STOCKS

News


అదరగొట్టిన అటో షేర్లు

Friday 2nd November 2018
Markets_main1541153499.png-21669

అక్టోబర్‌లో వాహన విక్రయాలు ఆశించినస్థాయిలో లేనప్పటికీ.., శుక్రవారం ఆటోరంగ షేర్లు అదరగొట్టాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ అటో ఇండెక్స్‌ నేటి ఇంట్రాడేలో 4.50శాతం ర్యాలీ చేసింది. గత కొంతకాలంగా స్తబ్ధుగా సాగుతున్న అటోరంగ షేర్లలో నేడు కొనుగోళ్లు వెల్లువెత్తడంతో ఇండెక్స్‌ ర్యాలీకి కారణమైందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. చివరకు 4.15 శాతం లాభంతో 9,180.20 వద్ద ముగిసింది. సూచిలో భాగమైన మొత్తం 16 షేర్లలో ఒక్క ఎక్సైడ్‌ ఇండియా లిమిటెడ్‌(1శాతం నష్టం) తప్ప మిగతా అన్ని షేర్లు లాభాల్లో ముగిశాయి. అత్యధికంగా మదర్‌సుమీ షేరు 8శాతం లాభపడింది. మారుతి, అమరరాజాబ్యాటరీస్‌, టాటామోటర్స్‌ షేర్లు 6శాతం పెరిగాయి. టాటామోటర్స్‌డీవీఆర్‌ 5శాతం, భారత్‌ఫోర్జ్స్‌, అశోక్‌లేలాండ్‌, హీరోమోటర్‌ కార్ప్‌ షేర్లు 4శాతం లాభపడ్డాయి. ఎంఅండ్‌ఎం, ఐషర్‌మోటర్స్‌ ఎంఆర్‌ఎఫ్‌ షేర్లు 3శాతం, బజాజ్‌ అటో 2.50శాతం పెరిగ్గా అపోలో టైర్స్‌ అరశాతం లాభపడింది.



You may be interested

ఈ 4 రంగాల్లో ఆకర్షణీయ రాబడి..!

Friday 2nd November 2018

మిడ్‌క్యాప్‌ ఐటీ, కన్సూమర్‌ స్టెపుల్స్‌, ఇన్‌ఫ్రా, సిటీ గ్యాస్‌ రంగాల షేర్లపై బుల్లిష్‌గా ఉన్న డోలాట్ కాపిటల్ డైరెక్టర్ రీసెర్చ్ అమిత్ ఖురానా విమానయాన రంగ షేర్లకు దూరంగా ఉండమని సూచన ముంబై: రోడ్‌ ప్రాజెక్టేతర సోషల్‌ ఇన్‌ఫ్రా రంగంపై తాను బుల్లిష్‌గా ఉన్నట్లు డోలాట్ కాపిటల్ మార్కెట్‌ రీసెర్చ్‌ విభాగ డైరెక్టర్ అమిత్ ఖురానా అన్నారు. అయితే, ఈ రంగ కంపెనీలలో కూడా డీ-రేటింగ్‌ ఉందని వివరించారు. వడ్డీ రేట్ల మార్పు

మెరుస్తున్న మెటల్‌ షేర్లు

Friday 2nd November 2018

మార్కెట్‌ ర్యాలీలో భాగంగా శుక్రవారం మెటల్‌ షేర్లు మెరుస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈ మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ నేడు 3శాతం ర్యాలీ చేసింది. మధ్యాహ్నం గం.2:45ని.లకు నిఫ్టీ ఇండెక్స్‌ 3శాతం లాభపడి 3,469.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి నిఫ్టీ ఈ ఇండెక్స్‌లో మొత్తం 15 షేర్లలో 13 షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అ‍త్యధికంగా జేఎస్‌ఎల్‌హిస్సార్‌ స్టీల్‌, వేదాంత 6శాతం ర్యాలీ చేశాయి. జిందాల్‌స్టీల్‌ 5శాతం,

Most from this category