STOCKS

News


లాంగ్‌రన్‌ కోసం లార్జ్‌ క్యాప్స్‌

Thursday 13th December 2018
Markets_main1544691801.png-22897

మోతీలాల్‌ ఓస్వాల్‌ రికమండేషన్లు
ఎన్నికల ఫలితాల అనంతరం ఎవరూ ఊహించని విధంగా మార్కెట్లు టాప్‌గేర్‌లోకి మారాయి. రెండు మూడు సెషన్లలోనే నిఫ్టీ దాదాపు 500 పాయింట్లమేర లాభపడింది. ఎన్నికలు జరిగిన అన్ని రాష్ట్రాల్లో ఏకపార్టీ ప్రభుత్వాలు ఏర్పడడమే మార్కెట్లలో జోష్‌కు కారణమై ఉండొచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ అభిప్రాయపడుతోంది. ఏకపార్టీ ప్రభుత్వాలతో విధాన నిర్ణయాల్లో జాప్యం ఉండదని పేర్కొంది. అదేవిధంగా ఆర్‌బీఐకి కొత్త గవర్నర్‌ను ప్రభుత్వం వేగంగా నియమించడం కూడా మార్కెట్లను మురిపించిందని తెలిపింది. వచ్చే సార్వత్రిక ఎన్నికలను తెలంగాణలో టీఆర్‌ఎస్‌ గెలుపు కోణంలో చూడాలని బ్రోకరింగ్‌ సంస్థ తెలిపింది. టీఆర్‌ఎస్‌ అనాయాసంగా ప్రతిపక్ష కూటమిని మట్టిగరిపించడంతో చాలా ఈక్వేషన్లు మారతాయని విశ్లేషించింది. రాబోయే రోజుల్లో రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు పొత్తులు పెట్టుకోవడంలో మార్పులు వస్తాయని తెలిపింది. 
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో హోరాహోరీ పోరు తప్పదని అంచనా వేసింది. ముఖ్యంగా కాంగ్రెస్‌ తాజా ప్రదర్శన లోక్‌సభ ఎన్నికల యుద్ధాన్ని రసవత్తరంగా మార్చిందని అభిప్రాయపడింది. తాజా ఫలితాలతో బీజేపీ ఆలోచనలో పడిందని, కొత్తగా వరాలు ప్రకటించేందుకు కేంద్రంలో అధికార పక్షానికి ఇంకా సమయం ఉందని తెలిపింది. ఈ సమయాన్ని ఉపయోగించుకొని కేంద్రం  ఇకపై పలు ప్రజాకర్షక పథకాలతో ముందుకు వచ్చే ఛాన్సులున్నాయని అంచనా వేసింది. రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం తగ్గగానే తిరిగి ఆర్థిక, అంతర్జాతీయ కారణాలు మార్కెట్‌ను ప్రభావితం చేయడం ఆరంభిస్తాయని తెలిపింది.
వచ్చే ఏడాది మొత్తం సూచీల్లో ఆటుపోట్లు తప్పకపోవచ్చని మోతీలాల్‌ అంచనా వేసింది. నెలరోజులుగా ఎకానమీకి ఊరటనిచ్చేలా క్రూడాయిల్‌ ధరలు చల్లబడ్డాయని తెలిపింది. వచ్చే ఏడాది ద్వితియార్ధం నుంచి ఎర్నింగ్స్‌లో మరింత జోరు కనిపిస్తుందని తెలిపింది. ఈ నేపథ్యంలో నాణ్యమైన లార్జ్‌ క్యాప్స్‌ను ఎంచుకోవడం ఉత్తమమని సూచించింది. 
ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బీఓఐ, మారుతీ సుజుకీ, టైటాన్‌, హెచ్‌యూఎల్‌, ఇన్ఫీ, ఎల్‌అండ్‌టీ షేర్లను మోతీలాల్‌ సిఫార్సు చేసింది. 



You may be interested

పండుగ చేసుకుంటున్న హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు

Thursday 13th December 2018

వచ్చే ద్రవ్యసమీక్ష పరపతి సమావేశంలో ఆర్‌బీఐ రెపో రేటును తగ్గించవచ్చనే అంచనాలతో  హౌసింగ్‌ ఫైనాన్షింగ్‌ షేర్లు గురువారం పండుగ చేసుకుంటున్నాయి. రెపో రేట్ల తగ్గింపుతో నెలవారీ వాయిదాల (ఇఎంఐ) భారం తగ్గుతుంది. అత్యధికంగా ఎన్‌సీడీల జారీ ఇష్యూ ద్వారా రూ. 250 కోట్లను సమీకరణకు సిద్ధమైన ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ అత్యధికంగా లాభపడింది. నేటి ఇంట్రాడేలో హోమ్‌ ఫైనాన్షింగ్‌ షేర్లైన ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, రెప్కో హోమ్‌, కెన్‌ఫిన్‌ హోమ్స్‌,

లోక్‌సభ ఎన్నికల ముందు...కొనుగోళ్లకు అవకాశం

Thursday 13th December 2018

సార్వత్రిక ఎన్నికలకు ఐదారు నెలల ముందు మార్కెట్‌లో కొనుగోలుకు మంచి అవకాశాలు అందుబాటులో ఉంటాయని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ ఈక్విటీ అడ్వైజర్‌ హెడ్‌ దేవాంగ్‌ మెహతా తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఒక్క విషయమైతే స్పష్టంగా తెలుస్తోంది. మార్కెట్లు అస్థిరతను కోరుకోవడం లేదు. గత రెండు రోజులను గమనిస్తే ఈ విషయం అర్ధమౌతుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మార్కెట్‌లో చాలా

Most from this category