STOCKS

News


11500పైన నిఫ్టీ

Monday 18th March 2019
Markets_main1552884130.png-24656

గతవారం భారీ లాభాలను ఆర్జించిన సూచీలు... ఈ వారం ప్రారంభంలోనూ అదే జోరును కొనసాగిస్తున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందుకున్న సూచీలు సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభం నుంచే చురుగ్గా కదులుతున్నాయి.  ట్రేడింగ్‌ ప్రారంభంలోనే నిఫ్టీ 103 పాయింట్లు పెరిగి 11500పై 11,530.15వద్ద, సెన్సెక్స్‌ 345 పాయింట్లు లాభపడి 38,369.59ల వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. ఫిబ్రవరిలో భారత్‌ వాణిజ్యలోటు భారీగా తగ్గిందని గణంకాలు వెలువడటం, తద్వారా నేడు డాలరు మారకంలో రూపాయి 18పైసలు బలపడటం, అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లపై సరళ వైఖరి అవలంబించవచ్చనే మార్కెట్‌ విశ్లేషకుల అంచనాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపపరుస్తున్నాయి. అటో, ఫార్మా షేర్లలో తప్ప అన్ని రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ఆర్థిక రంగ షేర్లు ఎక్కువగా లాభపడుతున్నాయి. ప్రైవేట్‌ రంగ షేర్ల అండతో బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం లాభపడింది. ఉదయం గం.9:50ని.లకు నిఫ్టీ 81 పాయింట్ల లాభంతో 11,508 వద్ద, సెన్సెక్స్‌ 252 పాయింట్ల 38,277 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

బ్యాంకు స్టాకుల్లో మరింత ర్యాలీ!

Monday 18th March 2019

నిపుణుల అంచనా ప్రీఎలక‌్షన్‌ ర్యాలీని ఆరంభించిన బ్యాంకు స్టాకుల దూకుడుతో బ్యాంకు నిఫ్టీ ఈ నెల్లో రికార్డు గరిష్ఠాలను దాటేసింది. బ్యాంకు స్టాకుల దూకుడు ట్రేడర్లను ఆకట్టుకుంటోంది. దీంతో పలువురు కొత్త లాంగ్స్‌ తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఐసీఐసీఐ, యాక్సిస్‌ కౌంటర్లలో కొనుగోళ్లు ఎక్కువగా ఉన్నాయి. విదేశీ మదుపరులు ఈ రెండు స్టాకుల్లో భారీగా పెట్టుబడులు పెడుతుండడంతో రిటైలర్లు సైతం వీటిపై మక్కువగా ఉన్నారు. నిఫ్టీలో ఫైనాన్స్‌ రంగ స్టాకుల వెయిటేజ్‌ అధికం.

సోమవారం వార్తల్లో షేర్లు

Monday 18th March 2019

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితయ్యే షేర్ల వివరాలు  బంధన్‌ బ్యాంక్‌:-  గృహ్‌ ఫైనాన్స్‌ విలీనానికి ఆర్‌బీఐ ఆమోదం తెలిపింది. ఈ విలీనానికి ఎలాంటి అభ్యంతరం లేదంటూ ఆర్‌బీఐ తమకు లేఖ రాసిందని బంధన్‌ బ్యాంక్‌ శుక్రవారం స్టాక్‌ ఎక్చే‍్సంజ్‌లకు సమాచారం ఇచ్చింది.  జై ప్రకాశ్‌ అసోసియేట్స్‌:- కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌, సీఈవోగా మనోజ్‌ గౌర్‌, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా సునీల్‌ కుమార్‌ శర్మలను పదవిలో మరో మూడేళ్ల పాటు కొనసాగేందుకు బోర్డు

Most from this category