STOCKS

News


వచ్చే ఏడాదే భారీ మిడ్‌క్యాప్‌ ర్యాలీ?! అమిత్‌జస్వాని

Tuesday 23rd April 2019
Markets_main1555958744.png-25277

వచ్చే బుల్‌ ర్యాలీలో ఏదో ఒక రంగం లీడ్‌ రోల్‌ పోషిస్తుందని, ఆ రంగం స్టాక్స్‌ను కొనుగోలు చేసుకోవాలని స్టాలియన్‌ అస్సెట్‌ సీఐవో అమిత్‌జస్వాని సూచించారు. కన్జ్యూమర్‌, ఫైనాన్షియల్స్‌ పట్ల తాము సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. వృద్ధి లేకుండా కేవలం వృద్ధి అంచనాల ఆధారంగా పోర్ట్‌ఫోలియో మేనేజర్లు అధిక పీఈ ‍స్టాక్స్‌ను కొనుగోలు చేయడం అంత సులభం కాదని, దీనివల్ల సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. పలు అంశాలపై ఆయన ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

 

‘‘ముంబైలో రెస్టారెంట్లు, బార్లు మంచి వ్యాపారాలను చేస్తున్నాయి. చైనాలో క్వీచో అనే ఆల్కహాల్‌ కంపెనీ ఉంది. దాని మార్కెట్‌ క్యాప్‌ 150 బిలియన్‌ డాలర్లు. దీర్ఘకాలంలో ఈ తరహా థీమ్‌లు మంచిగా పనిచేస్తాయి’’అని జస్వాని తెలిపారు. ఫైనాన్షియల్‌ రంగ స్టాక్స్‌లో తాము దీర్ఘకాల దృష్టితో కొనసాగుతామని చెప్పారు. ఫైనాన్షియల్స్‌, కన్జ్యూమర్స్‌ రంగాల్లో లాభాలను సృష్టించుకోవచ్చన్నారు. ప్రైవేటు బ్యాంకులు, ప్రైవేటు ఫైనాన్షియల్‌ స్టాక్స్‌ను సూచించారు. ప్రభుత్వరంగ స్టాక్స్‌ను తాము కొనుగోలు చేయబోమని, అయితే, సాధారణ బీమా కంపెనీలు మంచి అవకాశాలను కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. కొత్తగా వచ్చిన బ్యాంకులో ఖాతా తెరవడానికి అంత ఆసక్తి చూపింబోమని, అదే 5,000 శాఖలతో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీలో ఖాతా తెరుస్తామన్నారు. ఇవి మంచి సైజులో ఉన్నట్టు చెప్పారు. ‘‘2017 మోసపూరిత కంపెనీలు, తక్కువ క్వాలిటీ కలిగిన స్టాక్స్‌ ఎక్కువ లాభాలను ఇచ్చాయి. కానీ 2018తో క్వాలిటీ స్టాక్స్‌దే హవా. ప్రతీ మూడేళ్లకు మిడ్‌క్యాప్‌ ర్యాలీ ఉంటుంది. 1999, 2003, 2007, 2010లో ఇదే జరిగింది. 2014లో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, 2017లోనూ ఇది చోటు చేసుకుంది. కనుక తదుపరి మిడ్‌క్యాప్‌ ర్యాలీ 2020 లేదా 2021లో జరగనుంది. కనుక మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ కొనుగోలుకు ఇది సరైన తరుణం’’ అని జస్వాని వివరించారు.  

 

ఆర్‌బీఐ వడ్డీ రేట్లను కనీసం ఒక శాతం తగ్గించాల్సిన అవసరం ఉందని జస్వాని అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం 2 శాతం స్థాయిలో ఉందన్నారు. ఇది పెరిగితే 3-4 శాతం వరకు వెళ్లొచ్చని, కానీ వడ్డీ రేట్లు మాత్రం 6-7 శాతం స్థాయిలో ఉ‍న్నట్టు చెప్పారు. పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ సైతం 7 శాతంగా ఉన్నట్టు పేర్కొన్నారు. చమురు ధరల ర్యాలీ సంప్రదాయమైనది కాదన్నారు. ఏవియేషన్‌ మినహా మిగతా రంగాలపై పెద్దగా ప్రభావం చూపించబోదన్నారు. ద్రవ్యోల్బణాన్ని కూడా అధిగమించాం గనుక మరింత రేట్ల కోత అవసరమన్నారు. కన్జ్యూమర్‌, ఫైనాన్షియల్స్‌ రెండింటిలో ఎన్‌బీఎఫ్‌సీల నుంచి తాము ప్రైవేటు ఫైనాన్షియల్స్‌కు మళ్లినట్టు చెప్పారు. అయితే ఈ రెండు రంగాల్లో ఎక్కువ లాభాలకు అవకాశం ఉందన్నారు. స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో లాభాలను గడించొచ్చు కానీ, వాటిని నిలుపుకోలేమన్నారు. ఆ లాభాలను ఇంటికి తీసుకెళ్లలేం కనుక సరైన ఎంపిక కాదన్నారు. కనుక నాణ్యమైన స్టాక్స్‌తో పోర్ట్‌ఫోలియో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ15 పాయింట్లు అప్‌

Tuesday 23rd April 2019

ప్రపంచ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో వున్నప్పటికీ, క్రితం రోజు భారీ పతనాన్ని చవిచూసిన భారత్‌ మార్కెట్‌  మంగళవారం స్వల్పలాభాలతో ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఈ ఉదయం 8.50  గంటలకు 15 పాయింట్ల లాభంతో11,633 పాయింట్ల వద్ద కదులుతోంది. గత సోమవారం ఇక్కడ నిఫ్టీ ఏప్రిల్‌  ఫ్యూచర్‌ 11,618 పాయింట్ల వద్ద ముగిసింది.  అలాగే సోమవారం రాత్రి అమెరికా సూచీలు స్వల్పనష్టాలతో  తాజాగా ఆసియా సూచీలన్నీ కొద్దిపాటి నష్టాలతో ట్రేడవుతున్నాయి.

పెద్దగా తెలియని స్టాక్స్‌... అయినా దండిగా లాభాలు!

Tuesday 23rd April 2019

తన చర్యలన్నీ ఇతరులకు వ్యతిరేకంగా ఉన్నాయని సరైన పెట్టుబడిదారుడు భావిస్తాడన్నది బెంజమిన్‌ గ్రాహం సూత్రీకరణ. కాంట్రేరియన్‌ ఇన్వెస్టర్‌ (నలుగురికి భిన్నమైనవారు) తక్కువ ప్రాచుర్యం ఉన్న స్టాక్స్‌లో ఇ‍న్వెస్ట్‌ చేయడం వల్ల ఇతరుల కంటే రాబడుల పరంగా మెరుగైన స్థితిలో ఉంటారు. దీర్ఘకాలంలో తటస్థం నుంచి కొద్దిగా తెలిసిన కంపెనీలు ఇతర కంపెనీలతో పోలిస్తే గణనీయమైన రాబడులను ఇవ్వగలవని మోతీలాల్‌ ఓస్వాల్‌ అధ్యయన పూర్వకంగా వెల్లడించింది.    మార్చి త్రైమాసికంలో ప్రముఖ కంపెనీల పనితీరు

Most from this category