News


10550 పైకి నిఫ్టీ

Friday 2nd November 2018
Markets_main1541154763.png-21671

  • 579 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌

ప్రపంచమార్కెట్ల అందిన సానుకూలతతో మార్కెట్‌ ఈ వారాంతపు రోజైన శుక్రవారం భారీ లాభాల్లో ముగిసింది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ఝం ముగియబోతుందన్న అంచనాలతో ప్రపంచ మార్కెట్లన్నీ వువ్వెత్తున పెరిగిన ప్రభావంతో ఇక్కడి సూచీలు పరుగులు తీసాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దిగిరావడం, ఇంట్రాడేలో డాలర్‌ మారకంలో రూపాయి  రీకవరీ తదితర కారణాలు కూడా మార్కెట్‌ భారీ లాభాల ముగింపునుకు కారణమయ్యాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 35వేల మార్కు పైన, నిఫ్టీ 10550పై ముగిశాయి. ముఖ్యంగా అటో, మెటల్‌, ఎనర్జీ రంగ షేర్ల ర్యాలీ ట్రేడింగ్‌ ఆద్యంతం ర్యాలీకి చేసిన సూచీలు చివరకు సెన్సెక్స్‌ 580 పాయింట్ల లాభంతో 35,012 వద్ద, నిఫ్టీ 173 పాయింట్ల పెరిగి 10,553 వద్ద ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన నిఫ్టీ బ్యాంక్‌ 378 పాయింట్లు పెరిగి 25,701.65 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో అత్యధికంగా అటో ఇండెక్స్‌ సూచీ 4శాతం లాభపడింది. దీనికి తోడు మెటల్‌ ఇండెక్స్‌, ఎఫ్‌ఎంసీజీ, ఆర్థిక రంగ సూచీలు లాభాల్లో ముగిశాయి. రూపాయి బలపడంతో ఐటీ, ఫార్మా షేర్లు నష్టపోయాయి. పీఎన్‌బీ ఈ క్యూ2లో భారీ నష్టాలను నమోదు చేయడంతో ప్రభుత్వరంగ బ్యాంక్‌ ఇండెక్స్‌ అరశాతం నష్టపోయింది.
ఇండస్‌ఇండ్‌, టాటామోటర్స్‌, బీపీసీఎల్‌, మారుతి, వేదాంత లిమిటెడ్‌ షేర్లు 5నుంచి 6.50శాతం లాభపడగా, జీ లిమిటెడ్‌, సిప్లా, డాక్టర్‌ రెడ్డీస్‌, విప్రో, టెక్‌ మహీంద్రా షేర్లు 1.50శాతం నుంచి 4శాతం నష్టపోయాయి.



You may be interested

మోతీలాల్‌ ఓస్వాల్‌ దీపావళీ ‘వెలుగు దివ్వెలు’

Friday 2nd November 2018

ఈ దీపావళి నుంచి వచ్చే దీపావళి లోపు ఇన్వెస్టర్లకు లాభాలు పూలు కురిపించే స్టాక్స్‌ వివరాలను ప్రముఖ బ్రోకరేజీ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ ప్రకటించింది. అవి.. మారుతి సుజుకీ, హిందాల్కో, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, పీవీఆర్‌, ఒబెరాయ్‌ రియాలిటీ, ఇన్ఫోసిస్‌, ఇంద్రప్రస్థ గ్యాస్‌, ఐసీఐసీఐ బ్యాంకు, బ్రిటానియా ఇండస్ట్రీస్‌, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌, అశోక్‌లేలాండ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, కుమిన్స్‌ ఇండియా, వోల్టాస్‌, గోద్రేజ్‌ కన్జ్యూమర్‌.    1. మారుతి సుజుకీ లక్ష్యం రూ.8,484, రాబడి 26

ఈ 4 రంగాల్లో ఆకర్షణీయ రాబడి..!

Friday 2nd November 2018

మిడ్‌క్యాప్‌ ఐటీ, కన్సూమర్‌ స్టెపుల్స్‌, ఇన్‌ఫ్రా, సిటీ గ్యాస్‌ రంగాల షేర్లపై బుల్లిష్‌గా ఉన్న డోలాట్ కాపిటల్ డైరెక్టర్ రీసెర్చ్ అమిత్ ఖురానా విమానయాన రంగ షేర్లకు దూరంగా ఉండమని సూచన ముంబై: రోడ్‌ ప్రాజెక్టేతర సోషల్‌ ఇన్‌ఫ్రా రంగంపై తాను బుల్లిష్‌గా ఉన్నట్లు డోలాట్ కాపిటల్ మార్కెట్‌ రీసెర్చ్‌ విభాగ డైరెక్టర్ అమిత్ ఖురానా అన్నారు. అయితే, ఈ రంగ కంపెనీలలో కూడా డీ-రేటింగ్‌ ఉందని వివరించారు. వడ్డీ రేట్ల మార్పు

Most from this category