STOCKS

News


సూచీలకు రిలయన్స్‌ అండ

Thursday 27th December 2018
Markets_main1545897142.png-23263

ముంబై:- షేర్లలోకెల్లా అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 2.50శాతం లాభపడి సూచీల ర్యాలీ అండగా నిలుస్తోంది. ముఖేష్‌ అంబానీ చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు నేడు బీఎస్‌ఈలో రూ.1105.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇంట్రాడేలో షేరుకు కొనుగోళ్ల మద్దతు పెరగడంతో ఒకానొక దశలో 2.50శాతం లాభపడి రూ.1125.90ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.1:00లకు షేరు గతముగింపు(రూ.1096.95) ధరతో పోలిస్తే 2శాతం లాభంతో రూ.1120.25ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.872.10 రూ.1328.75లుగా నమోదయ్యాయి.
ఇక మార్కెట్‌ విషయానికొస్తే...
భారీ లాభంతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు మిడ్ సమయానికి ఆరంభ లాభాల్ని స్వల్పంగా కోల్పోయాయి. నేడు డిసెంబర్‌ కాంట్రాక్టు ఎఫ్‌ అండ్ ఓ ఎక్స్‌పైరీ రోజు కావడంతో ఇన్వెస్టర్ల అప్రమత్తత వహిస్తున్న నేపథ్యంలో సూచీల లాభాలు తగ్గుతున్నాయనేది విశ్లేషకులు అభిప్రాయం. మధ్యాహ్నం గం.1:15లకు సెన్సెక్స్‌ సూచి 203 పాయింట్ల లాభంతో 35,853 వద్ద, నిఫ్టీ ఇండెక్స్‌ 60 పాయింట్ల లాభంతో 10,790 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందుకున్న మార్కెట్‌ నేడు భారీ లాభంతో ప్రారంభమైంది. ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో హెవీవెయిట్‌ షేర్లైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ షేర్ల ర్యాలీతో నిఫ్టీ 104 పాయింట్ల లాభపడి 10,834.20 వద్ద, నెన్సెక్స్‌ 491 పాయింట్ల లాభపడి 36,041 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి.



You may be interested

ఈ షేర్లపై మోతీలాల్‌ ఓస్వాల్‌ మక్కువ

Thursday 27th December 2018

ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలు, 2019లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కారణంగా వచ్చే ఏడాది స్టాక్‌ మార్కెట్‌ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుందని పలు బ్రోకరేజ్‌ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఎలాంటి ఓలటాలిటీలోనైనా రాబడినిచ్చే షేర్లు వున్నాయంటూ ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ కొన్ని షేర్లను సిఫార్సుచేశాయి. అవి.... టైటాన్‌ టార్గెట్‌ ధర: రూ. 1105 టైటాన్‌కు పెళ్ళిళ్ల సీజన్‌ బాగా కలిసొస్తున్నది. ఈ సీజన్‌ వచ్చిందంటే చాలు కన్జూమర్లు టైటాన్‌ స్టోర్లకు పోటెత్తుతుంటారు.  పెళ్ళిళ్ల సీజన్ల

సన్‌ఫార్మా షైనింగ్‌

Thursday 27th December 2018

ముంబై:- దేశీయ ఔషధ దిగ్గజం సన్‌ఫార్మా షేర్లు గురువారం ట్రేడింగ్‌లో 2.50శాతం లాభపడ్డాయి. పేటెంట్‌ ఉల్లంఘన కేసులో తన అనుబంధ సంస్థ డీయుఎస్‌ఏ ఫార్మాస్యూటికల్స్‌కు అమెరికా ఫెడరల్‌ కోర్టు క్లీన్‌చిట్‌ ఇచ్చినట్లు సన్‌ఫార్మా బుధవారం మార్కెట్‌ ముగింపు అనంతరం స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. ఈ వార్తతో నేడు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సన్‌ఫార్మా షేర్లకు డిమాండ్‌ పెరిగింది. ఫలితంగా షేర్లు ఇంట్రాడేలో  2.50శాతం ర్యాలీ చేసి రూ.424.00ల గరిష్టాన్ని నమోదు

Most from this category