STOCKS

News


నష్టాలతో ప్రారంభం

Tuesday 29th January 2019
Markets_main1548734159.png-23859

సెన్సెక్స్‌ 75 పాయింట్లు, నిఫ్టీ 25 పాయింట్లు డౌన్‌

 

అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నడుమ మంగళవారం భారత్‌ సూచీలు నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రారంభ సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 75 పాయింట్లు క్షీణించి 35,580 పాయింట్ల వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల నష్టంతో 10,635 పాయింట్ల వద్ద కదులుతున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, బజాజ్‌ ఆటో, గెయిల్‌, యూపీఎల్‌, బీపీసీఎల్‌లు 1-2.5 శాతం మధ్య నష్టంతో ట్రేడవుతుండగా, అల్రా‍్టటెక్‌ సిమెంట్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, అదాని పోర్ట్స్‌లు 1-2 శాతం మధ్య లాభాలతో ప్రారంభమయ్యాయి. 

ప్రపంచ మార్కెట్లు డౌన్‌

అమెరికాలో మళ్లీ ప్రభుత్వ షట్‌డౌన్‌కు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారన్న వార్తలతో అమెరికా సూచీలు గత రాత్రి 1 శాతం వరకూ నష్టపోయాయి. ఇదే క్రమంలో తాజాగా ఉదయం 9.20 గంటలకు ఆసియా సూచీలన్నీ 0.2-0.6 శాతం మధ్య నష్టాలతో ట్రేడవుతున్నాయి. 



You may be interested

మార్కెట్లోకి సరికొత్త బాలెనో

Tuesday 29th January 2019

- అత్యాధునిక ఫీచర్లతో కొత్త వేరియంట్‌  ధర రూ.5.4 లక్షల నుంచి రూ.8.77 లక్షలు న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ బాలెనో మోడల్‌లో కొత్త వేరియంట్‌ను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త వేరియంట్‌ ధరలు రూ.5.4 లక్షల నుంచి రూ.8.77 లక్షల రేంజ్‌లో ఉంటాయని మారుతీ తెలిపింది. కొత్త బాలెనోలో రియర్‌ పార్కింగ్‌ కెమెరాతో కలసి ఉన్న కొత్త ఇన్ఫోటైన్మెంట్‌ సిస్టమ్‌, టూ టోన్‌ 16 అంగుళాల అలాయ్‌ వీల్స్‌, కారు

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 29th January 2019

వివిధ వార్తల‌కు అనుగుణంగా మంగ‌ళ‌వారం ప్రభావితమ‌య్యే షేర్ల వివ‌రాలు పెర్సిస్టెంట్ సిస్టమ్స్:- రూ.225 కోట్ల బై-బ్యాక్ ఇష్యూకు బోర్డు ఆమోదం తెలిపింది. ఐఎల్‌&ఎఫ్ఎస్ ట్రాన్స్‌పోర్టేష‌న్స్‌:- ద్రవ్యకొర‌త కార‌ణంగా ఎన్‌సీడీల‌పై డిబెంచ‌ర్ల హోల్డర్లకు చెల్లించాల్సిన వ‌డ్డీని చెల్లించ‌డంలో విఫ‌ల‌మైంది. నెట్‌వ‌ర్క్ 18 మీడియా అండ్ ఇన్వెస్ట్‌మెంట్‌:- కంపెనీ రూ.1000 కోట్ల రుణ స‌దుపాయాల‌కు ప్రముఖ రేటింగ్ సంస్థ ఇక్రా ఎఎఎ(స్టిరత్వం) రేటింగ్‌ను కేటాయించింది. న్యూజెన్ సాఫ్ట్‌వేర్ టెక్నాల‌జీస్‌:- ఉత్తర‌ప్రదేశ్‌లో నోయిడాలోని నూతన కార్యాల‌య భ‌వన నిర్మాణానికి 4,067

Most from this category