STOCKS

News


ఇన్‌-లైన్‌లోనే నిఫ్టీ-50 ఎర్నింగ్స్‌..

Saturday 17th November 2018
Markets_main1542448780.png-22149

నిఫ్టీ-50 ఇండెక్స్‌ ఎర్నింగ్స్‌ ఇన్‌-లైన్‌లోనే ఉన్నాయని సెంట్రమ్‌ వెల్త్‌ బ్రోకింగ్‌ తెలిపింది. అధిక క్రూడ్‌ ధరలు, కరెన్సీ ఒడిదుడుకులు, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు వంటి ప్రతకూలతలలోనూ ఇండెక్స్‌లోని 50 కంపెనీల ప్రస్తుత క్యూ2 ఎర్నింగ్స్‌ అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2 హైబేస్‌తో పోలిస్తే ప్రస్తుత క్యూ2లో వివిధ కంపెనీల రెవెన్యూలో మంచి వృద్ధే నమోదయ్యిందని తెలిపింది. జీఎస్‌టీ అమలు, పండుగ సీజన్‌ క్యూ3కి వెళ్లడం వంటివి ఇందుకు కారణంగా పేర్కొంది. కరెన్సీ ఒడిదుడుకులు, కమోడిటీ ధరల పెరుగుదల వల్ల మార్జిన్లపై ఒత్తిడి నెలకొనడంతో కొన్ని కంపెనీల లాభదాయకత తక్కువగా నమోదయ్యిందని తెలిపింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఎక్స్‌పోజర్‌ వల్ల పలు బ్యాంకులు అధిక కేటాయింపులను ప్రకటించాయని పేర్కొంది. 
నిఫ్టీ-50 ఇండెక్స్‌లోని 40 నాన్‌-బీఎఫ్‌ఎస్‌ఐ కంపెనీల నికర అమ్మకాలు వార్షికంగా 26.8 శాతంమేర పెరిగాయని, నికర లాభం 10.9 శాతం ఎగసిందని తెలిపింది. ఇక 10 బీఎఫ్‌ఎస్‌ఐ కంపెనీల నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 16.5 శాతం ఎగసిందని, నికర లాభం 3.9 శాతం పెరిగిందని పేర్కొంది. 
బజాజ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ టాప్‌
బీఎఫ్‌ఎస్‌ఐ విభాగంలో ఎన్‌ఐఐ పరంగా బజాజ్‌ ఫైనాన్స్‌ మంచి పనితీరు కనబర్చిందని సెంట్రమ్‌ వెల్త్‌ బ్రోకింగ్‌ తెలిపింది. నికర లాభంలో యాక్సిస్‌ బ్యాంక్‌ ముందంజలో ఉందని పేర్కొంది. తక్కువ కేటాయింపుల కారణంగా బ్యాంక్‌ పీఏటీ 82.6 శాతం పెరిగిందని తెలిపింది. బీఎఫ్‌ఎస్‌ఐ విభాగంలో ఎన్‌ఐఐలో రణాత్మక వృద్ధిని ఏవి నమోదు చేయలేదని పేర్కొంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ మాత్రం తక్కువ వృద్ధి (12.4 శాతం) నమోదు చేసిందని తెలిపింది. అలాగే బ్యాంక్‌ నికర లాభం 55.8 శాతం తగ్గిందని పేర్కొంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఎక్స్‌పోజర్‌ కారణంగా యస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ లాభదాయకతపై ప్రభావం పడిందని తెలిపింది. నాన్‌-బీఎఫ్‌ఎస్‌ఐ విభాగంలో.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (నికర అమ్మకాల పరంగా), కోల్‌ ఇండియా (నికర లాభం పరంగా) మంచి పనితీరు కనబర్చాయి. ఇక భారతీ ఎయిర్‌టెల్‌ (నికర అమ్మకాల పరంగా), టాటా మోటార్స్‌ (నికర లాభం పరంగా) అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చాయని తెలిపింది. 
11 కంపెనీల ఫలితాలు అంచనాలు మించాయి  
నిఫ్టీ 50 కంపెనీల్లో 11 అంచనాలకు మించిన ఫలితాలను, 15 అంచనాలకు అనుగుణమైన ఫలితాలను, 13 మిశ్రమ ఫలితాలను, 11 అంచనాలకు దిగువున ఉన్న ఫలితాలను వెల్లడించాయని సెంట్రమ్‌ వెల్త్‌ బ్రోకింగ్‌ పేర్కొంది. ప్రస్తుత క్యూ2లో ఇండియన్‌ కంపెనీల ఎర్నింగ్స్‌ వృద్ధి బాగుందని పేర్కొంది. వార్షికంగా చూస్తే నికర లాభంలో దాదాపు 10 శాతం వృద్ధి కనిపించిందని తెలిపింది. రూపాయి క్షీణత, క్రూడ్‌ ధరల పెరుగుదల, బాండ్‌ ఈల్డ్స్‌ పెరుగుదల కోణంలో చూస్తే కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌ ఆమోదయోగ్యంగానే ఉన్నాయని పేర్కొంది. అయితే ఇదే ట్రెండ్‌ రానున్న రోజుల్లోనూ కొనసాగుతుందో.. లేదో.. చూడాల్సి ఉందని తెలిపింది.  



You may be interested

ట్రేడింగ్‌ మెంబర్లకు బీఎస్‌ఈ ప్రోత్సాహకాలు

Saturday 17th November 2018

ముంబై: నాన్‌-కాంపిటీటేవ్‌ బిడ్డింగ్స్‌లో రిటైల్‌ ఇన్వెస్టర్ల భాగస్వామ్యాన్ని విస్తృతం చేయడంలో భాగంగా బొంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ పలు ప్రోత్సాహక పథకాలను ప్రకటించింది. ప్రభుత్వ సెక్యూరిటీలు, టి-బిల్స్‌ (ట్రెజరీ బిల్లులు) వంటి విభాగాల్లో నవంబర్‌ 19 నుంచి ట్రేడింగ్‌ మెంబర్లకు పలు ప్రోత్సాహకాలు ఉండనున్నట్లు తెలిపింది. తొలుత ఆరు నెలలు కొనసాగే ఈ స్కీంలో వసూలు చేసిన మొత్తం, క్లైంట్ల సంఖ్య ఆధారంగా ప్రోత్సాహకాలు ఉంటాయని వెల్లడించింది. ఇక ఈ ఏప్రిల్‌

గోద్రేజ్‌ కన్సూమర్‌ టార్గెట్‌ రూ.640..!

Saturday 17th November 2018

ముంబై: గోద్రేజ్‌ కన్సూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ (జీసీపీఎల్‌) షేరు ధర మరింత పడిపోయే అవకాశం ఉందని టెక్నికల్‌ అనలిస్టులు సూచిస్తున్నారు. సెప్టెంబర్‌ 3నాటికి.. గరిష్టస్థాయి నుంచి ఏకంగా 25 శాతం పడిపోయిన ఈ షేరులో పతనం ఇంకా మిగిలే ఉందని విశ్లేషిస్తున్నారు. టెక్నికల్‌గా ఈ షేరు డెత్‌ క్రాస్‌కు చేరిందని వివరించారు. 50-రోజుల సగటు కదలికల స్థాయి 200-రోజుల సగటు కదలికల స్థాయి కంటే దిగువకు పడిపోందని.. ఇలా జరగడం

Most from this category