STOCKS

News


మోతీలాల్‌ ఓస్వాల్‌ దీపావళీ ‘వెలుగు దివ్వెలు’

Friday 2nd November 2018
Markets_main1541183090.png-21672

ఈ దీపావళి నుంచి వచ్చే దీపావళి లోపు ఇన్వెస్టర్లకు లాభాలు పూలు కురిపించే స్టాక్స్‌ వివరాలను ప్రముఖ బ్రోకరేజీ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ ప్రకటించింది. అవి.. మారుతి సుజుకీ, హిందాల్కో, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, పీవీఆర్‌, ఒబెరాయ్‌ రియాలిటీ, ఇన్ఫోసిస్‌, ఇంద్రప్రస్థ గ్యాస్‌, ఐసీఐసీఐ బ్యాంకు, బ్రిటానియా ఇండస్ట్రీస్‌, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌, అశోక్‌లేలాండ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, కుమిన్స్‌ ఇండియా, వోల్టాస్‌, గోద్రేజ్‌ కన్జ్యూమర్‌. 

 

1. మారుతి సుజుకీ
లక్ష్యం రూ.8,484, రాబడి 26 శాతం
కంపెనీ మరింత మార్కెట్‌ వాటాను సొంతం చేసుకుంటుంది. 2021 ఆర్థిక సంవత్సరం వరకు ఏటా 10 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా. 
2. హిందాల్కో
లక్ష్యం రూ.338, రాబడి 46 శాతం
ఉత్పత్తుల ధరల కారణంగా రాగి వ్యాపారానికి కలిసొస్తుంది. బలమైన బ్యాలన్స్‌ షీటు కలిగి ఉంది. ఎబిట్డా 2020 వరకు ఏటా 15 శాతం, ఈపీఎస్‌ 20 శాతం చొప్పున వృద్ధి చెందుతాయని అంచనా. 
3. ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌
లక్ష్యం రూ.550, రాబడి 31 శాతం
ఇళ్ల రుణాల వ్యాపారం ఏటా 15 శాతం చొప్పున వృద్ధి చెందుతుంది. నికర వడ్డీ మార్జిన్‌, నికర లాభం కూడా బ్యాలన్స్‌ షీటుకు అనుగుణంగా వృద్ధి చెందుతాయి. ఈపీఎస్‌ 28 శాతం మేర పెరుగుతుంది. రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ ప్రస్తుతమున్న 13 శాతం నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 28 శాతానికి చేరుతుంది. 
4. పీవీఆర్‌
లక్ష్యం రూ.1,650, రాబడి 21 శాతం
2020 ఆర్థిక సంవత్సరం వరకు ఆదాయంలో 23 శాతం వృద్ధిని నమోదు చేయగలదు. ఎస్‌పీఐ సినిమాస్‌ కొనుగోలు వల్ల అదనపు స్క్రీన్లు కంపెనీకి తదుపరి ఆర్థిక సంవత్సరంలో కలుస్తాయి. ఎబిట్డా, లాభం 30, 36 శాతం స్థాయిలో పెరగనున్నాయి.
5. ఇన్ఫోసిస్‌
లక్ష్యం రూ.800, రాబడి 20 శాతం
మూడేళ్లలో ఆదాయం వృద్ధికి రోడ్‌మ్యాప్‌ను కంపెనీ రూపొందించుకుంది. రూపాయి సానుకూలత కూడా కలిసొస్తుంది. 
6. ఇంద్రప్రస్థ గ్యాస్‌
లక్ష్యం రూ.373, రాబడి 33 శాతం
హర్యానా ప్రభుత్వం నుంచి గురుగ్రామ్‌ పట్టణంలో కొంత భాగం సిటీగ్యాస్‌ పైపులైన్‌ ఏర్పాటు కోసం అనుమతి పొందింది. ఇతర ప్రాంతాల్లోనూ అనుమతులను సంపాదించగలదు. 2019/20 ఆర్థిక సంవత్సరంలో 12 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా.
7. ఐసీఐసీఐ బ్యాంకు
లక్ష్యం రూ.400, రాబడి 13 శాతం
నిర్వహణ మెరుగుపరచుకునే మధ్యస్థ దశలో ఉంది. ఆదాయాలు తిరిగి సాధారణ స్థితికి వస్తున్నాయన్న సంకేతాలను ఇచ్చింది. యాజమాన్యం మార్పిడికి సంబంధించిన సవాలు పరిష్కారం కావడంతో వృద్ధి, నిర్వహణ లాభాలపై బ్యాంకు ఇప్పుడు దృష్టి పెట్టింది.
8. బ్రిటానియా ఇండస్ట్రీస్‌
లక్ష్యం రూ.6,870, రాబడి 23 శాతం
డిస్ట్రిబ్యూషన్‌ను వేగంగా విస్తరిస్తోంది. పరిశోధన, అభివృద్ధిపై పెట్టుబడులను కొనసాగిస్తూ వస్తోంది. కొత్త ఉత్పత్తులను వేగంగా విడుదల చేస్తుండడం, భారీ విస్తరణ చర్యలు వృద్ధి అవకాశాలపై కంపెనీ యాజమాన్యానికి ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తున్నాయి.
9. గోద్రేజ్‌ కన్జ్యూమర్‌ 
లక్ష్యం రూ.897, రాబడి 28 శాతం
డిమాండ్‌ మెరుగుపడడం, ఉత్పత్తుల నవ్యతపై కంపెనీ నిలకడమైన దృష్టి, పంపిణీ విభాగం విస్తరణ, బ్రాండ్‌ బలోపేతానికి చర్యలతో కంపెనీ కన్సాలిడేటెడ్‌ ఆదాయం, లాభం అన్నవి 2020 ఆర్థిక సంవత్సరం వరకు ఏటా 12.8 శాతం, 16.8 శాతం చొప్పున పెరుగుతాయని అంచనా.
10. వోల్టాస్‌
లక్ష్యం రూ.697, రాబడి 32 శాతం
ఆదాయం, లాభాలు 2020 ఆర్థిక సంవత్సరం వరకు ఏటా 12.5 శాతం, 13.5 శాతం చొప్పున వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. అన్ని వ్యాపార విభాగాల్లోనూ వృద్ధి ఉండనుంది. You may be interested

మాస్టర్‌కార్డ్‌కు నిద్ర లేకుండా చేస్తున్న ‘రూపే కార్డ్‌’ 

Friday 2nd November 2018

మీ దగ్గరో, లేక మీ కుంటుంబ సభ్యుల్లో ఒక్కరి దగ్గరయినా మాస్టర్‌కార్డ్‌ ఉండే ఉంటుంది. అమెరికాకు చెందిన ఈ కంపెనీ మన దేశంలో మొన్నటి వరకు బ్యాంకుల డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల్లో సింహ భాగం వాటాతో ప్రతీ లావాదేవీపై కమీషన్‌ ఆర్జిస్తూ బాగానే ఆర్జించింది. కానీ, మోదీ సర్కారు తీసుకొచ్చిన స్వదేశీ ‘రూపే కార్డ్‌’ ఇప్పుడు మాస్టర్‌ కార్డుకు నిద్ర లేకుండా చేస్తోంది. రూపే కార్డ్‌ను వినియోగించడం ద్వారా స్వదేశీ

10550 పైకి నిఫ్టీ

Friday 2nd November 2018

579 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌ ప్రపంచమార్కెట్ల అందిన సానుకూలతతో మార్కెట్‌ ఈ వారాంతపు రోజైన శుక్రవారం భారీ లాభాల్లో ముగిసింది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ఝం ముగియబోతుందన్న అంచనాలతో ప్రపంచ మార్కెట్లన్నీ వువ్వెత్తున పెరిగిన ప్రభావంతో ఇక్కడి సూచీలు పరుగులు తీసాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దిగిరావడం, ఇంట్రాడేలో డాలర్‌ మారకంలో రూపాయి  రీకవరీ తదితర కారణాలు కూడా మార్కెట్‌ భారీ లాభాల ముగింపునుకు కారణమయ్యాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 35వేల మార్కు పైన, నిఫ్టీ

Most from this category