STOCKS

News


నిఫ్టీలో సగానికి పైగా భారీగా నష్టపోయినవే

Wednesday 31st October 2018
Markets_main1540924473.png-21591

గత రెండు నెలల కాలంలో మన మార్కెట్లు కరెక్షన్‌ బాటలో ప్రయాణిస్తుండగా, ఈ కాలంలో ప్రధాన సూచీలు నిఫ్టీ-50, బీఎస్‌ఈలో సగానికి పైగా స్టాక్స్‌... 20 నుంచి 60 శాతం వరకు నష్టపోయాయి. నాణ్యమైన స్టాక్స్‌ సైతం ఆకర్షణీయ విలువల వద్ద లభిస్తున్నాయి. అంటే బేర్స్‌ వీటిని తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ‘‘ఇవి దిపావళి అమ్మకాలు. ఇన్వెస్టర్లు మంచి స్టాక్స్‌ను తప్పకుండా కొనుగోలు చేయవచ్చు. ఇండస్‌ఇండ్‌ బ్యాంకును ఈ స్థాయిల్లో నేను కొనుగోలు చేస్తాను. బ్యాంకు యాజమాన్యం ఎంతో నాణ్యమైనది’’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ దీపేన్‌షా తెలిపారు. మహీంద్రా ఫైనాన్స్‌, చోళమండలం ఫైనాన్స్‌ పట్ల ఆశాజనకంగా ఉన్నామని, ఆర్‌బీఎల్‌ బ్యాంకు దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చని, మధ్య కాలానికి 30-35 శాతం రాబడులను ఇచ్చే అవకాశం ఉందని వివరించారు.

 

సెన్సెక్స్‌లో 30 స్టాక్స్‌కు 15 స్టాక్స్‌ వాటి 52 వారాల గరిష్ట స్థాయి నుంచి 20-60 శాతం మధ్యలో పడిపోయాయి. టాటా మోటార్స్‌, వేదాంత, యస్‌ బ్యాంకు, ఐవోసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, ఏషియన్‌ పెయింట్స్‌, హీరో మోటోకార్ప్‌ తదితర కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే, 20 శాతం కంటే ఎక్కువ నష్టపోయాయని బేర్‌ దశ అని చెప్పకూడదని, వార్తల వారీగా చోటు చేసుకున్న కరెక్షన్‌గా నిపుణులు పేర్కొంటున్నారు. ‘‘నాలుగేళ్లుగా మాన మార్కెట్లు అప్‌ట్రెండ్‌లోనే ఉండగా, మధ్యలో అప్పుడప్పుడు 5-6 శాతం కరెక్షన్‌లు చోటు చేసుకుంటున్నాయి. కానీ ఆ తర్వాత ర్యాలీ జరుగుతూ వచ్చింది. ఇది పూర్తి స్థాయిలో బేర్‌ దశ కాదు. అంశాల ఆధారంగా చోటుచేసుకున్నదే. బలమైన ఆర్థిక మూలాలు ఉన్న లార్జ్‌క్యాప్‌ కంపెనీలు కొన్ని 20 శాతానికి పైగా నష్టపోయాయి. అయినప్పటికీ కొన్ని స్టాక్స్‌ బేర్‌ దశలోకి ప్రవేశించాయి. అయితే, మొత్తం మీద మార్కెట్‌ ఈవెంట్‌ ఆధారిత కరెక్షన్‌లోనే ఉంది’’ అని 5నాన్స్‌ సీఈవో దినేష్‌ రోహిరా చెప్పారు. స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌లో కరెక్షన్‌ చాలా తీవ్ర స్థాయిలో ఉందని, నాణ్యమైన యాజమాన్యం, వ్యాపారం ఉన్న స్టాక్స్‌ను కొనేందుకు ఇది అవకాశమని నిపుణులు చెబుతున్నారు. అయితే, బాగా నష్టపోయిన ప్రతీ స్టాక్‌ కొనుగోలుకు అవకాశం కాదన్నది గుర్తు చేస్తున్నారు. You may be interested

మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులపై పన్ను ఇలా...

Wednesday 31st October 2018

మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్లు పెట్టిన పెట్టుబడి వృద్ధి, డివిడెండ్‌ ఆదాయం రూపంలో లాభాలు గడిస్తుంటారు. ఈక్విటీ ఫండ్స్‌ అయితే లాభాలు వచ్చినప్పుడు సహజంగా ఏఎంసీలు డివిడెండ్‌ ప్రకటిస్తుంటాయి. అలాగే, డెట్‌ ఫండ్స్‌ అయితే వడ్డీ రూపంలోనూ ఇన్వెస్టర్లకు స్థిరమైన రాబడి ఉంటుంది. దీంతో పెట్టుబడి వృద్ధి జరుగుతుంది. మొత్తానికి భిన్న స్థాయిల్లో మూల ధన లాభం అనేది ఉంటుంది. దీనిపై ఫండ్‌ కేటగిరీని బట్టి పన్ను మారిపోతుంది. ఏ తరహా

ఎస్‌బీఐ, ఆర్‌ఐఎల్‌.. ఇన్వెస్ట్‌ చేయొచ్చు: ఐఐఎఫ్‌ఎల్‌

Tuesday 30th October 2018

ఇటీవలి మార్కెట్‌ కరెక్షన్‌లో పలు విలువైన షేర్లు చౌకగా లభిస్తున్నాయని, నాణ్యమైన షేర్లను ఎంపికచేసుకుని, పెట్టుబడి చేసేందుకు ఇది తరుణమని ఐఐఎఫ్‌ఎల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (రీసెర్చ్‌) అభిమన్యు అంటున్నారు. ఆయన ఒక ఆంగ్లచానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నారు. ఇంటర్వ్యూ అంశాలు.... మనీ మార్కెట్‌ కారణం... ఇటీవలి భారీ పతనానికి మనీ మార్కెట్లో ఏర్పడ్డ సంక్షోభమే ప్రధాన కారణమని,ఇప్పుడా మార్కెట్లో పరిస్థితులు గణనీయంగా మెరుగుపడినందున స్టాక్‌ మార్కెట్‌పై సానుకూల ప్రభావం ప్రసరించిందన్నారు.

Most from this category