STOCKS

News


ఈ షేర్లపై మోతీలాల్‌ ఓస్వాల్‌ మక్కువ

Thursday 27th December 2018
Markets_main1545900822.png-23264

ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలు, 2019లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కారణంగా వచ్చే ఏడాది స్టాక్‌ మార్కెట్‌ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుందని పలు బ్రోకరేజ్‌ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఎలాంటి ఓలటాలిటీలోనైనా రాబడినిచ్చే షేర్లు వున్నాయంటూ ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ కొన్ని షేర్లను సిఫార్సుచేశాయి. అవి....


టైటాన్‌
టార్గెట్‌ ధర: రూ. 1105

టైటాన్‌కు పెళ్ళిళ్ల సీజన్‌ బాగా కలిసొస్తున్నది. ఈ సీజన్‌ వచ్చిందంటే చాలు కన్జూమర్లు టైటాన్‌ స్టోర్లకు పోటెత్తుతుంటారు.  పెళ్ళిళ్ల సీజన్ల కారణంగా పూర్తి సంవత్సరంలో టైటాన్‌ అమ్మకాలు 25 శాతం వృద్ధిచెందుతాయని అంచనావేస్తున్నాం. దీంతో ఈ కంపెనీ ఆభరణాల ఇబిటా మార్జిన్‌ గణనీయంగా పెరగవచ్చని, ఆదాయ వృద్ధి 20 శాతం వరకూ వుండవచ్చని, పోటీ సంస్థలకంటే ఈ వృద్ధి మెరుగ్గా వుంటుందని అంచనా. 2018–2020 సంవత్సరాల్లో కంపెనీ ఈపీఎస్‌ చక్రగతిన 25 శాతం పెరగవచ్చన్నది అంచనా. 

ఇండియన్‌ హోటల్స్‌
టార్గెట్‌ ధర: రూ. 163

దేశీయ హాస్పిటాలిటీ పరిశ్రమ టర్న్‌ ఎరౌండ్‌ అయ్యే ప్రక్రియలో వుంది. ఇప్పటికే పరిశ్రమ ఆక్యుపెన్సీ స్థాయి 67 శాతాన్ని మించింది. దాంతో అధిక ఆక్యుపెన్సీ, అధిక డిమాండ్‌ కలిగిన ప్రాంతాల్లో హోటల్స్‌ యాజమాన్యాలకు ధరలను పెంచుకునే అవకాశం లభించింది. ఈ వృద్ధి అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు ఇండియన్‌ హోటల్స్‌ వ్యూహాత్మకంగా మంచి స్థానంలో వుంది. 2018–2020 ఆర్థిక సంవత్సరల్లో ఈ కంపెనీ ఆదాయం/ఇబిటా 9/25 శాతం మేర చక్రగతిన పెరగవచ్చని అంచనా. 

మారికో
టార్గెట్‌ ధర: 465

గత 18 నెలలుగా మారికో కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణను పెంచగా, వీటిలో రెండు ఉత్పత్తులు విజయవంతమయ్యాయి. కంపెనీ నిర్దేశించుకున్న ప్రణాళికల్ని అమలు చేయగలిగితే....కొత్త వృద్ధి అవకాశాల్ని అందిపుచ్చున్నట్లవుతుంది. పారాచ్యూట్‌ బ్రాండ్‌ పటిష్టమైన పనితీరును కనపరుస్తోంది. కొత్తగా ప్రవేశపెట్టిన వాల్యూయాడెడ్‌ హెయిర్‌ఆయిల్‌ (వాహో) విజయవంతంకావడంతో ఇటీవలి త్రైమాసికాల్లో హెయిర్‌ఆయిల్‌ విభాగంలో కంపెనీ అమ్మకాలు పెరిగాయి. 2018–2020 ఆర్థిక సంవత్సరాల్లో కంపెనీ ఆదాయం/నికరలాభం 15/17 శాతం మేర వృద్ధిచెందవచ్చని అంచనా. 

ఒబ్రాయ్‌ రియాల్టీ
టార్గెట్‌ ధర: రూ. 574

రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల్లోకెల్లా ఒబ్రాయ్‌ రియాల్టీ పటిష్టమైన బ్యాలెన్స్‌ షీట్‌ను కలిగివుంది. రుణ భారం నామమాత్రమే. ప్రస్తుత ప్రాజెక్టుల విక్రయాలు, కొత్తగా ప్రారంభించబోయే ప్రాజెక్టుల ద్వారా ఈ రెండు ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నగదు రాబడి పెరుగుతుందని భావిస్తున్నాం. కంపెనీ లీజింగ్‌ ఆదాయం వచ్చే ఐదేళ్లలో నాలుగు రెట్లు పెరుగుతుందని అంచనా. 2018–2020 ఆర్థిక సంవత్సరాల్లో ఆదాయం/ఇబిటా/నికరలాభం 47/45/71 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందవచ్చని అంచనావేస్తున్నాం. 

ఐసీఐసీఐ బ్యాంక్‌
టార్గెట్‌ ధర: రూ. 400

ఐసీఐసీఐ బ్యాంక్‌ నిర్వహణా పనితీరులో మెరుగుదల కన్పిస్తోంది. ఈ క్రమంలో 2020 ఆర్థిక సంవత్సరం నుంచి బ్యాంకు లాభాల జోరు పెరుగుతుందని, మొండి బకాయిల సమస్య కొలిక్కివస్తుందని భావిస్తున్నాం. బ్యాంకు రుణ పుస్తకాల్లో రిటైల్‌ రుణాలు వృద్ధిచెందడం మంచి పరిణామం. అలాగే ప్రస్తుత ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం ఫలితంగా ఐసీఐసీఐ లబ్ది పొందవచ్చని అంచనా
 You may be interested

కరిగిపోయిన మిడ్‌క్యాప్‌ కంపెనీల ప్రమోటర్ల సంపద..!

Thursday 27th December 2018

ఈ ఏడాది మిడ్‌ క్యాప్‌ కంపెనీలు ఆశించిన స్థాయిలో రాణించలేపోయాయి. కంపెనీ లాభ నష్టాలతో పోలిస్తే వాల్యూవేషన్‌ అధికంగా వుండటం, స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లు ఒడిదుడుకులను నియంత్రించేందుకు అదనపు నిఘా చర్యల(ఏఎస్‌ఎం)ను ప్రవేశ పెట్టడం, సెబీ మ్యూచువల్ ఫండ్లని పునర్ వర్గీకరణ చేపట్టడం తదితర కారణలతో ఈ ఏడాది మిడ్‌క్యాప్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడిని తీవ్రతరమైందని మార్కెట్‌ విశ్లేషకులంటున్నారు. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ ఈ ఏడాదిలోనే ఏకంగా 15శాతం క్షీణించి మార్కెట్‌

సూచీలకు రిలయన్స్‌ అండ

Thursday 27th December 2018

ముంబై:- షేర్లలోకెల్లా అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 2.50శాతం లాభపడి సూచీల ర్యాలీ అండగా నిలుస్తోంది. ముఖేష్‌ అంబానీ చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు నేడు బీఎస్‌ఈలో రూ.1105.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇంట్రాడేలో షేరుకు కొనుగోళ్ల మద్దతు పెరగడంతో ఒకానొక దశలో 2.50శాతం లాభపడి రూ.1125.90ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.1:00లకు షేరు గతముగింపు(రూ.1096.95) ధరతో పోలిస్తే 2శాతం లాభంతో రూ.1120.25ల

Most from this category