STOCKS

News


‘2008’ షాక్‌ నుంచి బయటపడని 500 స్టాక్స్‌!

Tuesday 18th September 2018
Markets_main1537213015.png-20336

స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు అంత ఆషామాషీ వ్యవహారం కాదనేందుకు ఎన్నో నిదర్శనాలను చెప్పుకోవచ్చు. 2008 నాటి మార్కెట్ల పతనం గుర్తుండే ఉంటుంది. నాటి పతనానికి ముందు ర్యాలీ చేసిన స్టాక్స్‌లో సుమారు 500 స్టాక్స్‌ ఇప్పటికీ నాటి ధరలను చేరుకోలేదు. ఆలోపే ట్రేడవుతుండడం ఆశ్చర్యకరం. కానీ 2008 నాటి కనిష్ట స్థాయిల నుంచి చూస్తే మార్కెట్‌ ప్రధాన సూచీలు 400 శాతం పెరిగాయి. కొన్ని స్టాక్స్‌ నూరు శాతం నుంచి 50,000 శాతం మధ్య రాబడులను ఇచ్చాయి. 

 

2008 నాటి ధరల్లోపే కొట్టుమిట్టాడుతున్నవన్నీ కూడా ఏవో చిన్న స్టాక్స్‌ అనుకుంటే పొరపాటే. ప్రముఖ కంపెనీలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, అలహాబాద్‌ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకు, యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, సిండికేట్‌ బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, ఉన్నాయి. ఇంకా రిలయన్స్‌ క్యాపిటల్‌, ఎన్‌ఎండీసీ, సెయిల్‌, హిందుస్తాన్‌ కాపర్‌, మెక్‌నల్లీ భారత్‌, హెచ్‌సీఎల్‌ ఇన్ఫోసిస్టమ్స్‌, బీఎఫ్‌ యుటిలిటీస్‌, జువారి గ్లోబల్‌, ఏషియన్‌ హోటల్స్‌, అబాన్‌ ఆఫ్‌షోర్‌, బీజీఆర్‌ ఎనర్జీ, రేవతి ఎక్విప్‌మెంట్‌, టీసీఐ ఇండస్ట్రీస్‌, జిందాల్‌ డ్రిల్లింగ్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌, కేశోరామ్‌ ఇండస్ట్రీస్‌, దాల్మియా భారత్‌ షుగర్‌ తదితర కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి.  

 

‘‘ఆశ అన్నది ఇన్వెస్టర్‌ లేదా ట్రేడర్‌ మంచి రాబడులను తీసుకోకుండా నిలువరిస్తుంది. మానసికంగా అధిగమించాల్సిన చాలా కీలకమైన అవరోధం ఇది’’ అని ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈవో ముస్తఫా నదీమ్‌ పేర్కొన్నారు. 2008 నాటి ధరల కంటే తక్కువలో ట్రేడ్‌ అవుతున్న స్టాక్స్‌లో ఇప్పటికీ కొనసాగుతున్న ఇన్వెస్టర్లు పునఃసమీక్షించుకోవాలని నిపుణలు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ పదేళ్లలో అద్భుతమైన బుల్లిష్‌ ర్యాలీని చూశామని, అయినా ఇప్పటికీ ఆనాటి ధరల కంటే తక్కువలోనే ట్రేడ్‌ అవుతున్నాయంటే అది పూర్తిగా ఆయా కంపెనీల అంతర్గత అంశాల వల్లేనని నదీమ్‌ పేర్కొన్నారు. కంపెనీ విజన్‌, వ్యాపార నమూనా లేదా రుణ భారం వంటి సమస్యలు ఉండి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.



You may be interested

స్వల్పంగా పెరిగిన రూపాయి విలువ

Tuesday 18th September 2018

క్రితం రోజు 60 పైసల వరకూ పతనమైన రూపాయి విలువ మంగళవారం స్వల్పంగా కోలుకుంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ స్వల్ప పెరుగుదలతో 72.46 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. రూపాయి స్థిరీకరణకు కేంద్రం పలు చర్యల్ని గతవారాంతంలో ప్రకటించినా, సోమవారం రూపాయి భారీగా పతనమైన సంగతి తెలిసిందే. భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 8.162 శాతంగా ఉంది. ఇక బాండ్‌ ఈల్డ్‌ శుక్రవారం ముగింపు స్థాయి 8.127 శాతంగా ఉంది.

అమెరికా ఉత్పత్తులపై సుంకాల విధింపు మళ్లీ వాయిదా?

Tuesday 18th September 2018

అమెరికా ఉత్పత్తులపై సుంకాల విధింపు అమలును మన దేశం మరోసారి వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తమ దేశంలోకి దిగుమతి అయ్యే స్టీల్‌, అల్యూమినియం ఉత్పత్తులపై టారిఫ్‌లు విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో అమెరికా నిర్ణయం మన దేశ ఎగుమతులపైనా ప్రభావం చూపించనుంది. దీనికి ప్రతి చర్యగా, అమెరికా టారిఫ్‌ల వల్ల మన దేశంపై ప్రభావానికి సమానంగా... అమెరికా నుంచి మన దేశానికి

Most from this category