STOCKS

News


మల్టీప్లెక్స్‌ షేర్ల ర్యాలీ

Wednesday 8th August 2018
Markets_main1533712387.png-19048

ముంబై:- మల్టీప్లెక్స్ థియేటర్‌లోకి బయటి ఆహారాన్ని తీసుకువచ్చేందుకు వీలు కల్పించే అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వం తగ్గే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో బుధవారం మల్టీప్లెక్స్‌ షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. సినిమా ప్రేక్షకులు బయటి నుంచి ఆహార పదార్ధాలు తీసుకువచ్చేందుకు వీలు కల్పిస్తూ ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన  సంగతి తెలిసిందే. ఈ అంశంపై నేడు ముంబై హైకోర్టులో విచారణ జరగుతోంది. మహారాష్ట్ర తన అడఫిట్‌లో ‘‘బయటి ఆహార పదార్థాలను మల్టీప్లెక్స్‌లోకి అనుమతిస్తే భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి మల్టీప్లెక్స్‌లలో ప్రేక్షకులకు తాగునీరు ఉచితంగా అందించండంతో పాటు తిను బండారాలను గరిష్ట చిల్లర ధరకు మించి విక్రయించకుండా ఆదేశించాలని పేర్కోంది. అడఫిట్‌లో అంశాలు మల్టీప్లెక్స్‌ కంపెనీలకు అనుకూలంగా ఉండటంతో బ్రోకరేజ్‌ సంస్థలు సంబంధిత షేర్లకు పాజిటివ్‌ రేటింగ్‌ను కేటాయించాయి.
ఐడీబీఐ క్యాపిటల్‌ బ్రోకరేజ్‌ సంస్థ:- కోర్టు తీర్పు మల్టీప్లెక్స్‌ థియేటర్లకు అనుకూలంగా వస్తుందని మేము నమ్ముతున్నాము. ఇది కచ్చితంగా మల్టీప్లెక్స్‌కు అనుకూలమైంది. మహారాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన అంశాన్ని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రిఫరెన్స్‌గా పరిగణించవచ్చని తెలిపింది.
పీవీఆర్‌ లిమిటెడ్‌ షేరు:- బై రేటింగ్‌. టార్గెట్‌ ధర రూ.1,406. 2020 ఆర్థిక సంవత్సరం నాటికి కంపెనీ ఎబిటా 13 రెట్లు పెరగవచ్చు.
ఐనాక్స్‌ లీజర్‌ షేరు:- బై రేటింగ్‌. టార్గెట్‌ ధర రూ.300. 2020 ఆర్థిక సంవత్సరం నాటికి కంపెనీ ఎబిటా 10 రెట్లు పెరగవచ్చు.
అడఫిట్‌లో అంశాలు అనుకూలంగా ఉండటంతో పాటు, రేటింగ్‌ సంస్థలు షేరు రేటింగ్‌ను పెంచడంతో ఈ రెండు షేర్లు ఇంట్రాడేలో ర్యాలీ చేశాయి.
ఐనాక్స్‌ లీజర్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.233.00ల ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 8శాతం లాభపడి రూ.243.00ల గరిష్టానికి చేరుకుంది. మధ్యహ్నం గం.12:20ని.లకు షేరు గత ముగింపు ధర రూ.225.15తో పోలిస్తే 5.64శాతం లాభంతో రూ.237.85ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
పీవీఆర్‌ లిమిటెడ్‌:-  నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.1277.00ల ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 4శాతం లాభపడి రూ.1287.55ల గరిష్టానికి చేరుకుంది. మధ్యహ్నం గం.12:20ని.లకు షేరు గత ముగింపు ధర రూ.1226.45తో పోలిస్తే 3.56శాతం లాభంతో రూ.1268.85ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

అంచనాల్ని మించిన మార్కెట్‌ ర్యాలీ

Wednesday 8th August 2018

దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరు మీదున్నాయి. జీవిత కాల గరిష్ట స్థాయిల్లో కదలాడుతున్నాయి. అయితే ఇక్కడ మార్కెట్‌పై నిపుణుల అంచనాలు తప్పాయి. ట్రెండ్‌ను కచ్చితంగా అంచనా వేయలేకపోయారు. మార్కెట్‌ పెరుగుదల వీరి అంచనాల కన్నా అధిక స్థాయిలో ఉంది. బ్లూమ్‌బర్గ్‌ మార్కెట్‌ విశ్లేషకుల ప్యానల్లో అతి కొద్ది మంది మాత్రమే స్టాక్‌ ధరలు ఈ స్థాయిలో పెరగొచ్చని అంచనా వేశారు. ఎక్కువ మంది మార్కెట్‌ ట్రెండ్‌ను పట్టుకోలేకపోయారు. కేవలం కొన్ని

‘గజ’పరుగులు షురూ!

Wednesday 8th August 2018

భారత ఎకానమీపై ఐఎంఎఫ్‌ పాజిటివ్‌  ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీల్లో ఒకటిగా భారత్‌ నిలుస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి అభిప్రాయపడింది. దేశంలో తీసుకువచ్చిన సంస్కరణలు ఫలాలనిస్తున్నాయని తెలిపింది. భారత్‌కు ప్రతీకగా చూపే ఏనుగును గుర్తు చేస్తూ ‘ఏనుగు పరుగు ఆరంభం అయింది’ అంటూ ఐఎంఎఫ్‌ ప్రతినిధి రనిల్‌ సల్గాడో వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇండియా 7.3 శాతం, వచ్చే ఏడాది 7.5 శాతం వృద్ధి సాధించగలదని అంచనా వేశారు.

Most from this category