STOCKS

News


10850పైన నిఫ్టీ

Thursday 29th November 2018
Markets_main1543489075.png-22490

  • మార్కెట్‌కు కలిసొచ్చిన పావెల్‌ వాఖ్యలు
  • నాలుగోరోజూ లాభాలే

ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపుపై అంచనాలు సన్నగిల్లడంతో పాటు డాలర్‌ మారకంలో రూపాయి 3నెలల గరిష్టానికి బలపడటంతో నవంబర్‌ నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చివరి రోజు మార్కెట్ భారీ లాభంతో ముగిసింది. అంతర్జాతీయంగా బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర 58డాలర్లకు చేరుకోవడంతో రేపు జరిగే జీ-20 సదస్సులో అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధ చర్చలు సానుకూల ఫలితాలు వెలువడవచ్చనే అశావహన అంచనాలు మార్కెట్‌ లాభాల సెంటిమెంట్‌కు కలిసొచ్చింది. ఈ సానుకూలాంశాలతో మార్కెట్‌ వరుసగా నాలుగోరోజూ లాభాలతోనే ముగిసింది. ఆర్థిక, మెటల్‌ రంగ షేర్ల ర్యాలీ ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 547 పాయింట్ల లాభాన్ని ఆర్జించగా, నిఫ్టీ 10880 పాయింట్ల వద్ద చేరుకుంది. అయితే చివర్లో ఇన్వెస్టర్ల కొంత అప్రమత్తతతో  చివరకు సెన్సెక్స్‌ 453 పాయింట్ల లాభంతో 36,170 వద్ద, నిఫ్టీ 130 పాయింట్ల లాభంతో 10,858 వద్ద ముగిసింది. బ్యాంకింగ్‌ షేర్లలో జరిగిన షార్ట్‌ కవరింగ్‌ కారణంగా నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 481 పాయింట్లు లాభపడి 26,939.60 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో మెటల్‌ ధరలు పెరగడంతో నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 2శాతం ర్యాలీ చేసింది. మరోవైపు రూపాయి ర్యాలీ కారణంగా నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 1.15శాతం నష్టపోయింది.
ఇంట్రాడేలో ట్రేడింగ్‌ సాగిందిలా:-
వరుస మూడు రోజుల లాభాల ర్యాలీకి కొనసాగింపు మార్కెట్‌ నేడు కూడా ఉత్సాహాంగా ట్రేడింగ్‌ను ప్రారంభించింది. సెన్సెక్స్‌ 281 పాయింట్ల లాభంతో 35,997 వద్ద, నిఫ్టీ 80 పాయిం‍ట్ల లాభంతో 10800పై 10808ల వద్ద ప్రారంభమైంది. వడ్డీరేట్ల పెంపుపై ఫెడ్‌ఛైర్మన్‌ పావెల్‌ కీలకవాఖ్యలు, ముడిచమురు ధరల తగ్గుదల, ట్రేడింగ్‌ ప్రారంభంలోనే డాలర్‌ మారకంలో రూపాయి విలువ 3నెలల గరిష్టానికి చేరుకోవడం తదితరాల కారణాలతో సూచీలు ట్రేడింగ్‌ ఆద్యంతం స్థిరమైన ర్యాలీ చేశాయి. ముఖ్యంగా మెటల్‌, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగాలకు చెందిన షేర్ల ర్యాలీ సూచీల భారీ ర్యాలీకి అండగా నిలిచాయి. మిడ్‌సెషన్‌ అనంతం ఆసియా మార్కెట్ల లాభాల ముగింపు, ఐరోపా మార్కెట్ల లాభాల ప్రారంభం వంటి సానుకూలాంశాలు ఇన్వెస్టర్లకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఈ దశలోనే నిప్టీ సూచి  151 పాయింట్లు లాభపడి 10880 వద్ద, సెన్సెక్స్‌ సూచీ 547 పాయింట్లు లాభంతో 36,254 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేశాయి. అనంతరం సూచీలు లాభాలు తగ్గుముఖం పట్టాయి. సూచీలు గరిష్టస్థాయిల వద్ద ట్రేడ్‌ అవుతుండంతో ట్రేడర్ల లాభాల స్వీకరణ, వచ్చే వారంలో ఆర్‌బీఐ పాలసీ, ఒపెక్‌ సమావేశాల నిర్ణయాల పట్ల అప్రమత్తత వహించడంతో సూచీలు కొంతమేర లాభాలను కోల్పోయాయి. చివరి సెన్సెక్స్‌ 36,213.54 వద్ద, నిప్టీ 10,867.25 వద్ద ముగిసింది.

మహీం‍ద్రా అండ్‌ మహీంద్రా, హిందాల్కో, బజాజ్‌-అటో, కోటక్‌ బ్యాంక్‌, బజాజ్‌ఫైనాన్స్‌ షేర్లు 3.50శాతం నుంచి 4.50శాతం వరకు లాభపడ్డాయి. ఎన్‌టీపీసీ, టెక్‌ మహీంద్రా, ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ 2.50శాతం నష్టపోయాయి.



You may be interested

మార్కెట్‌లోకి కొత్త ‘పల్సర్‌ 150’

Thursday 29th November 2018

ప్రముఖ వాహన తయారీ కంపెనీ బజాజ్‌ ఆటో తాజాగా తన పల్సర్‌ 150 నియాన్‌ బైక్‌లో అప్‌గ్రేడ్‌ వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ఎక్స్‌షోరూమ్‌ (ఢిల్లీ) ధర రూ.64,998. కొత్త లుక్‌, మంచి పనితీరు కోరుకునే కస్టమర్లకు తొలి ఎంపికగా పల్సర్‌ 150 నియాన్‌ ఉంటుందని బజాజ్‌ ఆటో ప్రెసిడెంట్‌ (మోటార్‌సైకిల్స్‌) ఎరిక్‌ వాస్‌ తెలిపారు. కొత్త పల్సర్‌.. నియాన్‌ రెడ్‌, నియాన్‌ ఎల్లో, నియాన్‌ సిల్వర్‌ అనే మూడు

బ్యాంక్‌ నిఫ్టీ 1.50శాతం అప్‌..!

Thursday 29th November 2018

బ్యాంకు షేర్లలో జరుగుతున్న షార్ట్‌ కవరింగ్‌ కారణంగా నిఫ్టీబ్యాంక్‌ ఇండెక్స్‌ సూచీ గురువారం ట్రేడింగ్‌లో 1.50శాతం పెరిగింది. ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 26,641 వద్ద ప్రారంభమైంది. సాదారణంగా ఎఫ్‌&ఓ ట్రేడింగ్‌ చివరి రోజు ఇన్వెస్టర్ల అప్రమత్తత కారణంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లలో ఎక్కువగా ఒడిదుడుకులకు లోనవుతుంటాయి. అయితే నేటి ట్రేడింగ్‌లో షార్ట్‌ కవరింగ్‌ కారణంగా బ్యాంకింగ్‌ షేర్లు స్థిరమైన ర్యాలీని చేస్తుండటం విశేషం. అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ వడ్డీరేట్లను పెంపుపై

Most from this category