STOCKS

News


ఐపీవోకు రెండు కంపెనీలు

Sunday 21st April 2019
Markets_main1555868642.png-25253

నియోజెన్‌ కెమికల్స్‌ రూ.132 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో ఈ వారంలోనే ఐపీవోకు రానుంది. బుధవారం ఇది ప్రారంభమవుతుంది. తాజా ఇష్యూ పరిమాణం రూ.70 కోట్లు. ప్రమోటర్లు హరిదాస్‌ తకర్షి కనాని, బీనా హరిదాస్‌ కనాని 29 లక్షల షేర్లను విక్రయించనున్నారు. ధరల శ్రేణి రూ.212-215. 

 

నియోజెన్‌ కంపెనీ ఆర్గానిక్‌ కెమికల్‌ కాంపౌండ్స్‌, బ్రోమిన్‌ కాంపౌండ్స్‌, ఇతర ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌ అయిన క్లోరిన్‌, ఫ్లోరిన్‌, ఐయోడిన్‌ తదితర రసాయనాలను ఫార్మాస్యూటికల్స్‌, ఆగ్రోకెమికల్‌, ఫ్లావర్‌, ఫ్రాగ్రాన్స్‌ పరిశ్రమల కోసం తయారు చేస్తుంటుంది. ఇన్‌ఆర్గానిక్‌ అయిన లిథియం కాంపౌండ్లను కూడా తయారు చేస్తోంది. వేపర్‌ అబ్జార్‌ప్షన్‌ మెషిన్లు, హీటింగ్‌ వెంటిలేషన్‌, ఎయిర్‌ కండీషనింగ్‌, రిఫ్రిజిరేషన్‌, కన్‌స్ట్రక్షన్‌ కెమికల్స్‌, ఫార్మాస్యూటికల్‌, స్పెషాలిటీ పాలిమర్‌లో వీటిని వినియోగిస్తారు. కంపెనీ ఆదాయంలో ఆర్గానిక్‌ కెమికల్స్‌ వాటా 60-70 శాతంగా ఉంది. మిగిలిన ఆదాయం ఇన్‌ర్గానిక్‌ కాంపౌండ్ల ద్వారా వస్తోంది. 

 

ఈ కంపెనీకి పోటీ సంస్థలను పరిశీలిస్తే... లిస్టెడ్‌ కంపెనీల్లో ఆర్తి ఇండస్ట్రీస్‌, అతుల్‌, నవీన్‌ ఫ్లోరిన్‌ ఇంటర్నేషనల్‌, వినతి ఆర్గానిక్స్‌, పౌషక్‌. ఇవి గత మూడేళ్లలో బాగా పెరిగినవి. నియోజన్‌ ధరల శ్రేణిలో గరిష్ట ధర రూ.215 ప్రకారం ఒక్కో షేరు 40.56పీఈలో ఆఫర్‌ చేస్తున్నట్టు. 2018-19 ఈపీఎస్‌ రూ.5.3గా ఉంది. ఆర్తి ఇండస్ట్రీస్‌, అతుల్‌ ఇండస్ట్రీస్‌ సైతం 39-40 పీఈలో ట్రేడవుతున్నవే. వినతి ఆర్గానిక్స్‌, పౌషక్‌, నవీన్‌ ఫ్లోరిన్‌ స్టాక్స్‌ పీఈ 20-58 మధ్య ఉన్నాయి. 

 

ఇండియామార్ట్‌
ఈ కామర్స్‌ సంస్థ ఇండియామార్ట్‌ సైతం ఐపీవోకు రానుంది. అయితే, ఎన్నికల తర్వాతే ఈ ఐపీవో ఉంటుందని కంపెనీ సంకేతమిచ్చింది. ఐపీవో ద్వారా రూ.3,250 కోట్లను సమీకరించాలనుకుంటోంది. ఈ కంపెనీ బిజినెస్‌ టు బిజినెస్‌ విభాగంలో ఈ కామర్స్‌ సేవల్లో ఉంది. 2018-19లో రూ.429 కోట్ల టర్నోవర్‌పై రూ.46 కోట్ల లాభాన్ని ఈ సంస్థ ప్రకటించింది. రానున్న రెండు సంవత్సరాల్లో ఏటా 29 శాతం వృద్ధి చెందనున్నట్టు, పెద్ద బ్రాండ్లను తమ ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకురానున్నట్టు కంపెనీ సీఈవో దినేష్‌ అగర్వాల్‌ తెలిపారు. ఐదు కోట్ల ఉత్పత్తుల సమాచారాన్ని, ఐదు లక్షల సరఫరాదారులను తమ ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. అధిక శాతం సంస్థలు చిన్న, మధ్య తరహావేనని తెలిపారు. ఇప్పుడు పెద్ద బ్రాండ్లపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. ఐపీవో అన్నది ప్రస్తుత ఇన్వెస్టర్లు కంపెనీ నుంచి బయటకు వెళ్లిపోయి, కొత్తవారు వచ్చేందుకేనన్నారు.You may be interested

పంచదార స్టాక్స్‌తో ఎల్‌ఐసీకి లాభాల మిఠాయి

Sunday 21st April 2019

వ్యాల్యూ ఇన్వెస్టర్‌ అనిల్‌కుమార్‌ గోయల్‌, ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ పంచదార స్టాక్స్‌లో పెట్టుబడులతో భారీ లాభాలను మూటగట్టుకున్నాయి!. గతేడాది షుగర్‌ స్టాక్స్‌లో గోయల్‌ అదే పనిగా పెట్టుబడులు పెడుతూ వచ్చారు. ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలు, బ్రెజిల్‌లో ఉత్పత్తి తగ్గడం పంచదార స్టాక్స్‌ ఫిబ్రవరి-మార్చి మధ్య ర్యాలీ జరపడానికి కారణమయ్యాయి. 26 షుగర్‌ కంపెనీల్లో 22 కంపెనీలు 40 శాతం వరకు పెరిగాయి. అయితే అంతకుముందు అంటే 2018

విప్రో బైబ్యాక్‌లో పాల్గొంటే పోదూ..!

Sunday 21st April 2019

ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో లాభం మార్చి త్రైమాసికంలో గణనీయంగా పెరిగింది. ఈ సందర్భంగా కంపెనీ రూ.10,500 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలుకు నిర్ణయం తీసుకుంది. కానీ, ఇవేవీ కంపెనీ షేరు ధరను పరుగెత్తించలేకపోయాయి. 2008-09 తర్వాత ఆదాయం విషయంలో దారుణ పనితీరు చూపించినది 2018-19లోనే కావడం గమనార్హం. ఆదాయం కేవలం 3.8 శాతమే వృద్ధి సాధించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి 4.3 శాతంగా ఉంది.

Most from this category