలీ చేస్తున్నాయి. అటో షేర్ల ర్యాలీతోనే నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్న సూచీలు తిరిగి లాభాల బాటపట్టాయి. బజాజ్‌ అటో, టాటా మోటర్స్‌ షేర్ల ర్యాలీ అండతో ఎన్‌ఎస్‌ఈలో అటో షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ 1.16శాతం లాభపడింది. ఉదయం గం.11:30ని.లకు నిఫ్టీ అటో ఇండెక్స్‌ 1.06 శాతం లాభంతో 10,913 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలోని మొత్తం 16షేర్లకు గానూ, 13 షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, 3షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా టాటా మోటర్స్‌ 4శాతం లాభపడగా, బజాజ్‌-అటో, హీరోమోటర్స్‌కార్పో, టాటామోటర్స్‌ డీవీఆర్‌, టాటామోటర్స్‌ షేర్లు 3నుంచి 2శాతం లాభపడ్డాయి. అమరరాజాబ్యాటరీస్‌, భారత్‌ఫోర్జ్స్‌, ఎంఅండ్‌ఎం, అపోలోటైర్స్‌, అశోక్‌ లేలాండ్స్‌, షేర్లు 1శాతం వరుకు ర్యాలీ చేశాయి. ఎంఆర్‌ఎఫ్‌, మదర్‌సుమీసన్స్‌, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ షేర్లు అరశాతం పెరిగాయి. మరోవైపు మారుతి, ఐషర్‌మోటర్స్‌లిమిటెడ్స్‌, భాష్‌ లిమిటెడ్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి.
7వారాల గరిష్టానికి బజాజ్‌ అటో:-
అటోరంగ నిర్మాణ సం‍స్థ బజాజ్‌ అటో లిమిటెడ్‌ షేరు నేడు ఎన్‌ఎస్‌ఈలో 7వారాల గరిష్టానికి చేరుకుంది. క్వాడ్రిసైకిల్‌, మూడు చక్రాల వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏడాదికి 10లక్షలకు పెంచుతున్నట్లు గురువారం బజాజ్‌ అటో లిమిటెడ్‌ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ ఆధారంగా నడిచే వాహనాలకు పర్మిట్‌ మినహాయింపులిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బజాజ్‌ అటో తెలిపింది. ఈ ప్రకటనతో నేటి ఇంట్రాడేలో ఈ కంఫెనీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా నేడు బజాజ్‌ అటో షేరు 4శాతం వరుకు లాభపడి రూ.2,889.50ల వద్ద 7వారాల గరిష్టానికి చేరుకుంది. ఉదయం గం.11:45ని.లకు షేరు గతముగింపు(రూ.2,783.10)తో పోలిస్తే 3.50శాతం పెరిగి రూ.2,879.40ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది, కనిష్ట ధరలు వరుసగా రూ.2,605.00లు రూ.3,468.35లుగా ఉన్నాయి.



You may be interested

నిఫ్టీ 2019 మార్చి టార్గెట్‌ .. 12,620

Friday 7th September 2018

2019, 2020 ఆర్థిక సంవత్సరాల ఈపీఎస్‌ అంచనాల ఆధారంగా చూస్తే నిఫ్టీ 2019 మార్చి టార్గెట్‌ 12,620 అని నర్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ డైరెక్టర్‌, సీఐవో శైలేంద్ర కుమార్‌ తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. క్రూడ్‌ ధరల పెరుగుదల, రూపాయి క్షీణత వంటి అంశాలు మార్కెట్లకు రిస్క్‌ అని పేర్కొన్నారు. అలాగే ఈ అంశాలు కరెంట్‌ అకౌంట్‌ లోటు పెరుగుదలకు కారణమౌతాయని

మరింతగా పెరిగిన పసిడి..!

Friday 7th September 2018

న్యూయార్క్‌/ముంబై:- ఆసియా మార్కెట్లో పసిడి వరుసగా మూడోరోజూ లాభపడింది. యెన్‌ బలపడంతో డాలర్ క్షీణించడం, అమెరికా చైనా దేశాల మధ్య ట్రేడ్‌వార్‌ భయాలు పసిడికి పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఆసియా మార్కెట్లో శుక్రవారం భారతవర్తమాన కాలం గం.10:15ని.లకు ఔన్స్‌ పసిడి 2.60 డాలర్ల పెరిగి రూ.1,206.80 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. వచ్చేవారంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ జపాన్‌తో నెలకొన్న వాణిజ్య సమస్యలను పరిష్కరించడానికి ఆదేశ ప్రతినిధులతో చర్చిస్తారని అమెరికా మీడియాలో

Most from this category