News


నష్టాల ప్రారంభం

Friday 8th February 2019
Markets_main1549598680.png-24077

సెన్సెక్స్‌ 190 పాయింట్లు, నిఫ్టీ 55 పాయింట్లు డౌన్‌

యూరోజోన్‌ వృద్ధి మందగిస్తుదంటూ యూరోపియన్‌ కమిషన్‌ హెచ్చరించడంతో గత రాత్రి అమెరికా, యూరప్‌ సూచీల క్షణతకు తోడు, తాజాగా ఆసియా మార్కెట్లు ప్రతికూలంగా ట్రేడవుతున్న నేపథ్యంలో శుక్రవారం భారత్‌ సూచీలు ప్రతికూలంగా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 92 పాయింట్ల తగ్గుదలతో 36,773 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 45 పాయింట్ల క్షీణతతో 11,015 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. క్రితం రోజు మార్కెట్‌ ముగిసిన తర్వాత నిరుత్సాహకరమైన ఆర్థిక ఫలితాల కారణంగా టాటా మోటార్స్‌ 20శాతం క్షీణించింది. ఐషర్‌ మోటార్స్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, సన్‌ఫార్మాలు 1 శాతం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇన్‌ఫ్రాటెల్‌, టైటాన్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌లు 1 శాతం వరకూ క్షీణతతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. గత రాత్రి అమెరికా  సూచీలు 1 శాతం మేర క్షీణించగా, యూరప్‌ సూచీలు 3 శాతం వరకూ పతనమయ్యాయి. తాజాగా జపాన్‌ సూచీ 1.5 శాతం నష్టాల్లో ట్రేడవుతుండగా, సెలవుల అనంతరం ప్రారంభమైన హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ 1 శాతం పతనమయ్యింది.  కొరియా కోస్పి ఇండెక్స్‌ కూడా అంతేశాతం క్షీణించింది. సింగపూర్‌ స్ర్టయిట్‌టైమ్స్‌ స్వల్ప నష్టాలతో ట్రేడవుతోంది.



You may be interested

టాటామోటర్స్‌ 20శాతం క్రాష్‌..!

Friday 8th February 2019

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికంలో కంపెనీ భారీ నష్టాలను నమోదు చేయడంతో టాటామోటర్స్‌ షేరు శుక్రవారం ట్రేడింగ్‌లో 22శాతం పతనమైంది. నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం కంపెనీ ప్రకటించిన క్యూ3 ఫలితాల్లో కంపెనీ రూ.26,961 కోట్ల నికర నష్టాన్ని కనపర్చింది. కంపెనీ చరిత్రలోనే ఒక త్రైమాసికంలో ఈ స్థాయి నష్టాలు రావడం తొలిసారి కావడం. ఫలితాలు మార్కెట్‌ వర్గాల్ని తీవ్ర నిరాశపరచడంతో నేడు బీఎస్‌ఈలో కంపెనీ షేరు గత ముగింపు(రూ.182.9)తో పోలిస్తే

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 25 పాయింట్లు డౌన్‌

Friday 8th February 2019

యూరోజోన్‌ వృద్ధి మందగిస్తుదంటూ యూరోపియన్‌ కమిషన్‌ హెచ్చరించడంతో గత రాత్రి అమెరికా, యూరప్‌ సూచీల క్షణతకు తోడు, తాజాగా ఆసియా మార్కెట్లు ప్రతికూలంగా ట్రేడవుతున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 25 పాయింట్లుతగ్గింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.40  గంటలకు 11,069 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌ 11,094 పాయింట్ల వద్ద ముగిసింది.  గత రాత్రి అమెరికా  సూచీలు 1

Most from this category