News


ఎన్‌బీఎఫ్‌సీలు/బ్యాంక్స్‌ ఔట్‌లుక్‌ ఎలా ఉండొచ్చు?

Saturday 17th November 2018
Markets_main1542438810.png-22142

బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల ఔట్‌లుక్‌ చూడటానికి ఆకర్షణీయంగా కనిపిస్తోందని కోటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ తెలిపింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన చూస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో బ్యాంకులు స్వల్ప లాభాలను నమోదు చేశాయని పేర్కొంది. ఇన్వెస్ట్‌మెంట్లకు, ఎన్‌పీఏలకు అధిక కేటాయింపులు ఇందుకు కారణమని తెలిపింది. స్లిపేజ్‌లు తగ్గడం సానుకూల అంశమని పేర్కొంది. అందువల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగంలో బ్యాంకులు పనితీరు మరింత మెరుగుపడొచ్చని అంచనా వేసింది. కార్పొరేట్‌ బ్యాంకుల్లో ఐసీఐసీఐ, ఎస్‌బీలకు అధిక ప్రాధాన్యమివ్వొచ్చని తెలిపింది. ఇక ప్రస్తుత క్యూ2లో ఎన్‌బీఎఫ్‌సీలు స్థిర పనితీరు కనబర్చినప్పటికీ.. ట్రెండ్స్‌ సానుకూలముగా ఉన్నప్పటికీ.. లిక్విడిటీ మేనేజ్‌మెంట్‌ అంశాన్ని గమనించాల్సి ఉందని పేర్కొంది.  కోటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ ప్రకారం..

► బ్యాంకులు మొత్తంగా ప్రస్తుత క్యూ2లో స్వల్ప లాభాన్ని నమోదు చేశాయి. ఎన్‌పీఏలకు, ఇన్వెస్ట్‌మెంట్లకు కేటాయింపులు కొనసాగించడం ఇందుకు కారణం. ఎన్‌ఐఐ వృద్ధి వార్షికంగా 15 శాతంగా ఉన్నా కూడా ట్రెజరీ ఆదాయం తక్కువగా ఉండటం వల్ల రెవెన్యూ ఫ్లాట్‌గానే ఉంది. రుణ వృద్ధి మరీ ప్రత్యేకించి ప్రభుత్వ బ్యాంకుల్లో మెరుగుపడుతోంది. రుణాల్లో రిటైల్‌, ఎంఎస్‌ఎంఈ వాటా పెరుగుతోంది. క్వార్టర్‌ పరంగా చూస్తే కార్పొరేట్‌ బ్యాంకుల ఎన్‌ఐఎంలో మెరుగుదల కనిపించింది. స్లిపేజ్‌లు తగ్గడం, ప్రైసింగ్‌ పవర్‌ వంటి అంశాలు ఇందుకు కారణం. 

► స్లిపేజ్‌లు తగ్గడం సానుకూల అంశం. ఇవి 12 త్రైమాసికాల కనిష్ట స్థాయిలో ఉన్నాయి. దీని వల్ల బ్యాంకులు అసెట్‌ క్వాలిటీ మెరుగుపడే అవకాశముంది. అలాగే దివాలా పరిష్కారాల వల్ల విశ్వాసం మెరుగుపడుతోంది. 

► కార్పొరేట్‌ బ్యాంకులు మంచి పనితీరు కనబరుస్తున్నాయి. రుణాల్లో బలమైన వృద్ధి ఉన్నప్పటికీ రిటైల్‌ లెండింగ్‌ ప్రైవేట్‌ బ్యాంకులపై ఒత్తిడి నెలకొనవచ్చు. ఎన్‌ఐఐ వృద్ధి వార్షికంగా 15 శాతంగా ఉన్నా కూడా.. ప్రస్తుతం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయనే విషయాన్ని గుర్తించాలి. అలాగే పలు ప్రైవేట్‌ బ్యాంకులకు ఫండ్స్‌ వ్యయాల సవాలుగా మారొచ్చు. 

► ఎన్‌బీఎఫ్‌సీల విషయానికి వస్తే.. ప్రస్తుత క్యూ2లో ఇవి స్థిరమైన ఫలితాలను ప్రకటించాయి. హౌసింగ్‌ విభాగంలో మోస్తారు వృద్ధి నమోదయితే.. మిగిలిన వాటిలో మంచి పెరుగుదల కనిపించింది. చాలావరకు రిటైల్‌ అసెట్‌ తరగతుల్లో బలమైన వసూళ్లు నమోదయ్యాయి. హౌసింగ్‌ విభాగంలో ఎన్‌ఐఎం తగ్గింది. ఇతర వాటిల్లో ఎన్‌ఐఎం స్థిరంగా లేదా పెరిగింది. ఎన్‌బీఎఫ్‌సీల్లో ప్రధానంగా గమనించాల్సిన అంశం లిక్విడిటీ మేనేజ్‌మెంట్‌. ఇటీవల చోటుచేసుకుంటున్న పరిస్థితులు కొంత ఊరట కలిగిస్తున్నప్పుటికీ.. ఎన్‌ఐఐ అంచనాలను తగ్గించాం. అయితే శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌, ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్‌, చోళమండలం వంటి స్టాక్స్‌కు ప్రాధాన్యమివొచ్చు. 



You may be interested

ఫైనాన్స్‌ స్టాక్స్‌పై సెంట్రమ్‌ ఏమంటోంది?

Saturday 17th November 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా పలు ఫైనాన్స్‌ రంగ షేర్లపై తన సిఫార్సులు తెలియజేసింది. అవేంటో చూద్దాం..  క్యాపిటల్‌ ఫస్ట్‌ ఈ స్టాక్‌ను హోల్డ్‌ చేయవచ్చు. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.546గా నిర్ణయించాం. 12 శాతం వరకు అప్‌సైడ్‌ ఉండొచ్చు. స్టాక్‌ ప్రస్తుత ధర రూ.494గా ఉంది. ప్రస్తుత క్యూ2లో క్యాపిటల్‌ ఫస్ట్‌ లోన్‌ బుక్‌ వార్షికంగా 42 శాతం వృద్ధితో రూ.32,622 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం, ప్రి-ప్రొవిజనింగ్‌ ప్రాఫిట్‌,

భారత మార్కెట్‌కు ‘డబుల్‌ ఓవర్‌వెయిట్‌’..!

Saturday 17th November 2018

దేశీ మార్కెట్‌ పట్ల ‘డబుల్‌ ఓవర్‌వెయిట్‌’ వైఖరితో ఉన్నట్లు సీఎల్‌ఎస్‌ఏ మేనేజింగ్ డైరెక్టర్, ఈక్విటీ వ్యూహకర్త క్రిస్టోఫర్‌ ఉడ్ తన వీక్లీ న్యూస్ ‌లెటర్ 'గ్రీడ్ అండ్ ఫియర్'లో పేర్కొన్నారు. ముంబై: భారత స్టాక్‌ మార్కెట్ పట్ల తాను పాజిటివ్‌గా ఉన్నట్లు క్రిస్టోఫర్‌ ఉడ్ వ్యాఖ్యానించారు. ఆసియా పసిఫిక్ రిలేటీవ్‌ రిటర్న్‌ పోర్టిఫోలియోలో భారత్‌ పట్ల ‘డబుల్‌ ఓవర్‌వెయిట్‌’ వైఖరితో ఉన్నట్లు తెలిపారు. సాధారణ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ తిరిగి ఎన్నికైతే.. పెట్టుబడులు

Most from this category