STOCKS

News


ఎంఫసిస్‌ బైబ్యాక్‌.. 17 శాతం దాకా రిటర్న్‌..

Thursday 9th August 2018
Markets_main1533801695.png-19096

ఐటీ సంస్థ ఎంఫసిస్‌ షేర్ల బైబ్యాక్‌ ఆఫర్‌ ప్రకటించింది. దీని కోసం రూ.988 కోట్లు వెచ్చించనుంది. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఇన్వెస్టర్లకు ఇది మంచి అవకాశమని పేర్కొంది. ఇప్పుడు కంపెనీ షేర్లను కొనుగోలు చేసి, బైబ్యాక్‌లో పాల్గొంటే మంచి రాబడి అందుకోవచ్చని తెలిపింది. ఎంఫసిస్‌ 73.2 లక్షల షేర్లను (ఈక్విటీలో 3.79 శాతం) టెండర్‌ ఆఫర్‌ ద్వారా షేరుకు రూ.1,350 చెల్లించి కొనుగోలు చేయనుంది. మధ్యాహ్నం 1:00 సమయంలో ఎంఫసిస్‌ షేర్లు ఎన్‌ఎస్‌ఈలో రూ.1,152 వద్ద ట్రేడవుతున్నాయి. ప్రస్తుత స్థాయితో పోలిస్తే ఎంఫసిస్‌ బైబ్యాక్‌ షేరు ధర 17.5 శాతం ప్రీమియంతో ఉంది. 
‘బైబ్యాక్‌ ద్వారా గరిష్టంగా 73,20,555 షేర్లను కొనుగోలు చేస్తాం. దీని కోసం రూ.988 కోట్లు వచ్చిస్తాం’ అని ఎంఫసిస్‌ తెలిపింది. ప్రమోటర్లు కూడా ఈ బైబ్యాక్‌ ఆఫర్‌లో పాల్గొనడానికి ఆసక్తి చూపుతున్నారు. 
సెబీ నిబంధనల ప్రకారం.. బైబ్యాక్‌ ఆఫర్‌ పరమాణంలో 15 శాతాన్ని చిన్న షేరుహోల్డర్లకు కేటాయించాలి. అంటే ప్రస్తుత ఎంఫసిస్‌ బైబ్యాక్‌ ఆఫర్‌కు దీన్ని వర్తింపజేస్తే.. రూ.148.2 కోట్లను రూ.2 లక్షలలోపు షేర్లను కలిగిన చిన్న షేరుహోల్డర్ల షేర్లకు కేటాయించాల్సి ఉంది. ప్రస్తుత ధరతో పోలిస్తే ఎంఫసిస్‌ 17.4 శాతం ప్రీమియంతో బైబ్యాక్‌ ఆఫర్‌ ప్రకటించింది. స్వల్పకాలంలో రాబడి కోరుకునే ఇన్వెస్టర్లు.. ఓపెన్‌ మార్కెట్‌లో ఎంఫసిస్‌ షేర్లను రూ.2 లక్షల వరకు కొనుగోలు చేయవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సూచించింది. కంపెనీ బోర్డు సమావేశం అనంతరం సాధారణంగా బైబ్యాక్‌ రికార్డ్‌ తేదీ 50-70 రోజుల్లో ఉంటుంది. 
2017-18 ఆర్థిక సంవత్సరపు వార్షిక నివేదిక ప్రకారం. 20,840 షేరుహోల్డర్లు 500 వరకు షేర్లను కలిగి ఉన్నారు. అంటే వీరి దగ్గర మొత్తంగా 13.55 లక్షల షేర్లు ఉన్నాయి. ప్రస్తుత బైబ్యాక్‌లో 10.98 లక్షల షేర్లకు రిజర్వు లభిస్తుంది. దీని ప్రకారం చూస్తే యాక్సప్టెన్సీ రేసియో 81 శాతంగా ఉండొచ్చు. 2017 మార్చినాటి ఎంఫసిస్‌ బైబ్యాక్‌ ఆఫర్‌లో చిన్న షేరుహోల్డర్లు కలిగిన షేర్లు రిజర్వు పొజిషన్‌లో కేవలం 64.5 శాతానికే సమానంగా ఉన్నాయి. అందువల్ల యాక్సప్టెన్సీ రేషియో 100 శాతంగా నమోదయ్యింది. అప్పుడు 25,704 చిన్న షేరుహోల్డర్లలో 37.9 శాతం మందే బైబ్యాక్‌లో పాల్గొన్నారు. దీంతో చిన్న ఇన్వెస్టర్లు బైబ్యాక్‌ ఆఫర్‌లో పాల్గొనడానికి ఆసక్తి చూపలేదనే విషయం అర్థమౌతోంది. ఇలాంటి సందర్భాల్లో యాక్సప్టెన్సీ రేషియో ఎక్కువగా నమోదవుతుంది. 



You may be interested

దివాలా కంపెనీలపై కుబేరుల మక్కువ

Thursday 9th August 2018

దివాలాప్రక్రియ ఎదుర్కొంటున్న పలు స్మాల్‌క్యాప్స్‌పై దేశీయ హెచ్‌ఎన్‌ఐలు(హైనెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌) ఇటీవల కాలంలో ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దాదాపు 22 చిన్న కంపెనీల్లో ఇటీవల కాలంలో హెచ్‌ఎన్‌ఐలు వాటా పెంచుకున్నారు. వీటిలో పలు కంపెనీలు దివాలా తీసినవి కావడం గమనార్హం. ఇవన్నీ ఆయా కోర్టుల ముందు విచారణలు ఎదుర్కొంటున్నాయి. మార్చి పతనం నుంచి ప్రధాన సూచీలు కోలుకున్నా స్మాల్‌క్యాప్‌ సూచీ మాత్రం ఇంకా ఆల్‌టైమ్‌ హై నుంచి 16 శాతం దిగువనే

పీఎస్‌యూ బ్యాంకుల జోరు

Thursday 9th August 2018

కొన్ని బ్యాంకింగ్‌  షేర్లు గురువారం భారీ ర్యాలీని చేశాయి. బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీ కారణంగానే ఉదయం ట్రేడింగ్‌లో ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీలు తన జీవతకాల గరిష్టాలను అందుకోగలిగాయి. ఎన్‌ఎస్‌ఈలో అన్ని సూచీల్లోకెల్లా నిఫ్టీ బ్యాంకు నిప్టీ ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌యూ), నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంకు సూచీలు అత్యధికంగా లాభపడ్డాయి. 6నెలల గరిష్టాన్ని తాకిన పీఎస్‌యూ బ్యాంక్‌ నిఫ్టీ :- ఎన్‌ఎస్‌ఈలో అన్ని సూచీల్లోకెల్లా అత్యధికంగా లాభపపడింది. నేడు 3,326.40 ట్రేడింగ్‌ను ప్రారంభించింది.

Most from this category