STOCKS

News


మార్కెట్లోకి నిధుల రాక తగ్గుతోందా?

Thursday 10th January 2019
Markets_main1547059247.png-23491

దేశీయ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి వస్తున్న పెట్టుబడులే ఈ మధ్య కాలంలో మన దేశ ఈక్విటీ మార్కెట్లను బలంగా ముందుకు తీసుకెళుతున్నాయి. ఒకవైపు విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నా ఆ ప్రభావం పెద్దగా పడడం లేదంటే ఇదే కారణం. దేశీయ ఇన్వెస్టర్ల నుంచి ఈక్విటీలు, మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు ఎప్పటికప్పుడు పెరుగుతుండడంతో... దేశీయ మార్కెట్లు విదేశీ నిధుల ప్రవాహాలపై ఇంకెంత మాత్రం ఆధారపడడం లేదు. కానీ, డిసెంబర్‌ నెలలో మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల తాజా పెట్టుబడులు తగ్గినట్టు మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. 

 

2018 డిసెంబర్‌ మాసంలో ఈక్విటీల్లో మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు ఏకంగా 21 శాతం తగ్గి నికరంగా రూ.6,606 కోట్లుగా ఉన్నాయి. ఈక్విటీ, ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లోకి వచ్చినవి కలిపి ఈ మొత్తం కావడం గమనార్హం. 2018లో ఈక్విటీల్లో మ్యూచువల్‌ ఫండ్స్‌ అత్యంత తక్కువగా పెట్టుబడులు పెట్టింది డిసెంబర్‌ మాసంలోనే. కేవలం ఈక్విటీ పథకాల్లోకి వచ్చిన మొత్తం రూ.5,615 కోట్లు. మరి అక్టోబర్‌లో వచ్చిన రూ.11,422 కోట్లతో పోలిస్తే ఎంత తగ్గాయో అర్థం చేసుకోవచ్చు. 

 

2018లో మొత్తం మీద విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా రూ.73,212 కోట్ల మేర అమ్మకాలు జరిపారు. కానీ, ఈ స్థాయిలో వారు పెట్టుబడులను వెనక్కి తీసుకెళ్లినప్పటికీ మార్కెట్లు నికరంగా 4 శాతం మేర లాభాలను ఇవ్వడం గమనార్హం. అంటే వారి ప్రభావం మన మార్కెట్లను షేక్‌ చేయకపోవడానికి కారణం... దేశీయ ఇనిస్టిట్యూషన్లు రూ.1,09,661 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాయి. నెలవారీగా సగటున రూ.88,73 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దేశీయ పెట్టుబడుల్లో మ్యూచువల్‌ ఫండ్స్‌ వాటా సింహ భాగంగా ఉంది. 2017లోనూ ఎఫ్‌ఐఐలు రూ.44,108 కోట్లను ఉపసంహరించుకున్నారు. కానీ, దేశీయ ఇనిస్టిట్యూషన్స్‌ రూ.90,738 కోట్ల పెట్టుబడులు పెట్టడం గమనార్హం. రెట్టింపు స్థాయిలో దేశీయంగానే నిధులు రావడంతో మార్కెట్లు 27 శాతానికి పైగా 2017లో లాభాలను పంచాయి. అయితే, 2018 డిసెంబర్‌ నెలలో దేశీయంగా మ్యూచువల్‌ ఫండ్స్‌, ఇనిస్టిట్యూషన్ల పెట్టుబడులు తగ్గడంతో... మార్కెట్లు స్థిరపడడానికి ఈ స్థాయి నిధులు సరిపోవన్న అభిప్రాయం విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. డిసెంబర్‌ నెల స్థాయిలోనే రానున్న నెలల్లోనూ దేశీయంగా నిధుల ప్రవాహం ఉంటే మార్కెట్లకు సమస్య ఏర్పడుతుందంటున్నారు. డిసెంబర్‌ మాసంలో సిప్‌ ద్వారా వచ్చిన పెట్టుబడులు రికార్డు స్థాయిలో రూ.8,022 కోట్లుగా ఉన్నాయి. అయితే, ఈక్విటీల్లోకి వచ్చిన నిధుల పరిమాణాన్ని గమనిస్తే... సిప్‌ల పెట్టుబడుల్లో కొంత డెట్‌ ఫండ్స్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోందని గుర్తు చేస్తున్నారు.



You may be interested

10900పైన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Thursday 10th January 2019

విదేశీ మార్కెట్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ గురువారం స్వల్ప లాభాలతో ట్రేడవుతోంది.  తన మునపటి ముగింపు(10878)తో పోలిస్తే ఉదయం గం.8:39లకు 28 పాయింట్ల లాభంతో 10,905 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా ఇక్కడి నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానమై ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ట్రేడవుతుంది. క్రితం రోజు ఎన్‌ఎస్‌ఈలో స్పాట్‌ నిఫ్టీ 10,850 పాయింట్ల వద్ద క్లోజ్‌కాగా, నిఫ్టీ ఫ్యూచర్‌ 10,878 పాయింట్ల వద్ద ముగిసింది.  ఇక ప్రపంచమార్కెట్ల విషయానికొస్తే.... అమెరికా మార్కెట్లు బుధవారం ఒడిదుడుకుల ట్రేడింగ్‌

విద్యుత్‌, బ్యాంకు స్టాక్స్‌ను కొంటున్నదెవరు? 

Thursday 10th January 2019

బ్యాంకు, విద్యుత్‌స్టాక్స్‌కు మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల నుంచి కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. దేశంలో ఆస్తుల పరంగా అతిపెద్ద అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణ సంస్థ) హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ కొన్ని విద్యుత్‌, ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు, ప్రైవేటు బ్యాంకుల స్టాక్స్‌ను డిసెంబర్‌ నెలలో కొనుగోలు చేసింది. ఆర్‌ఈసీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. 2.05 కోట్ల ఆర్‌ఈసీ షేర్లను హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ కొనుగోలు చేసింది. పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎఫ్‌సీ)కు

Most from this category