STOCKS

News


కొత్త బాస్‌... యాక్సిస్‌ బ్యాంక్‌కు పాజిటివ్‌

Monday 10th September 2018
Markets_main1536569779.png-20130

కొత్త మేనేజ్‌మెంట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌కు అతిపెద్ద పాజిటివ్‌ అంశమని ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌కు చెందిన కూనల్‌ షా పేర్కొన్నారు. ఎర్నింగ్స్‌ మెరుగుదల, రుణ నాణ్యత పనితీరు వంటి అంశాలపై రీరేటింగ్‌ ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. కొత్త సీఈవో (హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఎండీ అమితాబ్‌ చౌదరీ యాక్సిస్‌ బ్యాంక్‌ సీఈవోగా, ఎండీగా రావడం) నియామకం యాక్సిస్‌ బ్యాంక్‌కు సానుకూలమని తెలిపారు. ఇక మేనేజ్‌మెంట్‌ సంబంధిత సమస్యలు పరిష్కారమౌతాయని పేర్కొన్నారు. అమితాబ్‌ నియామకాన్ని మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన ఒక బలమైన చర్యగా అభివర్ణించారు. ఈ వార్తకు అనుగుణంగా స్టాక్‌ ఇప్పటికే పాజిటివ్‌ మూమెంట్‌ను చూపిస్తోందని తెలిపారు. ఎర్నింగ్స్‌ మెరుగుదల, రుణ నాణ్యత పనితీరు, మేనేజ్‌మెంట్‌ వ్యూహాలు వంటి అంశాలపై ఆధారపడి స్టాక్‌ రీరేటింగ్‌ ఉంటుందని పేర్కొన్నారు. అమితాబ్‌ చౌదరీ గత ట్రాక్‌ రికార్డ్‌ స్టాక్‌కు సానుకూలమని తెలిపారు. స్టాక్‌ ప్రైస్‌పై మేనేజ్‌మెంట్‌ మార్పు ఇప్పటికే సానుకూల ప్రభావం చూపిందని, సమీప కాలంలోనూ ఇదే ట్రెండ్‌ ఉండొచ్చని, అయితే చివరకు మాత్రం ఎర్నింగ్స్‌ మెరుగుదల, రుణ నాణ్యత పనితీరు, మేనేజ్‌మెంజ్‌ వ్యూహాలు వంటివి స్టాక్‌ ధరను నిర్దేశిస్తాయని పేర్కొన్నారు. అందువల్ల ఈ అంశాలను గమనిస్తూ ఉండాలని తెలిపారు.   



You may be interested

టెక్‌ స్టాక్స్‌ను ఎంపిక చేసుకోవొచ్చు!

Monday 10th September 2018

ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో టెక్నాలజీ స్టాక్స్‌ను ఎంపిక చేసుకోవచ్చని జూలియస్‌ బేర్‌కు చెందిన మార్క్‌ మాథ్యూస్‌ పేర్కొన్నారు. రూపాయి కష్టాలకు అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతమవ్వడం, వాషింగ్టన్‌-బీజింగ్‌ మధ్య నడుస్తోన్న వాణిజ్య యుద్ధం కారణమని తెలిపారు. రానున్న రోజుల్లో ఈక్విటీ మార్కెట్‌ను ఏ ఏ అంశాలు ప్రభావితం చేస్తాయో అంచనా వేయడం కష్టమని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.   మనమున్న ప్రాంతం

లాభాల్లో ఐటీ ఇండెక్స్‌

Monday 10th September 2018

మిగిలిన ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే..! ముంబై:- రూపాయి భారీ పతనంతో మిడ్‌ సెషన్‌ సమయానికి మార్కెట్‌ నష్టపోయింది. ఇంట్రాడేలో డాలర్‌ మారకంలో రూపాయి 72.49 వద్ద కొత్త కనిష్ట స్థాయికి క్షీణించింది. ఫలితంగా సెన్సెక్స్‌ 400 పాయింట్ల నష్టపోయి 38 వేల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీ 130 పాయింట్ల నష్టపోయి 11450 వద్ద ట్రేడ్‌ అవుతోంది. రూపాయి దెబ్బకి అన్ని రంగాలకు చెందిన సూచీలు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., ఒక్క ఐటీ

Most from this category