STOCKS

News


ముహూరత్‌ ట్రేడింగ్ టాప్‌ పిక్స్‌ ఇవే..

Thursday 1st November 2018
Markets_main1541061072.png-21637

- దీపావళి రోజున 5 షేర్లను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసిన దీపాన్ మెహతా
- థామస్ కుక్, క్యాపిటల్ ఫస్ట్, డెల్టా కార్ప్, టాటా ఎలాక్సీ, జుబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ కొనుగోలు చేయవచ్చని సిఫార్సు

ముంబై: స్థూల ఆర్థిక అంశాలు గాడిలోపడి, రాజకీయ అనిశ్చితులకు పరిష్కార మార్గం లభించిన తరువాత.. ర్యాలీలో ఉండనున్న షేర్లలో ఎంపిక చేసిన స్మాల్‌, మిడ్‌క్యాప్‌లు నిలవనున్నాయని బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ సభ్యుడు దీపాన్ మెహతా వ్యాఖ్యానించారు. ఈ రంగంలో పీఈ మల్టీపుల్స్‌ మళ్లీ పుంజుకుంటాయన్న ఆయన.. వచ్చే 2-3 ఏళ్లలో స్మాల్‌, మిడ్‌క్యాప్‌ షేర్లు సంపద సృష్టించనున్నాయని భావిస్తున్నట్లు ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. బేస్‌ ఎఫెక్ట్‌ అధికంగా ఉండడం, పరిశ్రమ సైకిల్‌ తిరోగమనంలో ఉండడం వల్ల ప్రధాన సూచీల్లోని అధిక వెయిటేజ్‌ కలిగిన షేర్లు ఆరోగ్యకర ఎర్నింగ్స్‌ వృద్ధిని నమోదుచేయడంలో సవాళ్లను ఎదుర్కుంటున్నాయని విశ్లేషించారు. సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) నుంచి పెట్టుబడులు పెరుగుతుండడం, ఇతర పెట్టుబడులు తగ్గడం, స్థూల ఆర్థిక అంశాలు, రాజకీయ అనిశ్చితలను బేరీజు వేసుకుని చూస్తే.. మార్కెట్‌ రేంజ్‌బౌండ్‌లోనే ఉండేందుకు ఆస్కారం ఉందని అంచనావేశారు. ఇక వచ్చే ఏడాది వరకు మార్కెట్‌ ఎలా ఉంటుందనే ప్రశ్నకు.. ఎన్నికల ఫలితాలే ఇందకు దిశను నిర్థేశిస్తాయని బదులిచ్చారు. ఎన్‌డీఏ ప్రభుత్వం కొనసాగుతుందా? లేదా.. అనే అంశంపైనే మార్కెట్‌ వర్గాలు దృష్టిసారించినట్లు చెప్పారు. మరోవైపు ఆర్‌బీఐ తీసుకునే నిర్ణయాలు కూడా కీలకంగా ఉండనున్నాయన్నారు. దీపావళి పండుగ రోజున లక్ష్మీ పూజ సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ముహూరత్‌ ట్రేడింగ్‌ సమయంలో 5 షేర్లను కొనుగోలు చేయవచ్చని సూచించారు. థామస్ కుక్, క్యాపిటల్ ఫస్ట్, డెల్టా కార్ప్, టాటా ఎలాక్సీ, జుబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ షేర్లను 2-3 ఏళ్ల టార్గెట్‌తో కొనుగోలుచేయవచ్చని సూచించారు. రంగాల పరంగా బ్యాంకింగ్‌, ఎన్‌బీఎఫ్‌సీలను సూచించిన ఆయన.. ఒక్కసారి ఈ రంగాలలోని సవాళ్లు తొలిగిపోతే, మళ్లీ మార్కెట్‌ లీడర్లుగా నిలుస్తాయన్నారు. వినియోగదారుల ఆధారిత రంగాల షేర్లను కూడా చూడవచ్చని అ‍న్నారు. 

ఇవి కేవలం మార్కెట్‌ విశ్లేషకుల అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు తమ సొంత అధ్యయనం తరువాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోవడం మంచిదని సాక్షీబిజినెస్‌డాట్‌కామ్‌ సూచన. You may be interested

ఈ 25 షేర్లు.. తారాజువ్వలు..!

Thursday 1st November 2018

- పండుగ సీజన్‌లో పలు బ్రోకింగ్‌ సంస్థ సిఫార్సులు దీపావళి పండుగ సందర్భంగా కస్టమర్లను ఆకట్టుకోవడానికి పలు వర్తకులు బంపర్‌ ఆఫర్లను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఆఫర్ల వర్షం ఆన్‌లైన్‌ అంగళ్లు, రిటైల్‌ షోరూంలోనే కాదు.. దలాల్‌ స్ట్రీట్‌లోనూ కురుస్తోందని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అరుణ్ తుక్రాల్ వ్యాఖ్యానించారు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టీవ్ ధమాకా డేస్ మాదిరిగా స్టాక్‌ మార్కెట్‌లో

రాణిస్తున్న రియల్టీ రంగ షేర్లు

Thursday 1st November 2018

ఆరంభలాభాలను కోల్పోయి సూచీలు మిడ్‌సెషన్‌ సమయానికి నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అయితే రియల్టీరంగ షేర్లు మాత్రం మార్కెట్‌ దృక్పథానికి విభిన్నంగా స్పందిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలోని కీలక సూచీలన్నీంటిలోకి నిఫ్టీ రియల్టీ సూచీ నేటి ట్రేడింగ్‌లో అత్యధికంగా 3శాతం లాభపడింది. మధ్యాహ్నం గం.12:30లకు ఇండెక్స్‌ గతముగింపు(214.90)తో పోలిస్తే 2శాతం లాభంతో 219ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలో భాగమైన 10షేర్లకు గానూ మొత్తం షేర్లన్నీ లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.

Most from this category