STOCKS

News


11300 పైన ప్రారంభమైన నిఫ్టీ

Wednesday 19th September 2018
Markets_main1537329579.png-20370

అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల వాతావరణాన్ని అందుకున్న దేశీయ మార్కెట్‌ బుధవారం లాభాల్లో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ గతముగింపు(37290)తో పోలిస్తే 143 లాభంతో 37433 వద్ద, నిఫ్టీ గత ముగింపు(11,279)తో పోలిస్తే 48 పాయింట్ల లాభంతో 11,326 వద్ద ప్రారంభమైంది.
విప్రో, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, జీలిమిటెడ్‌, టైటాన్‌ షేర్లు అరశాతం  నుంచి 3శాతం నష్టంతో ట్రేడ్‌ అవుతుండగా, టాటాస్టీల్‌, సన్‌ఫార్మా, ఏషియన్‌పేయింట్స్‌​, కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ షేర్లు 1నుంచి 2శాతం లాభంతో ట్రేడ్‌ అవుతున్నాయి.
ఇక అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే,  మంగళవారం రాత్రి అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగియగా, నేటి ఉదయం ఆసియా మార్కెట్లలో ఒక్క కోస్పి(0.17శాతం నష్టం) తప్ప మిగితా అన్ని మార్కెట్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా జపాన్ మార్కెట్‌ నికాయ్‌ 1.50శాతం లాభంతో ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 19th September 2018

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు లుపిన్:- కంపెనీ కొత్త సీఈవోగా అలోక్‌ సోనిక్‌ నియమితులయ్యారు. ఎలక్ట్రో స్టీల్‌:- కంపెనీలో వేదాంత వాటా కొనుగోలు అంశానికి సెప్టెంబర్‌ 24న జరిగే బోర్డు సమావేశంలో ఆమోదం తెలపనుంది. సన్‌ ఫార్మా:- సోరియాస్‌ చికిత్సలో ఉపయోగించే ఇల్లూమెట్రి ఔషధాలను యూరప్‌ మార్కెట్లో విక్రయించడానికి యూరోపియన్‌ డ్రగ్‌ కంట్రోల్‌ నుంచి అనుమతినిచ్చింది. టాటా స్టీల్‌:- క్రియేటివ్‌ పోర్ట్‌ డెవెలప్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 51శాతం వాటా కొనుగోలును

స్వల్పంగా కోలుకున్న రూపాయి

Wednesday 19th September 2018

క్రితం రోజు భారీగా నష్టపోయి 72.98 వద్ద ముగిసిన రూపాయి బుధవారం స్వల్పంగా కోలుకుంది. డాలరుతో రూపాయి మారకపు విలువ ట్రేడింగ్‌ ప్రారంభంలో 26 పైసలు రికవరీ అయ్యి, 72.72 వద్ద ట్రేడవుతోంది. డాలరు ఇండెక్స్‌ గత రాత్రి ముగింపుతో పోలిస్తే స్వల్పంగా 94.18 స్థాయికి తగ్గడం, పలు వర్థమాన కరెన్సీలు స్వల్పంగా బలపడిన నేపథ్యంలో రూపాయి కోలుకుంది. అలాగే ప్రధాన ఆసియా మార్కెట్లన్నీ లాభాలతో ట్రేడ్‌కావడం, మన మార్కెట్‌

Most from this category