STOCKS

News


భారీ రాబడిని ఇవ్వనున్న ఎన్‌బీఎఫ్‌సీలు..!

Thursday 1st November 2018
Markets_main1541072307.png-21643

- వచ్చే 3-6 నెలల్లోనే 2013-14 తరహా రాబడి
- కార్నెలియన్ క్యాపిటల్ అడ్వైజర్స్ ఫౌండర్‌ వికాస్ ఖేమానీ వ్యాఖ్య

ముంబై: నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) వ్యవస్థలో ఉన్నటువంటి ఖాళీని పూరించడానికి వచ్చినవి కాదని వ్యాఖ్యానించిన కార్నెలియన్ క్యాపిటల్ అడ్వైజర్స్ ఫౌండర్‌ వికాస్ ఖేమానీ.. ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి అవసరం కోసం ఏర్పడిన సంస్థలుగా ఇవి ఉన్నాయని విశ్లేషించారు. బ్యాంకులు చేయడానికి వీలులేనటువంటి వ్యాపారాన్ని ఈ సంస్థలు కొనసాగిస్తున్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మునుపటి మాదిరి 30-35 శాతం వృద్ధి రేటు తక్షణమే నమోదయ్యే అవకాశం లేకపోయినప్పటికీ.. వచ్చే 3 నెలల్లోనే 2013-14 తరహా రాబడి అందించనున్నాయనే ధీమాను వ్యక్తంచేశారు. ఆస్తి, అప్పుల అసమతుల్యత తొలగిపోతుందన్నారు. స్వల్పకాలంలో ఒడిదుడుకులు ఉంటాయే తప్పించి వృద్ధి ఆగిపోవడం అనే అనుమానమే అవసరం లేదని వ్యాఖ్యానించారు. ప్రైవేటు బ్యాంకింగ్‌ సంస్థలైన ఐసీఐసీఐ, యాక్సిస్‌, హెచ్‌డీఎఫ్‌సీలు మంచి పనితీరును కనబరుస్తున్నప్పటికీ.. ఎన్‌బీఎఫ్‌సీల వృద్ధి కూడా కొనసాగుతుందని వివరించారు. ఇక ఎన్నికల అంశం స్వల్పకాలం ప్రభావం మాత్రమే చూపుతుందన్నారు. ఒకవేళ 5-7 శాతం పతనం నమోదైనా అది పెద్ద విషయం కాదని అన్నారు. ఇక్కడ నుంచి మార్చి, ఏప్రిల్‌, మే పోర్టిఫోలియో నిర్మాణానికి అత్యంత తగిన సమయంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇంతకుముందు ఎడిల్‌వీజ్‌లో పనిచేసిన ఆయన ఈ సంస్థ షేరు 50 శాతం పతనమైనప్పటికీ తానైతే కొనుగోలు చేస్తానని వ్యాఖ్యానించారు. ఎడిల్‌వీజ్‌ మంచి యాజమాన్యం కలిగిన సంస్థగా వివరించారు.



You may be interested

ఈ షేర్లు ఆకర్షణీయం: సెంట్రమ్‌ వెల్త్‌

Thursday 1st November 2018

బ్యాంకింగ్‌ రంగం వ్యవస్థాగత, నిర్మాణాత్మక మార్పులోకి వెళ్లడంతో, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఇన్సూరెన్స్‌ కంపెనీలపై దృష్టి సారించినట్టు సెంట్రమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రీసెర్చ్‌ హెడ్‌ జగన్నాథం తూనుగుంట్ల తెలిపారు. ఈ రంగాల్లో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, సీడీఎస్‌ఎల్‌ పట్ల సానుకూలతను వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.    ఎల్‌అండ్‌టీ ఎంత వరకు పెరగొచ్చు? ఎల్‌అండ్‌టీ మంచి ఫలితాలను ప్రకటించిందని, ఈ సమయంలో మంచి ఫలితాలను ప్రకటించే కంపెనీ మార్కెట్‌ను

‘ఎల్‌ అండ్‌ టీ’ టార్గెట్‌ ధర రూ.1,880

Thursday 1st November 2018

దేశీ ఇంజనీరింగ్‌, నిర్మాణ రంగ దిగ్గజం లార్సన్‌ అండ్‌ టూబ్రో (ఎల్‌ అండ్‌ టీ) షేరుకు పలు బ్రోకింగ్‌ సంస్థలు అవుట్‌పెర్ఫార్మర్‌ రేటింగ్‌ను ఇచ్చాయి. ప్రస్తుత ఏడాది జూలై–సెప్టెంబర్‌ (క్యూ2) ఆర్థిక ఫలితాల వెల్లడి అనంతరం ఈ కంపెనీ షేరు రేటింగ్స్‌ను అత్యధిక శాతం బ్రోకరేజ్‌లు సవరించాయి. కంపెనీ నికర లాభం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన 28 శాతం వృద్ధి చెందండం ఆధారంగా సీఎల్‌ఎస్‌ఏ ఈ షేరుకు బై రేటింగ్‌ ఇచ్చింది.

Most from this category