9900 పాయింట్ల వద్ద కీలక మద్దతు
By D Sayee Pramodh

10550 పాయింట్ల వద్ద నిరోధం
నిఫ్టీకి దిగువన 9900- 9950 పాయింట్ల వద్ద కీలక మద్దతు ఉందని బొనాంజ సెక్యూరిటీస్ తెలిపింది. ప్రస్తుతం నిఫ్టీ కన్సాలిడేషన్ మూడ్‌లో ఉందని అభిప్రాయపడింది. 10200- 10550 పాయింట్ల మధ్యనే నిఫ్టీ తిరగాడవచ్చని అంచనా వేసింది. దిగువన 10200 పాయింట్లను నిలుపుకోలేకుంటే 9900 పాయింట్ల వరకు దిగజారుతుందని తెలిపింది. కన్సాలిడేషన్ రేంజ్‌ను బ్రేక్ చేస్తేనే తదుపరి కదలికలు నిర్ధారించుకోవచ్చని తెలిపింది. పైస్థాయిలో 10550 పాయింట్లకు పైన 10700 పాయింట్లు అత్యంత కీలక నిరోధమని వివరించింది. ఈ స్థాయిని దాటితే క్రమంగా 11000 పాయింట్ల వరకు నిఫ్టీ చేరవచ్చని అంచనా వేసింది. గత మూడునాలుగు రోజులుగా 100 రోజలు డీఎంఏ స్థాయికి పైన బేస్‌ను ఏర్పరుచుకుంటోందని, గురువారం పతనం అనంతరం ముగింపు సమయానికి కోలుకుంటే బాటమ్ స్థాయిలను ఖరారు చేసుకోవచ్చని తెలిపింది. ఆప్షన్స్ డేటా చూస్తే 10000- 10700 పాయింట్లు కీలక మద్దతు, నిరోధాలుగా ఉండవచ్చని తెలుస్తోందని వివరించింది. ప్రస్తుతం నిఫ్టీ డైలీ కనిష్ఠాల నుంచి కోలుకొంది. 10300 పాయింట్ల పైన ట్రేడవుతోంది. ఒక దశలో నిఫ్టీ 10200 పాయింట్లను కోల్పోయి 10150 పాయింట్ల దగ్గరకు వచ్చింది. మధ్యాహ్నం నుంచి సూచీల్లో చిన్నపాటి రికవరీ కనిపిస్తోంది.
You may be interested
కరెక్షన్కు కారణాలేంటి?
Thursday 11th October 2018ట్రేడ్ టెన్షన్లు, వడ్డీరేట్లు, కరెన్సీలే ప్రధాన భయాలు ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి తర్వాత మార్కెట్లు మహా పతనం చవిచూస్తున్నాయి. డౌజోన్స్ ఒక్కరోజులో 830 పాయింట్లకు పైగా పతనమై కీలక 26000 పాయింట్లను కోల్పోయింది. ఈ దెబ్బకు గురువారం అటు జపాన్ నుంచి ఇటు యూకే వరకు ప్రపంచ ప్రధాన మార్కెట్లన్నీ భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉన్నట్లుండి ఎందుకు మార్కెట్లలో ఇంతభారీ అమ్మకాలు ఆరంభమయ్యాయని సామన్య ఇన్వెస్టర్లు ఆందోళన పడుతున్నాడు. అయితే ఇది
కనిష్టస్థాయి నుంచి రికవరీ
Thursday 11th October 2018మిడ్‌సెషన్ సమయానికి మార్కెట్లో అమ్మకాల సునామీ తగ్గడంతో సూచీలు కనిష్టస్థాయి నుంచి రికవరీ బాట పట్టాయి. సెన్సెక్స్ సూచీ ఇంట్రాడే కనిష్టస్థాయి(33,723)నుంచి 548 పాయింట్లు కోలుకుని 34,270 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ సూచీ కనిష్టస్థాయి(10,138.60)నుంచి 183 పాయింట్లు రికవరీ అయ్యి 10,321.25 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ కనిష్టస్థాయి (24,494) నుంచి 392 పాయింట్లు లాభపడి 24886 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ