STOCKS

News


13 నుంచి ఎమ్‌ఎస్‌టీసీ ఐపీఓ

Tuesday 12th March 2019
Markets_main1552382644.png-24559

-ప్రైస్‌బ్యాండ్‌ రూ.121-128
-ఈ నెల 26న స్టాక్‌మార్కెట్లో లిస్టింగ్‌ !

కోల్‌కత: ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎమ్‌ఎస్‌టీసీ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ) రేపటి నుంచి (ఈ నెల 13-బుధవారం) ​‍ప్రారంభం కానున్నది. శుక్రవారం (ఈ నెల 15న) ముగిసే ఈ ఐపీఓ ద్వారా రూ.226 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఐపీఓలో భాగంగా 25 శాతం వాటాకు సమానమైన 1.76 కోట్ల షేర్లను ప్రభుత్వం విక్రయిస్తోంది. ఈ ఇష్యూకు ప్రైస్‌బ్యాండ్‌గా రూ.121-128ను ప్రభుత్వం నిర్ణయించింది. రిటైల్‌ ఇన్వెస్టర్లకు, అర్హులైన ఉద్యోగులకు ఒక్కో షేర్‌కు రూ.5.50 డిస్కౌంట్‌ లభిస్తుంది.  కనీసం 90 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 26న స్టాక్‌ మార్కెట్లో  ఈ షేర్లు లిస్ట్‌ అయ్యే అవకాశాలున్నాయి.  ప్రస్తుతం ఈ కంపెనీలో 89.85 శాతంగా ఉన్న ప్రభుత్వ వాటా ఐపీఓ అనంతరం 64.85 శాతానికి తగ్గుతుంది. అర్హులైన ఉద్యోగులకు 70,400 ఈక్విటీ షేర్లను రిజర్వ్‌ చేశారు. ఈ ఇష్యూకు లీడ్‌ మేనేజర్‌గా ఈక్విరస్‌ క్యాపిటల్‌ వ్యవహరిస్తోంది. ఈ మినీ రత్న కంపెనీ మూడు విభాగాల్లో-ఈ కామర్స్‌, ట్రేడింగ్‌, రీ సైక్లింగ్‌ల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 



You may be interested

11వేల పాయింట్ల స్టాప్‌లాస్‌తో లాంగ్స్‌ కొనసాగింపు!

Tuesday 12th March 2019

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సూచన ఈ వారాన్ని నిఫ్టీ పాజిటివ్‌గా ఆరంభించింది. మంగళవారం ట్రేడింగ్‌లో నిఫ్టీ కీలక 11300 పాయింట్లను దాటి పైన ట్రేడవుతోంది. గత వారం కన్సాలిడేషన్‌ రేంజ్‌ను ఛేదించిన అనంతరం నిఫ్టీ ముందుకు పరుగుల తీస్తోంది. 10600- 11000 పాయింట్ల మధ్య దాదాపు 15 వారాలు నిఫ్టీ కన్సాలిడేట్‌ చెందింది. ప్రస్తుతం నిఫ్టీ తన కీలక డీఎంఏ స్థాయిలకు పైనే కొనసాగుతోంది. ముఖ్యమైన డీఎంఐ, ఎంఏసీడీ లాంటి ఇండికేటర్లు బుల్లిష్‌

మీరు చెప్పిందేమిటి...జరిగిందేమిటి..

Tuesday 12th March 2019

మీరు చెప్పిందేమిటి...జరిగిందేమిటి.. - ఆర్‌కామ్‌ అంశ౾లో బ్యాంకర్లపై ఎన్‌సీఎల్‌ఏటీ అక్షింతలు న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్‌) కేసులో నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) బ్యాంకులకు అక్షింతలు వేసింది. అసెట్స్ అమ్మకం ద్వారా రూ. 37,000 కోట్లు రాబట్టేసుకుంటామంటూ 'తప్పుడు అభిప్రాయం' కలిగించాయని, తీరా చూస్తే అమ్మకం జరగకపోగా.. రూ. 260 కోట్ల ఐటీ రీఫండ్‌ను రికవర్ చేసుకునేందుకు తంటాలు పడుతున్నాయని వ్యాఖ్యానించింది. "రిలయన్స్ జియోకి అసెట్స్‌ను

Most from this category