STOCKS

News


ఐసీఈఎక్స్‌లో ఎన్‌ఎంసీఈ విలీనానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం

Tuesday 4th September 2018
Markets_main1536036818.png-19930

ముంబై: నేషనల్‌ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌ (ఎన్‌ఎంసీఈ)ను ఇండియన్‌ కమోడిటీ ఎక్సేంజ్‌ (ఐసీఈఎక్స్‌)తో విలీనానికి, 1:10 రేషియోతో షేర్ల మార్పిడికి జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదం తెలియజేసింది. ఈ విషయాన్ని ఐసీఈఎక్స్‌ సీఈవో సంజిత్‌ ప్రసాద్‌ మీడియాకు తెలిపారు. దీంతో ఇరు కంపెనీల బోర్డులు ఈ వారంలో సమావేశమై అధికారిక నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పారు. ఈ రెండు సంస్థలు విలీనంపై గతేడాది అంగీకారానికి వచ్చాయి. విలీనం అనంతరం ఐసీఈఎక్స్‌ సగటు రోజువారీ టర్నోవర్‌ రూ.300 కోట్లతో దేశంలో మూడో అతిపెద్ద కమోడిటీ ఎక్సేంజ్‌ అవుతుందని ప్రసాద్‌ తెలిపారు. ఎంసీఎక్స్‌, ఎన్‌సీడీఈఎక్స్‌ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఉమ్మడి సంస్థలో ఐసీఈఎక్స్‌ వాటాదారులకు 62.8 శాతం, ఎన్‌ఎంసీఈ వాటాదారులకు 37.2 శాతం వాటాలు లభిస్తాయి. విలీనం తర్వాత ఐసీఈఎక్స్‌లో బజాజ్‌ హోల్డింగ్స్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, పీఎన్‌బీ, నాఫెడ్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఎంఎంటీసీ, గుజరాత్‌ ఆగ్రో ఇండస్ట్రీస్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంకు, సెంట్రల్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌, క్రిభ్‌కో, ఇండియా పొటాష్‌ వాటాదారులుగా ఉంటాయి. 
 



You may be interested

హయ్యర్‌ నుంచి అత్యాధునిక రిఫ్రిజిరేటర్‌

Tuesday 4th September 2018

హైదరాబాద్‌: చైనాకు చెందిన హయ్యర్‌ ప్రీమియం గ్లాస్‌ ఫినిష్‌తో, పక్క, పక్కన డోర్లతో కూడిన అత్యాధునిక రిఫ్రిజిరేటర్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. చాక్లెట్‌, బ్లాక్‌ గ్లాస్‌ ఫినిష్‌తో రెండు రకాలుగా ఇది లభిస్తుందని కంపెనీ తెలియజేసింది. మెరుగైన పనితీరుతో పాటు అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయని పేర్కొంది. అడ్డంగా ఉండే డిజిటల్‌ కంట్రోల్‌ ప్యానల్‌ను పై భాగంలో కుడివైపున ఏర్పాటు చేసింది. క్విక్‌ కూల్‌, జీరో డిగ్రీ ఫ్రెష్‌, ఫిష్‌,

విద్యుత్ కొనుగోలు ఒప్పందం రద్దు చేయండి

Tuesday 4th September 2018

హైదరాబాద్‌: కృష్ణపట్నం అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టుతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని (పీపీఏ) రద్దు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రిలయన్స్ పవర్ కోరింది. రిలయన్స్ పవర్ అనుబంధ సంస్థ కోస్టల్ ఆంధ్రా పవర్ లిమిటెడ్ (సీఏపీఎల్‌) ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఏపీఎస్‌పీడీసీఎల్‌)కు ఒక లేఖ రాసింది. ఒప్పందం రద్దుకు ప్రతిగా తాము సమీకరించిన 2,600 ఎకరాల స్థలాన్ని అప్పగిస్తామని పేర్కొంది. ఇందుకోసం తమ

Most from this category