STOCKS

News


నాలుగు నెలల గరిష్టస్థాయికి మార్కెట్‌

Wednesday 6th February 2019
Markets_main1549426055.png-24034

ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందుకున్న దేశీయ మార్కెట్‌ బుధవారం లాభాలతో ప్రారంభమై, కొద్ది నిముషాలకే నాలుగు నెలల గరిష్టస్థాయిని అందుకుంది.  సెన్సెక్స్‌ గత ముగింపు(36,616)తో పోలిస్తే 97 పాయిం‍ట్ల లాభంతో 36,714.54 వద్ద, నిఫ్టీ గతముగింపు(10,934.35)తో పోలిస్తే 31 పాయిం‍ట్లు పెరిగి 10,965 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే అన్ని రంగాలకు చెందిన షేర్లలో భారీగా కొనుగోళ్లు జరగడంతో నిఫ్టీ ఇండెక్స్‌ 11,000 స్థాయికి అందుకుంది. ఐటీ, మెటల్‌, ఫైనాన్స్‌ సర్వీసెస్‌ రంగాలకు చెందిన షేర్లలో కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఉదయం గం.9:30ని.లకు నిఫ్టీ ఇండెక్స్‌ 83పాయింట్లు లాభపడి 11,018.60 వద్ద, సెన్సెక్స్‌ 255 పాయింట్ల పెరిగి 36,872.34 వద్ద 4నెలల గరిష్టస్థాయి వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.
 నిఫ్టీ - 50 సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌పీసీఎల్‌, ఇండియన్‌బుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, జీ లిమిటెడ్‌, టెక్‌మహీంద్రా షేర్లు 1.50శాతం నుంచి 5శాతం లాభపడగా, టాటామోటర్స్‌, అదానీ పవర్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు అరశాతం నుంచి 1శాతం నష్టపోయాయి.
ఇక ప్రపంచమార్కెట్ల విషయానికొస్తే... టెక్నాలజీ షేర్ల అండతో అమెరికా మార్కెట్లు నిన్న రాత్రి లాభాల్లో ముగియగా, వాణిజ్య వివాద పరిష్కార చర్చల కోసం చైనా ప్రెసిడెంట్‌ జిన్‌పింగ్‌తో సమావేశంకానున్నట్లు ట్రంప్‌ పేర్కొనడంతో నేడు జపాన్‌, ఆస్రే‍్టలియాలు పాజిటివ్‌గా ట్రేడవుతుండగా, లూనార్‌ న్యూఇయర్‌ కారణంగా ఆసియా మార్కెట్లకు సెలవు.



You may be interested

నానో తయారీ లేదు... అమ్మకాలు లేవు

Wednesday 6th February 2019

జనవరిలో పరిస్థితి ఇది నిలిచిపోవచ్చన్న అంచనాలకు బలం న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌ చిన్న కారు నానో జనవరిలో ఒక్కటీ అమ్ముడుపోలేదు. అంతేకాదు, ఒక్క నానోను కూడా తయారు చేయలేదు. ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి నూతన భద్రతా ప్రమాణాలు, 2020 ఏప్రిల్‌ నుంచి వచ్చే బీఎస్‌-6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా నానో కారును ఆధునీకరించే ‍ప్రణాళికలు ఏవీ లేవని ఇటీవలే టాటా మోటార్స్‌ సేల్స్‌ విభాగం హెడ్‌ ప్రకటించిన విషయం గమనార్హం.

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 6th February 2019

వివిధ వార్తల‌కు అనుగుణంగా బుధ‌వారం ప్రభావిత‌మయ్యే షేర్ల వివ‌రాలు లుపిన్:-  అమెరికా మార్కెట్లోకి  క్లోమిపారైన్ హైడ్రోక్లోరైడ్ జ‌న‌రిక్  ఔష‌ధాల‌ను విడుద‌ల చేసింది. సంబంధిత  ఔష‌ధాల‌ను అతి శుభ్రత వ్యాధి(ఓసీడీ) నివార‌ణ చికిత్సలో వినియోగిస్తారు. యాక్సిస్ బ్యాంక్‌:- కార్పోరేట్ చ‌ట్టాల‌ నియ‌మాళిని ఉల్లంఘించినందుకు ఆర్‌బీఐ రూ.కోటిల జ‌రిమానా విధించింది. డాక్టర్ రెడ్డీస్‌ ల్యాబ్స్‌:- జ‌న‌రిక్ ఔష‌దం సుబాక్సోన్ కేసులో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌కు అమెరికా కోర్టు ఆఫ్ అప్పీల్స్‌లో ఊర‌ట ల‌భించింది. ఎన్‌బీసీసీ:- వివిధ వ్యాపార విభాగాల

Most from this category