STOCKS

News


40 స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఎఫ్‌ఐఐలకు భారీ వాటాలు

Thursday 14th March 2019
Markets_main1552586660.png-24611

ఇటీవలి మార్కె్‌ట్‌ ర్యాలీ ప్రధానంగా విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల కారణంగానే అని చెప్పొచ్చు. గతేడాది నుంచి మిడ్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ గణనీయంగా నష్టపోయి ఉన్నాయి. తాజాగా విదేశీ పెట్టుబడులతో మార్కెట్లో సానుకూల సెంటిమెంట్‌ నెలకొంది. మళ్లీ మోదీ సర్కారే వస్తుందని, బలమైన సంస్కరణలకు అవకాశం ఉంటుందన్న అంచనాలతో వారు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో మిడ్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో రికవరీ ఆరంభమైంది. చాలా వరకు స్టాక్స్‌ 10-40 శాతం మధ్యలో ఇప్పటికే ర్యాలీ చేశాయి. వీటిల్లో ఇన్వెస్ట్‌ చేయడానికి ఇది సరైన తరుణమని విశ్లేషకులు ఎంతో మంది అభిప్రాయపడుతున్నారు. కాకపోతే ఎంపిక జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ విధంగా చూసినప్పుడు ఓ కంపెనీలో విదేశీ ఇన్వెస్టర్లకు చెప్పుకోతగ్గ వాటాలు ఉంటే, వాటిపై ఓ కన్నేయవచ్చు. ఎందుకంటే విదేశీ ఇన్వెస్టర్లు సైతం వ్యాపార మూలాలు, వృద్ధి అవకాశాలు మెండుగా ఉన్న చిన్న కంపెనీల్లోనూ పెట్టుబడులు పెడుతుండడం గమనార్హం. 

 

డిసెంబర్‌ త్రైమాసికం చివరికి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు గణనీయంగా ఉన్న కంపెనీలను పరిశీలిస్తే... ప్రజ్‌ ఇండస్ట్రీస్‌లో 13.83 శాతం, శాటిన్‌ క్రెడిట్‌కేర్‌ (14.89శాతం), బలరామ్‌పూర్‌చినీ మిల్స్‌ (17.55 శాతం), జేకుమార్‌ ఇన్‌ఫ్రా (22.47 శాతం), ఇన్ఫోఎడ్జ్‌ ఇండియా (31.09 శాతం), వీఏ టెక్‌ వాబాగ్‌ (20.55 శాతం), సన్‌టెక్‌ రియాలిటీ (24.94 శాతం), కజారియా సిరామిక్స్‌ (24.68 శాతం), డీసీబీ బ్యాంకు (23.64శాతం), జుబిలంట్‌ లైఫ్‌సైన్సెస్‌ (24.89శాతం), ఫోనిక్స్‌ మిల్స్‌ (27.93శాతం), నిట్‌ టెక్నాలజీస్‌ (37.77శాతం), ఎస్కార్ట్స్‌లో 21.65 శాతం, రెడింగ్టన్‌ ఇండియాలో 35.25శాతం, రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌లో 21.39 శాతం, సైయంట్‌లో 43.13 శాతం, సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌లో 26.84శాతం, జస్ట్‌ డయల్‌లో 40.44 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. అలాగే, జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌, ఎన్‌సీసీ, సద్బావ్‌ ఇంజనీరింగ్‌, అవంతి ఫీడ్స్‌, డాక్టర్‌ లాల్‌ పాథ్‌ ల్యాబ్స్‌, ఇప్కా ల్యాబ్స్‌, గుజరాత్‌ గ్యాస్‌, వండర్‌లా హాలిడేస్‌, కర్ణాటక బ్యాంకు, గ్రీన్‌ ప్లై ఇండస్ట్రీస్‌, ఫీమ్‌ ఇండస్ట్రీస్‌, జిందాల్‌సా, పీఐ ఇండస్ట్రీస్‌, ఐనాక్స్‌ లీజర్‌, జమ్మూ కశ్మీర్‌ బ్యాంకు, జేఎస్‌డబ్ల్యూ హోల్డింగ్స్‌, హెడెల్‌బర్గ్‌ సిమెంట్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌ కంపెనీల్లోనూ విదేశీ ఇన్వెస్టర్లకు 10 శాతం పైనే వాటాలున్నాయి. 

 

‘‘దీన్ని పెద్ద ర్యాలీ అని ఇప్పుడే చెప్పలేం. స్మాల్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ ఇప్పుడే ఇన్వెస్టర్ల బుట్టల్లో పడుతున్నాయి. స్టాక్స్‌ వెంట పరుగులు తీయాల్సిన అవసరం లేదు. ఈ మార్కెట్లో కొనుగోళ్లకు అవకాశాలు ఉంటాయి. తదుపరి బుల్‌ మార్కెట్‌ మొదలైతే అది స్మాల్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఉంటుంది’’ అని ఎలిగ్జిర్‌ ఈక్విటీస్‌ డైరెక్టర్‌ దీపన్‌ మెహతా పేర్కొ‍న్నారు. లార్జ్‌క్యాప్‌ను మిడ్‌క్యాప్‌ అవుట్‌ పెర్‌ఫార్మ్‌ చేస్తాయన్నది తమ అంచనా అని కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ హెడ్‌ వివేక్‌ రంజన్‌ మివ్రా పేర్కొన్నారు.You may be interested

ఉన్నట్టుండి ఎఫ్‌పీఐల నిధుల వరద...!?

Thursday 14th March 2019

గత నెల వరకు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారత ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు సాగిస్తూ వచ్చారు. ముఖ్యంగా గతేడాది భారత స్టాక్స్‌ను పెద్దగా పట్టించుకోని ఎఫ్‌పీఐలు ఉన్నట్టుండి నికర కొనుగోలుదారులుగా మారారు. దీని వెనుక కారణాలను పరిశీలిస్తే... లిక్విడిటీ పరిస్థితులు మెరుగయ్యాయి. చమురు ధరలు గతేడాది గరిష్ట స్థాయిలకు చేరిన తర్వాత తిరిగి చల్లబడ్డాయి. కంపెనీల ఎర్నింగ్స్‌ రికవరీ అవుతాయన్న అంచనాలకుతోడు లోక్‌సభ ఎన్నికల తర్వాత రాజకీయ పరంగా

ఫ్లాట్‌ ముగిసిన సూచీలు

Thursday 14th March 2019

ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య తీవ్ర ఒడిదుడుకులకు లోనై సూచీలు చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ 3పాయింట్ల లాభంతో 37,755 వద్ద, నిఫ్టీ 1.50 పాయింట్లు పెరిగి 11,343 వద్ద స్థిరపడ్డాయి. ఇంట్రాడేలో బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీతో సూచీలు కొంతమేర లాభాల్ని ఆర్జించినప్పటికీ.., ఈ లాభాల్ని చివరి వరకు నిలుపుకోవడంలో విఫలయ్యాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీతో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 186 పాయింట్ల లాభపడి 29,028.90

Most from this category