STOCKS

News


రూ. 1,000 కోట్ల సమీకరణలో ముత్తూట్ మైక్రోఫిన్

Monday 22nd October 2018
Markets_main1540183670.png-21344

న్యూఢిల్లీ:  ముత్తూట్ పపచన్‌ గ్రూప్‌లో భాగమైన ముత్తూట్ మైక్రోఫిన్‌ వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఇనీషియల్ పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) రావాలని యోచిస్తోంది. దీని ద్వారా సుమారు రూ. 1,000 కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉన్న మార్కెట్ పరిస్థితులు అప్పటికల్లా సర్దుకోగలవని సంస్థ ఆశిస్తున్నట్లు తెలిపాయి. ఉత్తరాదిలో కార్యకలాపాల విస్తరణకు ఈ నిధులను వినియోగించనున్నట్లు వివరించాయి. ముత్తూట్ మైక్రోఫిన్ ఐపీవో ప్రతిపాదనకు ఇటీవలే మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం లభించింది. ఐపీవోలో రూ. 500 కోట్ల మేర కొత్తగా షేర్లను జారీ చేయడంతో పాటు 1.63 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద సంస్థ విక్రయించనుంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు సూక్ష్మ రుణాలిస్తోందీ కంపెనీ. భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌, శాటిన్ క్రెడిట్‌కేర్‌, క్రెడిట్‌ యాక్సెస్ గ్రామీణ్ తర్వాత పబ్లిక్‌ ఇష్యూకి వస్తున్న నాలుగో మైక్రోఫైనాన్స్ సంస్థగా ముత్తూట్ మైక్రోఫిన్ నిలవనుంది. 



You may be interested

రూపాయి పతనం, మొండిబకాయిలతో ఇబ్బందే

Monday 22nd October 2018

న్యూఢిల్లీ: అంతకంతకూ పడిపోతున్న రూపాయి విలువ, బ్యాంకుల్లో మొండిబకాయిలు పేరుకుపోతుండటం ఆందోళనకలిగించే అంశాలేనని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ బిమల్‌ జలాన్‌ పేర్కొన్నారు. కేంద్రంలోని మోదీ సర్కారు పనితీరుపై మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు. పాలనపరమైన లోపాలు, పలు రాష్ట్రాల్లో ప్రజా ఆందోళనలు, లౌకికవాదాన్ని దెబ్బతీసేవిధంగా చేస్తున్న ప్రకటనలతో దేశం సతమతమవుతోందని జలాన్‌ వ్యాఖ్యానించారు. అయితే, మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన పలు కీలక సంస్కరణలు ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూర్చుతాయన్నారు. ప్రధానంగా

ఒడిదుడుకుల వారం

Monday 22nd October 2018

పలు కీలక కంపెనీలు ఈ వారంలో  క్యూ2 ఆర్థిక ఫలితాల వెల్లడించనున్నాయని, ఈ కంపెనీల ఫలితాల ప్రభావం ఈ వారం స్టాక్‌ మార్కెట్‌పై ఉంటుందని నిపుణులంటున్నారు. ఈ ఫలితాలతో పాటు డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం కూడా తగిన ప్రభావం చూపుతాయని వారంటున్నారు. అక్టోబర్‌ సిరీస్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు ఈ గురువారం (ఈ నెల 21న) ముగియనున్నందున స్టాక్‌ సూచీలు ఒడిదుడుకులకు

Most from this category