STOCKS

News


రెండు రోజుల నష్టాలకు బ్రేక్‌

Friday 4th January 2019
Markets_main1546596799.png-23415

10700 పైకి నిఫ్టీ
బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్ల ర్యాలీ

రెండు రోజుల భారీ నష్టాలకు ముగింపు పలుకుతూ శుక్రవారం మార్కెట్‌ లాభాలతో ముగిసింది. బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ షేర్ల ర్యాలీ అండతో నిఫ్టీ తిరిగి 10700 స్థాయిని అందుకోగా, సెన్సెక్స్‌ 181 పాయింట్ల లాభాల్ని కూడగట్టుకుంది. తగ్గిన ముడిచమురు ధరలు, రూపాయి డాలర్‌ మారకంలో బలపడటం, ఆసియాలో పలు మార్కెట్ల లాభాల ట్రేడింగ్‌ తదితర సానుకూలాంశాలతో నేడు మార్కెట్‌ దేశీయ మార్కెట్‌ లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో 10,700 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 77 పాయింట్ల లాభంతో 35,590 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. లాభాలతో ప్రారంభమైన సూచీలకు ఉదయం సెషన్స్‌లో ఐటీ షేర్లు షాక్‌నిచ్చాయి. ఫారెక్స్‌ మారెట్లో రూపాయి ర్యాలీతో డాలర్‌ రూపంలో ఆదాయాలను ఆర్జించే ఐటీ షేర్ల నష్టాల బాట పట్టాయి. ఈ రంగంలో అధిక వెయిటేజీ కలిగిన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు 2శాతం క్షీణించడంతో ఈ ప్రభావం సూచీలపై కన్పించింది. దీనికి తోడు వచ్చే వారంలో ఈ ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసిక ఫలితాల విడుదల కానున్న నేపథ్యంలో ట్రేడర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో సూచీలు నష్టాల బాట పట్టాయి. ఒకానొక దశలో నిఫ్టీ 44 పాయింట్లను నష్టపోయి 10628 వద్దకు,  సెన్సెక్స్‌ 131 పాయింట్లను కోల్పోయి 35382 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. అయితే దశలో బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీ సూచీల నష్టాలకు అడ్డుకట్ట వేసింది. రుణాలను ఇచ్చే సామర్థం తగ్గిపోయిన నేపథ్యంలో క్యాపిటల్‌ అడెక్వసీ నిబంధనలను మరింత సరళతరం చేయాల్సిందిగా గురువారం ఆర్‌బీఐని పార్లమెంటరీ ప్యానెల్‌ కోరడంతో  ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు భారీగా లాభపడి సూచీలకు దన్నుగా నిలిచాయి. అలాగే మన మార్కెట్‌ మిడ్‌సెషన్‌ ప్రారంభ సమయానికి యూరప్‌ మార్కెట్ల 1శాతం లాభాల ప్రారంభం ఇన్వెస్టర్లకు మరింత విశ్వాసాన్నినిచ్చాయి. మరోవైపు చివరి అరగంట కొనుగోళ్లు సైతం సూచీలకు కలిసొచ్చాయి. ఫలితంగా మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 181 పాయింట్ల లాభంతో 35,695 వద్ద, నిఫ్టీ 55 పాయింట్ల పెరిగి 10,727 వద్ద ముగిశాయి. బ్యాంక్‌ నిఫ్టీ 235 పాయింట్లు లాభపడి 27,195.00 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో రూపాయి ర్యాలీ కారణంగా ఒక్క నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌(1.30శాతం నష్టం) తప్ప మిగితా అన్ని రంగాలకు చెందిన ఇండెక్స్‌లు లాభాలతో ముగిశాయి. అత్యధికంగా ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ ఇండెక్స్‌ 2.50శాతం లాభపడింది.
భారతీఇన్ఫ్రాటెల్‌, టాటామోటర్స్‌, వేదాంత, యస్‌బ్యాంక్‌, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు 3శాతం నుంచి 5.50శాతం లాభంతో ముగియగా, ఇండస్‌ఇండ్‌, హీరోమోటోకార్ప్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు 1శాతం నుంచి 2శాతం నష్టపోయాయి.



You may be interested

సెంట్రమ్‌ టాప్‌ పిక్స్‌

Friday 4th January 2019

వచ్చే సంవత్సర కాలానికి సెంట్రమ్‌ బ్రోకింగ్‌ ఐదు టాప్‌ స్టాక్స్‌ను రికమండ్‌ చేస్తోంది 1. ఏసీసీ: టార్గెట్‌ రూ. 1820. మంచి రిటర్న్‌ రేషియో, బలమైన నిధుల సరఫరా ఉండి ఆకర్షణీయమైన వాల్యూషన్ల వద్ద ట్రేడవుతోంది. దశాబ్దం తర్వాత సామర్ధ్య విస్తరణ పనులు చేపడుతున్నట్లు ప్రకటించింది. ఇటీవల అంబుజాతో కుదుర్చుకున్న ఒప్పందం, డీజిల్‌ ధరల్లో క్షీణత కలిసివస్తాయి. 2. బజాజ్‌ఆటో: టార్గెట్‌ రూ. 3075. దేశంలో అగ్రగామి టు, త్రీవీలర్‌ సంస్థల్లో ఒకటి.

యూఎస్‌ మార్కెట్‌ సద్దుమణగాలి!

Friday 4th January 2019

యూఎస్‌ మార్కెట్లలో అలజడి సద్దు మణిగితేనే ఈ ఏడాది భారత్‌తో పాటు ఇతర వర్దమాన దేశాల మార్కెట్లు మంచి ప్రదర్శన చూపుతాయని హీలియోస్‌ క్యాపిటల్‌ మేనేజర్‌ సమీర్‌ అరోరా అభిప్రాయపడ్డారు. అయితే స్వల్పకాలానికి యూఎస్‌ మార్కెట్లో అలజడులుల తగ్గకపోవచ్చని, తీవ్రమైన కదలికలు నమోదవుతాయని అంచనా వేశారు. యూఎస్‌ మార్కెట్లు 5- 10 శాతం పడిపోయినా భారత మార్కెట్లు మంచిగానే ఉంటాయని, కానీ పాజిటివ్‌ రాబడులు పెద్దగా ఉండవని విశ్లేషించారు. గత

Most from this category