STOCKS

News


ఎన్‌బీఎస్‌సీ వృద్ధి అంతంతమాత్రమే: సీఎల్‌ఎస్‌ఏ

Wednesday 21st November 2018
Markets_main1542792421.png-22267

  • మొండి బకాయిలను పరిష్కరించుకునేందుకు బ్యాంకులు 60-70 శాతం వదులుకోవాల్సిన(హెయిర్‌ కట్‌) అవసరం ఉందని సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది.

ముంబై: నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ)ల వృద్ధిరేటు నెమ్మదిస్తుందని అంతర్జాతీయ బ్రోకరేజి సంస్థ సీఎల్‌ఎస్‌ఏ అంచనావేసింది. వచ్చే 6-12 నెలలకాలం వరకు ఇదే పరిస్థితి కొనసాగేందుకు అవకాశం ఉందని విశ్లేషించిన ఈ సంస్థ.. నాలుగవ త్రైమాసికంలో ఎన్‌బీఎఫ్‌సీలు రోలోవర్‌ సమస్యను ఎదుర్కోనున్నట్లు తెలిపింది. బ్యాంక్‌ రుణాలు, కామర్షియల్‌ పేపర్ల అమ్మకాల ద్వారా ఈ విషయంలో స్వల్పకాలానికి గట్టెక్కిన ఈ రంగ కంపెనీలు తరువాత కాలంలో మాత్రం అతిపెద్ద సవాలునే ఎదుర్కొబోతున్నట్లు విశ్లేషించింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్) సంక్షోభం తరువాత బ్యాంకింగేతర సంస్థల వృద్ధిరేటుపై నీలినీడులు కమ్ముకోగా.. ఈ విషయంపై నివేదికను రూపొందించిన సీఎల్‌ఎస్‌ఏ, వచ్చే 6-12 నెలలకాలం వరకు ఈ రంగంలో 10-15 శాతానికే పరిమితంకావచ్చని అంచనావేసింది. అంతక్రితం రెండేళ్ల పాటు ఈ రంగం 20 శాతం చొప్పున చక్రగతి వృద్ధిరేటును నమోదుచేసిన విషయం తెలిసిందే. ఎన్‌బీఎస్‌సీ రంగంలో నెలకొన్న ఫండింగ్‌ అవరోధాల కారణంగా ఆటో సెక్టార్‌ వంటి పలు రంగాలలో సైతం వృద్ధి మందగించిందని వివరించింది. ఇక రియల్‌ ఎస్టేట్‌ రంగానికి రుణాలు మంజూరీ చేసిన హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల పట్ల కూడా జాగ్రత్త దోరణి అవసరమని పేర్కొంది. మరోవైపు మొండి బకాయిలను పరిష్కరించుకునేందుకు బ్యాంకులు 60-70 శాతం వదులుకోవాల్సి (హెయిర్‌ కట్‌)న  అవసరం ఉందని సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది. తనఖాలో ఉన్నటువంటి ఆస్తి విలువకు, రుణం తీసుకున్న మొత్తానికి మధ్య వ్యత్యాసమై హెయిర్‌ కట్‌ 50-55 వరకు ఉండవచ్చని బ్యాంకింగ్‌ రంగం చెబుతుండగా.. ఇంతకంటే ఎక్కువగానే బ్యాంకులు వదులుకోవల్సిన అవసరం ఉండవచ్చని అంచనావేసింది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో బ్యాంకులు ప్రయోజనం పొందుతున్నట్లు వెల్లడించిన బ్రోకరేజ్‌ సంస్థ.. రిటైల్‌ రుణాలపై ఫీజులు పెంచడం, క్రెడిట్‌ క్వాలిటీ పెరగడం వంటి ప్రయోజనాలు పాజిటీవ్‌గా ఉన్నట్లు విశ్లేషించింది. You may be interested

కొనసాగిన ఐటీ షేర్ల పతనం

Wednesday 21st November 2018

ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి ర్యాలీతో ఐటీ షేర్లు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నాయి. బుధవారం రాత్రి రూపాయి ఫారెక్స్‌ మార్కెట్‌లో ముగిసే సమయానికి 21పైసలు బలపడి రెండు నెలల గరిష్ట స్థాయి 71.46 వద్ద ముగిసింది. నేడు ఈద్‌-ఈ-మిలద్‌ పండుగ సందర్భంగా ఫారెక్స్‌ మార్కెట్‌కు సెలవు. ఇప్పటికే వరుసగా ఆరు రోజుల పాటు ర్యాలీ చేసిన రూపాయి ఈ 6రోజుల్లో డాలర్‌ మారకంలో ఏకంగా 143 పైసలు బలపడింది. ఈ నవంబర్‌లో

కార్పొరేట్‌ బ్యాంకుల్లో ఈ మూడూ బెస్ట్‌..

Wednesday 21st November 2018

కార్పొరేట్‌ బ్యాంకులపై పాజిటివ్‌గా ఉన్నానని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (హెచ్‌ ఆఫ్‌ రీసెర్చ్‌-రిటైల్‌) సిద్ధార్థ ఖెమ్కా తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేశారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.  సుబొక్సొన్‌ జనరిక్‌కు ఆమోదం లభించం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌కు సానుకూల అంశమని సిద్ధార్థ ఖెమ్కా తెలిపారు. ఇప్పటికే స్టాక్‌ ధరపై ఈ

Most from this category