STOCKS

News


వ్యాల్యూ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో కొత్త స్టాక్స్‌

Wednesday 20th February 2019
Markets_main1550685546.png-24264

వ్యాల్యూ ఇన్వెస్టర్లు, ప్రముఖ ఇన్వెస్టర్లుగా పేర్కొనే డాలీఖన్నా, ఆశిష్‌ కచోలియా, పొరింజు వెలియాత్‌ వంటి వారి పోర్ట్‌ఫోలియోలోకి కొత్తగా కొన్ని స్టాక్స్‌ వచ్చి చేరాయి. డిసెంబర్‌ త్రైమాసికంలో మార్కెట్‌ డేటా ఆధారంగా ఈ వివరాలు వెలుగు చూశాయి. ఓ కంపెనీలో ఒక శాతానికి పైగా వాటాలున్న సాధారణ ఇన్వెస్టర్ల వివరాలను కంపెనీలు తెలియజేయాల్సి ఉంటుంది. ఆ ప్రకారం చూస్తే ఏస్‌ ఇన్వెస్టర్ల చేతికి చిక్కిన స్టాక్స్‌ వివరాలు ఇవి...

 

అన్సాల్‌ బిల్డ్‌వెల్‌
కోచికి చెందిన ఈక్విటీ ఇంటెలిజెన్స్‌ ఇండియాను నిర్వహించే పొరింజు వెలియాత్‌ అన్సాల్‌ బిల్డ్‌వెల్‌ కంపెనీలో 2.03 శాతం ఎక్స్‌పోజర్‌ తీసుకున్నారు. అది కూడా డిసెంబర్‌ త్రైమాసికంలో. ఈ కంపెనీ నాలుగు దశాబ్దాలుగా రియల్టీ రంగంలో ఉంది. 

 

ప్రాక్సిస్‌ హోమ్‌ రిటైల్‌
ఈక్విటీ ఇంటెలిజెన్స్‌ సంస్థ ప్రాక్సిస్‌ హోమ్‌ రిటైల్‌ కంపెనీలో 1.08 శాతం వాటా కొనుగోలు చేసింది. రిటైల్‌ దుకాణాల చైన్‌ హోమ్‌టౌన్‌ను ఈ కంపెనీ దేశవ్యాప్తంగా పలు పట్టణాల్లో నిర్వహిస్తోంది. ఇంటి డెకరేషన్‌, ఫర్నిచర్‌, అలంకరణ వస్తువులను విక్రయిస్తోంది. 

 

అసోసియేటెడ్‌ ఆల్కహాల్స్‌ అండ్‌ బ్రెవరీస్‌
చెన్నైకు చెందిన డాలీ ఖన్నా ఈ కంపెనీలో 1.03 శాతం వాటాలను డిసెంబర్‌ త్రైమాసికంలో కొనుగోలు చేశారు. ఈ కంపెనీ ప్రముఖ లిక్కర్‌ కంపెనీల్లో ఒకటి. ఎన్నో అంతర్జాతీయ, దేశీయ బ్రాండ్లను మార్కెట్‌ చేస్తోంది. స్మిర్నాఫ్‌, బ్లాక్‌ డాగ్‌, బ్లాక్‌ అండ్‌ వైట్‌, బ్యాగ్‌పైపర్‌, మెక్‌డొవెల్‌ నంబర్‌ 1, వైట్‌ మిస్‌చీఫ్‌ బ్రాండ్లు ఈ సం‍స్థ లిక్కర్‌ పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. 

 

ఐఎఫ్‌బీ ఇండస్ట్రీస్‌
మల్టీబ్యాగర్లను ఎంచుకోవడంలో పేరొందిన ఆశిష్‌ కచోలియా ఐఎఫ్‌బీ ఇండస్ట్రీస్‌ కంపెనీలో 1.05 శాతం వాటాలు కొన్నారు. వాషింగ్‌ మెషిన్లు, ఏసీలు, డిష్‌ వాషర్లు వంటి ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీలో ప్రముఖ కంపెనీ.



You may be interested

మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌లో జెమ్స్‌!

Wednesday 20th February 2019

గతేడాది ఆగస్ట్‌ నుంచి స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ భారీగా నష్టపోయాయి. దీంతో ఈ స్టాక్స్‌లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఒకటికి, రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గత ఆగస్ట్‌ నుంచి ఈ విభాగంలో చాలా స్టాక్స్‌ 98 శాతం వరకూ నష్టపోయాయి. కానీ, ఇదే కాలంలో సెన్సెక్స్‌, నిఫ్టీలు రికవరీ కావడం గమనార్హం. అయితే, ఇలా దారుణంగా పడిపోయిన స్టాక్స్‌లో మంచి జెమ్స్‌ కూడా ఉన్నాయంటున్నారు అనలిస్టులు.    గతేడాది ఆగస్ట్‌ నుంచి

9రోజుల నష్టాలకు బ్రేక్‌

Wednesday 20th February 2019

403 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌ 10735 వద్ద నిఫ్టీ సూచీల తొమ్మిది రోజుల సుధీర్ఘర్యాలీ బుధవారం బ్రేక్‌ పడింది. మెటల్‌, ఐటీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ షేర్ల ర్యాలీతో సెన్సెక్స్‌ 403పాయింట్లు లాభంతో 35756 వద్ద, నిఫ్టీ 131 పాయింట్ల లాభంతో 10735.50 వద్ద స్థిరపడ్డాయి. కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ 290 పాయింట్ల పెరిగి 26,955 వద్ద ముగిసింది. ప్రపంచమార్కెట్ల సానుకూల ర్యాలీని మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచింది. మార్కెట్‌ వరుస పతనంతో షేర్లు

Most from this category