STOCKS

News


షార్ట్‌టర్మ్‌ కోసం నార్నోలియా సిఫార్సులు

Tuesday 25th June 2019
Markets_main1561455483.png-26562

స్వల్పకాలానికి దాదాపు 20 శాతం వరకు రాబడినిచ్చే ఐదు స్టాకులను నార్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ రికమండ్‌ చేస్తోంది.
1. వెల్‌స్పన్‌ కార్‌‍్ప: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 160. స్టాప్‌లాస్‌ రూ. 122. ఇటీవల కాలంలో రూ. 89 వద్ద కనిష్టాన్ని తాకిన తర్వాత వేగంగా రీబౌండ్‌ అయింది. ప్రస్తుతం కీలక డీఎంఏ స్థాయిలకు పైన కదలాడుతోంది. ఇండికేటర్లు మరింత అప్‌మూవ్‌కు అనుకూలంగా కనిపిస్తున్నాయి.
2. అపోలో టైర్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 220. స్టాప్‌లాస్‌ రూ. 184. గతంలో రూ. 307 వద్ద గరిష్ఠాన్ని తాకి తిరిగి రూ. 174కు పతనమైంది. ఇక్కడ కీలక మద్దతు పొంది బౌన్స్‌ చూపింది. ఎంఏసీడీ బుల్లిష్‌క్రాసోవర్‌ ఏర్పరిచింది. 
3. హెక్సావేర్‌ టెక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 410. స్టాప్‌లాస్‌ రూ. 359. చార్టుల్లో బుల్లిష్‌బెల్ట్‌ ఫార్మేషన్‌ ఏర్పరిచింది. ఎంఏసీడీ పాజిటివ్‌గాఉంది. తాజా రీబౌండ్‌ మరింత కొనసాగుతుందని సంకేతాలున్నాయి.
4. యునైటెడ్‌ స్పిరిట్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 605. స్టాప్‌లాస్‌ రూ. 524. దిగువ స్థాయిల్లో కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. వీక్లీ చార్టుల్లో హ్యామర్‌ క్యాండిల్‌ ఏర్పరిచి అప్‌మూవ్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కీలక డీఎంఏ స్థాయిలకు పైన కదలాడుతూ బలంగా ఉంది.
5. పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 255. స్టాప్‌లాస్‌ రూ. 225. రూ. 243ను దాటితే పాజిటివ్‌ బ్రేకవుట్‌గా పరిగణించవచ్చు. ఇదే జరిగితే గత టాపింగ్‌ పొజిషన్‌ను మరోమారు పరీక్షిస్తుంది. ఎంఏసీడీ పాజిటివ్‌గా ఉంది. 



You may be interested

ఐటీ, కార్పోరేట్‌ బాంకుల్లో ఇన్వెస్ట్‌ చేయోచ్చు: ఐఐఎఫ్‌ఎల్‌

Tuesday 25th June 2019

ఐటీలో హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎంఫసిస్‌ ఎన్‌బీఎఫ్‌సీలో బజాజ్‌ ఫైనాన్స్‌, చోలమండలం, సుందరం ఫైనాన్స్‌  పార్మా రంగంలో టొరంటోను పరిశీలించోచ్చు మార్కెట్‌లోకి నగదు ప్రవాహం జరిగేంత వరకు మనం ఇప్పట్లో ఎటువంటి మార్కెట్‌ అప్‌టిక్‌ను చూడలేమని ఐఐఎఫ్‌ఎల్‌ వీపీ రిసెర్చ్‌ అభిమన్యు సోపత్‌ అన్నారు. ఓ అంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ప్రస్తుతం ఏఏ  స్టాక్‌లలో ఇన్వెస్ట చేయవచ్చో, ఏ రంగం ఎలా ఉందో వివరించారు. మిగిలిన విషయాలు ఆయన మాటల్లోనే... ప్రభుత్వ తక్షణ చర్యలు ముఖ్యం..  ద్రవ్యోల్బణం

అడాగ్‌ గ్రూప్‌ షేర్ల పతనం

Tuesday 25th June 2019

అనిల్‌ అంబానికి చెందిన అడాగ్‌ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. ఎన్‌ఎస్‌ఈలోని ఎఫ్‌అండ్‌ఓ సెక్యూరిటీస్‌ విభాగంలో టాప్‌-10 లూజర్లలో అడాగ్‌ గ్రూప్‌నకు చెందిన ఆర్‌ పవర్‌, రిలయన్స్‌ ఇన్ఫ్రా, రిలయన్స్‌ క్యాపిటల్‌ షేర్లు టాప్‌ -3 స్థానంలో కొనసాగుతున్నాయి.  రిలయన్స్‌ పవర్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.4.65ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో షేరు ఇంట్రాడేలో 14శాతం క్షీణించింది. మధ్యాహ్నం గం. 2:30.ని.లకు షేరు

Most from this category