STOCKS

News


10800 పైన నిఫ్టీ

Friday 14th December 2018
news_main1544782669.png-22939

ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరి అరగంట కొనుగోళ్ల కారణంగా లాభాలతో గట్టెక్కాయి. సెన్సెక్స్‌ సూచీ 33 పాయింట్ల లాభంతో 35,963 వద్ద, నిఫ్టీ సూచీ 14 పాయింట్లు లాభపడి 10800 పైన 10,805 వద్ద ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ 10 పాయింట్ల స్వల్ప లాభంతో 26,826 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్‌, అటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, రియల్టీ షేర్లు లాభపడగా, ఫైనాన్స్‌ సర్వీసెన్‌, ఫార్మా రంగాలకు చెందిన షేర్లు నష్టాలతో ముగిశాయి.అంత‌ర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలకు తోడు నేడు కొత్త గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ ఆధ్వర్యంలో ఆర్‌బీఐ డైరెక్టర్ల బోర్డు సమావేశం, టోకు ద్రవ్యోల్బణ గణాంకాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తతో మార్కెట్‌ మిశ్రమంగా ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 31 పాయింట్ల స్వల్పలాభంతో 35,960 వద్ద, నిఫ్టీ 7పాయింట్ల నష్టంతో 10,784 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం సెషన్‌లో ఫార్మా షేర్ల పతనంతో  సెన్సెక్స్‌ సూచీ 116 పాయింట్లను కోల్పోయి 35,814 వద్ద, నిఫ్టీ సూచీ 39 పాయింట్లను కోల్పోయి 10,752.10 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. మిడ్‌ సెషన్‌ అనంతరం వెలువడిన టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు, చివరి అరగంటలో కొనుగోళ్లు మార్కెట్‌ లాభాల ముగింపునకు కారణమయ్యాయి.
కోల్‌ ఇండియా, ఐఓసీ, యస్‌ బ్యాంక్‌, బీపీసీఎల్‌, భారతీఎయిర్‌టెల్‌ షేర్లు 2.50శాతం నుంచి 5.50శాతం లాభపడగా, జీ లిమిటెడ్‌, టైటాన్‌, హెచ్‌డీఎఫ్‌సీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు 1.50శాతం నుంచి 2శాతం నష్టపోయాయి.



You may be interested

బ్యాడ్‌న్యూస్‌.. బ్రహ్మాండమైన అవకాశం..

Friday 14th December 2018

ఇన్వెస్టర్లకు సెంట్రమ్‌ సూచన ప్రపంచ క్యాపిటల్‌ మార్కెట్‌ చరిత్రను పరిశీలిస్తే బ్యాడ్‌న్యూస్‌ వచ్చినప్పుడు ఇన్వెస్ట్‌మెంట్‌కు మంచి అవకాశమని నిరూపితమైందని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ రిసెర్చ్‌ హెడ్‌ జగన్నాధ్‌ తూనుగుంట్ల చెప్పారు. స్వల్పకాలిక ఆటుపోట్లను తట్టుకునే నాణ్యమైన స్టాకులను పరిశీలించడం మంచిదని సూచించారు. గత మూడునెలలుగా ఎన్‌బీఎఫ్‌సీలు, లిక్విడిటీ, రియల్టీ, క్రూడాయిల్‌ ధర, ఆర్‌బీఐ, ఎన్నికల ఫలితాలు.. ఇలా అనేక దుర్వార్తలు మార్కెట్‌ను చుట్టుముట్టాయి. దీంతో నిఫ్టీ దాదాపు 10 శాతం పతనమైంది. కొన్ని

టెలికాం షేర్ల లాభాల మోత

Friday 14th December 2018

కాల్‌ ధరలపై ట్రాయ్ విధించిన ఆంక్షలను టెలికాం డిస్ప్యూట్స్ సెటిల్‌మెంట్ ఎండ్ అప్పిలేట్ ట్రిబ్యునల్(టీడీఎస్‌ఏటీ) తోసిపుచ్చడంతో శుక్రవారం టెలికాం షేర్లు లాభాల మోత మోగిస్తున్నాయి. టెలికాం రంగంలోకి రిలయన్స్ జియో రంగప్రవేశంతో తమ సబ్‌స్క్రెబర్లను నిలుపుకునేందుకు టారిఫ్ రేట్లను గణనీయంగా తగ్గించడంతో గత రెండేళ్లుగా పోటీదారు కంపెనీ భారీగా నష్టపోయాయి. టీడీఎస్‌ఏటీ తాజా తీర్పుతో రేట్ల విధింపు అంశంపై  ఇప్పుడు ప్రైవేట్ ఆపరేటర్లు స్వేచ్ఛను కలిగి ఉంటారు కాబట్టి ఆదాయం

Most from this category