STOCKS

News


నెస్లే, పేజ్‌ ఇండస్ట్రీస్‌కు వేటువెల్త్‌ రికమండేషన్‌

Monday 1st April 2019
Markets_main1554057372.png-24886

స్వల్ప కాలం నుంచి మధ్య కాలానికి మార్కెట్ల పట్ల తాము బుల్లిష్‌గా ఉన్నట్టు వేటువెల్త్‌ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఆదిత్య అగర్వాల్‌ తెలిపారు. నిఫ్టీ తిరిగి ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి 11,760.20ను టెస్ట్‌ చేస్తుందని పేర్కొన్నారు. స్వల్ప కాలంలో నిఫ్టీకి 11,620 మద్దతుగా నిలుస్తుందన్నారు. ఈ స్థాయి నుంచి నిఫ్టీ 11,760-11,800 స్థాయిలను చవిచూడొచ్చని అంచనా వ్యక్తం చేశారు. నిఫ్టీ కప్‌ అండ్‌ హ్యాండిల్‌ను ఏర్పరిచిందని చెప్పారు. దిగువ స్థాయిల్లో 11,570, 11,413, 11,311 మద్దతుగా పనిచేస్తాయన్నారు. మార్చి నుంచి ఏప్రిల్‌ సిరీస్‌కు రోలోవర్లు చాలా ఉత్సాహంగా జరిగాయని, బ్యాంకింగ్‌, ఎన్‌బీఎఫ్‌సీ, టెక్నాలజీ, సిమెంట్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌లో లాంగ్‌ రోలోవర్స్‌ జరిగాయని, ఆటో, మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లో షార్ట్‌ రోలోవర్లు జరిగినట్టు తెలిపారు. ఏప్రిల్‌లో 8-9 శాతం అప్‌సైడ్‌కు అవకాశం ఉన్న రెండు స్టాక్స్‌ను రికమండ్‌ చేశారు. 

 

నెస్లే ఇండియా
రూ.11,000-10,800 మధ్య కొనుగోలు చేసుకోవచ్చు. టార్గెట్‌ 11,650-12,000. దిగువ వైపున 10,500ను స్టాప్‌ లాస్‌గా పెట్టుకోవాలి. డైలీ చార్ట్స్‌లో బలమైన బేస్‌ను 10,000 సైకలాజికల్‌ మార్క్‌ దగ్గర ఏర్పరిచింది. గత రెండు వారాల్లో వేగంగా వెనక్కి బౌన్స్‌ అయింది. ఈ ప్రక్రియలో సిమ్మెట్రికల్‌ ట్రయాంగిల్‌ ప్యాటర్న్‌ నుంచి బ్రేకవుట్‌ను ధ్రువీకరించింది. హయ్యర్‌ డిగ్రీ చార్ట్‌ను పరిశీలిస్తే... అసెండింగ్‌ ట్రయాంగిల్‌ ప్యాటర్న్‌ను ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉంది. 

 

పేజ్‌ ఇండస్ట్రీస్‌
రూ.24,250-24,100 మధ్య కొనుగోలు చేసుకోవచ్చు. టార్గెట్‌ రూ.27,000. దిగువ వైపున రూ.23,300ను స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి. కాల వ్యవధి 15 నుంచి 21 రోజులు. నెలవారీ చార్ట్‌లో పేజ్‌ ఇండస్ట్రీస్‌ దిగువ గరిష్టాలు, దిగువ కనిష్టాలను నమోదు చేస్తూ వస్తోంది. ఫిబ్రవరి నెలలో స్టాక్‌ అప్పర్‌ స్లోపింగ్‌ ట్రెండ్‌ వద్ద మద్దతు తీసుకున్నది. మార్చిలో మంచి పుల్‌బ్యాక్‌ రాలీ చూపింది. అంతక్రితం నెల గరిష్ట స్థాయిని అధిగమించి హయ్యర్‌ టాప్‌, హయ్యర్‌ బాటమ్‌ను నమోదు చేసింది. డైలీ ఆర్‌ఎస్‌ఐ (14) 60 స్థాయి ఎగువకు ప్రవేశించింది. కనుక బుల్లిష్‌గా ఉన్నాం. You may be interested

దేశీయ మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల హవా

Monday 1st April 2019

దీర్ఘకాలం పాటు అగ్ర స్థాయి ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లుగా విదేశీ సంస్థలే రాజ్యమేలిన భారత మార్కెట్లలో ఇప్పుడు దేశీయ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు అగ్ర పథానికి చేరుకుంటున్నాయి. ఎల్‌ఐసీని మినహాయించి చూస్తే... టాప్‌-5 ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లలో ఒక్క క్యాపిటల్‌ గ్రూపును మినహాయిస్తే మిగిలిన నాలుగూ భారతీయ సంస్థలే ఉన్నాయి. రియల్‌ ఎస్టేట్‌, బంగారం నుంచి పొదుపు నిధులు ఈక్విటీలవైపు మరలడమే దేశీయ సంస్థలు అగ్ర పథానికి చేరుకోవడానికి కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.   దేశీయ

స్వల్పంగా పెరిగిన పసిడి

Saturday 30th March 2019

డాలర్‌ బలహీనతతో శుక్రవారం పసిడి ధర స్వల్ప లాభంతో ముగిసింది. రాత్రి అమెరికా మార్కెట్లో పసిడి ఔన్స్‌ పసిడి ధర 3.20డాలర్లు లాభపడి 1,298.50 డాలర్ల వద్ద స్ధిరపడింది. నిన్న రాత్రి అమెరికా విడుదలైన అమెరికా వినియోగదారుల వినిమయ గణాంకాలు మార్కెట్‌ వర్గాలను నిరుత్సాహపరచడంతో డాలర్‌ విలువ తగ్గుముఖం పట్టింది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ 96.562 స్థాయికి పతనమైంది. డాలర్‌ బలహీనత పసిడి ర్యాలీకి కారణమైంది.

Most from this category