STOCKS

News


ఈ నెల 28 వరకూ నాల్కో షేర్ల బైబ్యాక్‌

Thursday 15th November 2018
news_main1542257780.png-22015

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ నేషనల్‌ అల్యూమినియం కంపెనీ (నాల్కో) రూ.505 కోట్ల మేర షేర్లను బైబ్యాక్‌ చేయనుంది. ఈ నెల 13న ఆరంభమైన ఈ షేర్ల బైబ్యాక్‌ ఈ నెల 28న ముగుస్తుందని నాల్కో తెలిపింది. గత నెల 12న జరిగిన డైరెక్టర్ల బోర్డ్‌ సమావేశంలో ఈ షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనకు  ఆమోదం లభించిందని తెలియజేసింది. షేర్ల బైబ్యాక్‌లో భాగంగా 6.73 కోట్ల షేర్లను ఒక్కో షేర్‌ను రూ.75 ధరకు కంపెనీ కొనుగోలు చేస్తుంది. మొత్తం షేర్ల బైబ్యాక్‌ విలువ రూ.504,83,53,950  (రూ.505 కోట్లు ). బుధవారం బీఎస్‌ఈలో నాల్కో షేర్‌ 1 శాతం నష్టంతో రూ.66.75 వద్ద ముగిసింది. కాగా  కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేయడమే కాకుండా, ప్రస్తుత ప్లాంట్ల సామర్థ్యాన్ని కూడా పెంచే ప్రణాళికలు రూపొందించామని నాల్కో వివరించింది. You may be interested

అపోలో హాస్పిటల్స్‌ నుంచి అపోలో ఫార్మసీ విభజన

Thursday 15th November 2018

న్యూఢిల్లీ: అపోలో హాస్పిటల్‌ ఎంటర్‌ప్రైజెస్‌... తన ఫార్మసీ (ఔషధ విక్రయ శాలలు) రిటైల్‌ వ్యాపారాన్ని అపోలో ఫార్మసీస్‌ లిమిటెడ్‌ (ఏపీఎల్‌) పేరుతో వేరు చేయాలని నిర్ణయించింది. అపోలో మెడికల్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు ఏపీఎల్‌ పూర్తి అనుబంధ సంస్థగా కొనసాగుతుంది. అపోలో మెడికల్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌లో అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు 25.5 శాతం వాటా ఉంటుంది. అలాగే, జీలమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌-1కు 19.9 శాతం, హేమెంద్ర కొఠారికి 9.9 శాతం వాటా,

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 15th November 2018

వివిధ వార్తల్లోని అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఇవి... ఆల్కేమ్‌ ల్యాబ్స్‌:- మహారాష్ట్రలోని తలోజా యూనిట్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ జీరో అ‍బ్జర్వేషన్‌ సర్టిఫికేషన్‌ను జారీ చేసినట్లు ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. తలోజా యూనిట్‌లో ఈ సెప్టెంబర్‌ 15-18తేదిలో యూఎస్‌ఎఫ్‌డీ తనిఖీలు నిర్వహించింది. పీసీ జ్యుయెలర్‌:- కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నికరలాభం 38శాతం క్షీణించింది. ఈ క్యూ2లో నికరలాభం రూ.94కోట్లను నమోదు చేయగా, గతేడాది ఇదే క్యూ2లో కంపెనీ రూ.154కోట్ల

Most from this category