STOCKS

News


సుస్థిర ప్రభుత్వ ఆశలతో సెంటిమెంట్‌లో రికవరీ

Saturday 16th March 2019
Markets_main1552734251.png-24645

మార్కెట్లపై సీఎల్‌ఎస్‌ఏ
రాబోయే ఎన్నికల్లో స్థిరప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాలు మార్కెట్లో తాజాగా సెంటిమెంట్‌ పాజిటివ్‌గా మారేందుకు దోహదం చేశాయని అంతర్జాతీయ బ్రోకింగ్‌ దిగ్గజం సీఎల్‌ఎస్‌ఏ అభిప్రాయపడింది. ఎన్‌డీఏ ప్రభుత్వం తిరిగి ఏర్పడుతుందన్న ఊహాగానాలతో పెట్టుబడి సెంటిమెంట్‌ పునరుజ్జీవమవుతోందని తెలిపింది. తాజా ఒపీనియన్‌పోల్స్‌లో బీజేపీ సీట్ల సంఖ్య మరో 30-40 వరకు పెరిగిందని తెలిపింది. దీంతో పాటు ఈశాన్యరాష్ట్రాల్లో కీలకమైన ప్రీపోల్‌ సర్దుబాటును బీజేపీ ప్రకటించిందని, దీంతో 6- 10 సీట్లలో గెలుపు అవకాశాలు మెరుగుపడ్డాయని తెలిపింది. ఎన్నికల తేదీ ప్రకటించినప్పటినుంచి దేశీయ సూచీల్లో ర్యాలీ ఆరంభమైంది. ఒపీనియన్‌ పోల్స్‌లో బీజేపీకి మెజార్టీ వస్తుందన్న అంచనాలు మార్కెట్లో ఉత్సాహం నింపాయి. పుల్వామా ఘటన అనంతరం ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో ప్రజల్లో పాజిటివ్‌ గుర్తింపు వచ్చినట్లు మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. దీనికితోడు ప్రపంచ కేంద్రబ్యాంకుల్లో ఎక్కువ శాతం రేట్ల తగ్గింపు మార్గం పట్టడం కూడా ఇన్వెస్టర్లపై సానుకూల ప్రభావం చూపుతోంది.

ఫెడ్‌, ఈసీబీ సైతం వడ్డీరేట్లపై మృదువుగా మారడంతో వర్ధమాన మార్కెట్లలో పాజిటివ్‌ పవనాలు ఆరంభమయ్యాయని సీఎల్‌ఎస్‌ఏ తెలిపింది. మార్చిలో ఇంతవరకు ఎఫ్‌పీఐలు దాదాపు 16500 కోట్ల రూపాయలను ఈక్విటీల్లో కుమ్మరించాయి. మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌లో ఈ రికవరీ మరింత స్పష్టంగా కనిపిస్తోందని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. మార్కెట్లో రికవరీ, ఆర్సెలార్‌ డీల్‌ తదితర కారణాలతో రూపాయి బలపడిందని, రైట్స్‌ ఇష్యూల నిధుల రాక కొనసాగితే రూపీలో రికవరీ కొనసాగుతుందని పేర్కొంది. అందువల్లనే ఐటీ రంగంపై వెయిటేజ్‌ను స్వల్పంగా తగ్గిస్తున్నట్లు తెలిపింది. 



You may be interested

ఇండియాలోకి టెస్లా!

Saturday 16th March 2019

ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది పక్కా ఎలన్‌మస్క్‌ ప్రపంచ ప్రఖ్యాత టెస్లా కంపెనీని ఇండియాలో కూడా విస్తరిస్తామని ఎలన్‌ మస్క్‌ చెప్పారు. ఈఏడాదే ఇండియాలోకి వచ్చేందుకు యత్నిస్తామని, కుదరకపోతే వచ్చే ఏడాది తప్పకవస్తామని టెస్లా సీఈఓ ట్విటర్‌లో చెప్పారు. భారత్‌లో కాలుమోపేందుకు టెస్లా గతంలో యత్నించింది. అయితే ఇక్కడి విధాన పాలసీలు కఠినంగా ఉన్నాయని గతేడాది మస్క్‌ విమర్శలు గుప్పించారు. భారత్‌లో ఫ్యాక్టరీ పెట్టేందుకు మస్క్‌ను ఒప్పించాలని మోదీ ప్రభుత్వం చాలాయత్నాలు

ఆప్షన్స్‌తో లాభాలకు రక్ష!

Saturday 16th March 2019

పోర్టుఫోలియో హెడ్జింగ్‌కు ఆప్షన్స్‌ను ఎంచుకోవడం ద్వారా లాభాలను రక్షించుకోవచ్చని మార్కెట్‌ నిపుణులు సలహా ఇస్తున్నారు.  ఉదాహరణకు x అనే స్టాకు వంద రూపాయల వద్ద ట్రేడవుతుందనుకుందాం. మనం కొన్న తర్వాత ఈ స్టాకు రూ. 110కి చేరిందని భావించండి. అంటే వంద రూపాయల కొనుగోలుపై పదిరూపాయల లాభం కనిపిస్తోంది. ఈ లాభాన్ని కాపాడుకొనేందుకు ఒక 110 పుట్‌ కొనుగోలు చేశారనుకుందాం. ఇప్పుడీ స్టాకు తిరిగి రూ. 110 దిగువకు వస్తే పుట్‌

Most from this category