అమెరికాకు వచ్చే రోజులు చాలా కీలకం!!
By Sakshi

రానున్న కొన్ని రోజులు అమెరికా మార్కెట్లకు చాలా కీలకమని పోస్ట్ షెల్టర్ మేనేజ్మెంట్ సీఈవో, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ రిచర్డ్ హ్యారిస్ తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. కంపెనీల నుంచి వెలువడుతున్న ఎర్నింగ్స్ అంత చెత్తగా అయితే లేవని పేర్కొన్నారు. ఆర్థికాంశాలు కూడా బాగానే ఉన్నాయని, అయితే కొంచెం దిగాలుగా ఉన్నాయని తెలిపారు. అలాగే గృహ విక్రయాలు బలంగా లేవని పేర్కొన్నారు. టారిఫ్ యుద్ధం వల్ల చైనాపై ఎక్కువ ప్రభావం ఉంటుందని, అదేసమయంలో అమెరికాపై కూడా ప్రభావం ఉంటుందని తెలిపారు. మార్కెట్లలో ఒడిదుడుకులు ఉంటాయని ఫిబ్రవరిలోనే అంచనా వేశామని, అందువల్ల ప్రస్తుత కరెక్షన్ గురించి పెద్దగా ఆందోళన చెందడం లేదన్నారు. ఇండెక్స్‌లు ఈ ఏడాది ఫ్లాట్‌గానే ఉండొచ్చని తెలిపారు.
మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. బలమైన డాలర్ కారణంగా యూరప్‌లో ఆర్థిక వ్యవస్థలు కొద్దిగా నెమ్మదించాయని, వర్ధమాన మార్కెట్లలోనూ ఇవే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. మార్కెట్లలో పెరుగుదల, తగ్గుదల రెండూ ఉంటాయని, అప్పుడప్పుడు పతనాలు కూడా వస్తుంటాయని పేర్కొన్నారు. సాధారణంగా చూస్తే ఎర్నింగ్స్ బాగున్నాయని తెలిపారు. ఈ అంశం మార్కెట్లపై ప్రభావం చూపుతుందని అనుకోవడం లేదన్నారు. అలాగే మార్కెట్లు క్రమంగా పడిపోతుందని కూడా భావించడం లేదని తెలిపారు. అయితే ఇది కన్సాలిడేషన్ ఏడాది అనుకోవచ్చన్నారు.
మార్కెట్లలో ప్రతికూల వార్తలు వస్తుంటాయన్నారు. గతేడాది కొరియా న్యూక్లియర్ యుద్ధ భయాలను గుర్తుచేశారు. మార్కెట్లలో పెద్ద పుల్‌బ్యాక్ ఉంటుందని అంచనా వేశారు. డౌజోన్స్ 600 పాయింట్లు పడిపోవడం సీరియస్ అంశమేనని, అయితే ఇప్పుడు డౌజోన్స్ గరిష్ట స్థాయిల్లో ఉందన్న అంశాన్ని గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. పుల్బ్యాక్స్ వల్ల మళ్లీ పుల్బ్యాక్స్ ఏర్పడతాయని, అప్పుడు ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపుతారని, అప్పుడు నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. అమెరికా మార్కెట్లు గత రెండేళ్లుగా ర్యాలీ చేస్తూ వచ్చిందన్నారు. ప్రస్తుత ఏడాది ఫ్లాట్‌గా ఉందన్నారు. 2016 మార్చి నుంచి చూస్తే ఈ ఏడాది ప్రారంభం వరకు మార్కెట్లు చాలా బాగున్నాయని తెలిపారు. అందువల్ల పుల్‌బ్యాక్ పెద్ద విషయమేమీ కాదని పేర్కొన్నారు. మార్కెట్లలో క్రాష్ ఉండకపోవచ్చని, ఈ ఏడాది ఫ్లాట్‌గా ఉంటాయని తెలిపారు.
చైనా మార్కెట్లో షాంఘై ఇండెక్స్‌కు 2,540 వద్ద మంచి మద్దతు స్థాయి లభిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థల కొనుగోళ్ల ద్వారా కానీ, వ్యక్తులకు పన్ను రాయితీలు అందించడం ద్వారా కానీ చైనా ఆ స్థాయిని కాపాడుకోవచ్చని తెలిపారు. చైనా మార్కెట్ నిలకడగా ఉంటే.. దాని వల్ల వర్ధమాన మార్కెట్లపై సానుకూల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. అందువల్ల ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకోవడం ముఖ్యమైన అంశమేనని తెలిపారు. చైనా మార్కెట్లు బాటమ్‌కు వచ్చాయో.. లేదో.. తెలియదని, అయితే చైనా ప్రభుత్వం మాత్రం వచ్చాయని భావిస్తోందని పేర్కొన్నారు.
You may be interested
ఏడాది కనిష్టానికి ఎల్అండ్టీ ఫైనాన్స్
Thursday 25th October 2018ముంబై:- క్యూ2 ఫలితాల్ని మార్కెట్ అంచనాలకు అనుగుణంగా సాధించినప్పటికి.., ఎల్అండ్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ షేరు గురువారం ట్రేడింగ్‌లో ఏడాది కనిష్టానికి పతనమైంది. నేడు బీఎస్ఈలో రూ.126.6ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో షేరు ఏకంగా 12శాతం పతనమై రూ.111.20ల వద్ద ఏడాది కనిష్టానికి చేరుకుంది. మధ్యాహ్నం గం.1:00లకు షేరు గత ముగింపు ధర(రూ.126.6)తో పోలిస్తే 7శాతం నష్టంతో రూ.117.50ల వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట,
25000 దిగువకు నిఫ్టీ బ్యాంక్
Thursday 25th October 2018మార్కెట్ నష్టాల ట్రేడింగ్‌లో భాగంగా గురువారం నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 25000ల దిగువకు పతనమైంది. నేడు బ్యాంకు ఇండెక్స్ 24,841.50ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే ఈ సూచీలో అధిక వెయిటేజ్ గల ఎస్బీఐ (2.50శాతం) ఐసీఐసీఐ (2శాతం) నష్టపోయాయి. ఫలితంగా ఇండెక్స్ ఏకంగా 1.25శాతం నష్టపోయి 25,064.20 కనిష్టానికి చేరుకుంది. ఉదయం గం.11:45ని.లకు ఇండెక్స్ గతముగింపుతో పోలిస్తే 1శాతం నష్టంతో 24,829ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే