STOCKS

News


ఎన్‌హెచ్‌పీసీ షేర్ల బైబ్యాక్‌

Saturday 10th November 2018
Markets_main1541828803.png-21848

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జలవిద్యుదుత్పత్తి కంపెనీ ఎన్‌హెచ్‌పీసీ... షేర్లను బైబ్యాక్‌ చేసే అవకాశాలున్నాయి. ఈ నెల 14న(వచ్చే బుధవారం) జరిగే బోర్డ్‌ సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకుంటామని ఎన్‌హెచ్‌పీసీ తెలిపింది. అయితే ఎన్ని షేర్లను ఎంత సంఖ్యలో కొనుగోలు చేసేదీ, ఎంత మొత్తానికి కొనుగోలు చేసేది తదితర వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 నాటికి ఎన్‌హెచ్‌పీసీలో కేంద్ర ప్రభుత్వానికి 73.67 శాతం వాటా ఉంది. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల వాటా విక్రయం ద్వారా రూ.80,000 కోట్లు సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.  ప్రభుత్వ రంగ సంస్థల షేర్ల బైబ్యాక్‌, పీఎస్‌యూల మధ్య విలీనాలు, కొనుగోళ్ల ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంట్లో భాగంగానే ఎన్‌హెచ్‌పీసీ షేర్ల బైబ్యాక్‌ జరగనున్నది.



You may be interested

ఐఓబీ వడ్డీరేట్లు పెరిగాయ్‌

Saturday 10th November 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌(ఐఓబీ) బెంచ్‌ మార్క్‌ లెండింగ్‌రేట్‌ను 5 బేసిస్‌ పాయింట్లు పెంచింది.దీంతో అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లు పెరగనున్నాయి. మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్‌డ్‌ లెండింగ్‌రేట్‌(ఎమ్‌సీఎల్‌ఆర్‌)ను 0.05 శాతం పెంచుతున్నామని ఐఓబీ తెలిపింది. ఈ పెరుగుదల నేటి(శనివారం) నుంచే అమల్లోకి వస్తుందని తెలిపింది. రెండేళ్ల కాల పరిమితి ఉన్న రుణాలపై వడ్డీరేటు 8.8 శాతం నుంచి 8.85 శాతానికి పెరుగుతుందని పేర్కొంది. అలాగే

31 ఎన్‌బీఎఫ్‌సీల రిజిస్ట్రేషన్ రద్దు

Saturday 10th November 2018

ముంబై: దాదాపు 31 నాన్‌-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ) రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రిజర్వ్ బ్యాంక్‌ రద్దు చేసింది. వీటిలో 27 సంస్థలు బెంగాల్‌కి చెందినవే కావడం గమనార్హం. ఆర్‌బీఐ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది.  ఎన్‌బీఎఫ్‌సీలు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. రిజిస్ట్రేషన్ రద్దయిన వాటిల్లో నాలుగు సంస్థలు ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందినవి ఉన్నాయి. మరోవైపు, ఆయా సంస్థల అభ్యర్ధన మేరకు 17

Most from this category