STOCKS

News


పెద్దగా తెలియని స్టాక్స్‌... అయినా దండిగా లాభాలు!

Tuesday 23rd April 2019
Markets_main1555958627.png-25276

తన చర్యలన్నీ ఇతరులకు వ్యతిరేకంగా ఉన్నాయని సరైన పెట్టుబడిదారుడు భావిస్తాడన్నది బెంజమిన్‌ గ్రాహం సూత్రీకరణ. కాంట్రేరియన్‌ ఇన్వెస్టర్‌ (నలుగురికి భిన్నమైనవారు) తక్కువ ప్రాచుర్యం ఉన్న స్టాక్స్‌లో ఇ‍న్వెస్ట్‌ చేయడం వల్ల ఇతరుల కంటే రాబడుల పరంగా మెరుగైన స్థితిలో ఉంటారు. దీర్ఘకాలంలో తటస్థం నుంచి కొద్దిగా తెలిసిన కంపెనీలు ఇతర కంపెనీలతో పోలిస్తే గణనీయమైన రాబడులను ఇవ్వగలవని మోతీలాల్‌ ఓస్వాల్‌ అధ్యయన పూర్వకంగా వెల్లడించింది. 

 

మార్చి త్రైమాసికంలో ప్రముఖ కంపెనీల పనితీరు దారుణంగా ఉంది. కానీ, అంతగా తెలియని, కొద్దిగా తెలిసిన కంపెనీలు మాత్రం మంచి రాబడులను ఇచ్చాయి. దీర్ఘకాలంలో చూసినా... పెద్దగా ఆదరణ లేని తక్కువ పీఈ స్టాక్స్‌ అసాధారణ రాబడులను ఇచ్చినట్టు మోతీలాల్‌ ఓస్వాల్‌ అధ్యయనంలో వెల్లడైంది. ఇక మార్చి క్వార్టర్లో తక్కువ పీఈ స్టాక్స్‌ మంచి రాబడులను ఇవ్వగా, అధిక పీఈ స్టాక్స్‌ నష్టాలను మిగిల్చాయి. తన అధ్యయనం అనంతరం మోతీలాల్‌ ఓస్వాల్‌ ఈ కోణం నుంచి కొనుగోలు, విక్రయ స్టాక్స్‌తో ఓ జాబితాను రూపొందించింది. టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌, అశోక్‌లేలాండ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, హెచ్‌పీసీఎల్‌, కోల్‌ ఇండియాలను కొనుగోలు జాబితాలో చేర్చింది. ఇవి 52 వారాల గరిష్ట స్థాయి నుంచి 19-40 శాతం మధ్యలో తగ్గాయి. యాక్సిస్‌ బ్యాంకు, నెస్లే, హావెల్స్‌ ఇండియా, పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌, ఎంఅండ్‌ఎంను సెల్‌ జాబితాలో చేర్చింది. 

 

బాగా ప్రాచుర్యంలో ఉన్న స్టాక్స్‌ గురించి మార్కెట్లో సాధారణంగా చర్చ జరుగుతుంటుంది. వీటికి సాధారణంగానే ఎక్కువ మంది కొనుగోలుదారులు ఉంటుంటారు. కానీ, తటస్థం, అంతగా ఇన్వెస్టర్లకు తెలియని స్టాక్స్‌ను మార్కెట్‌ పెద్దగా పట్టించుకోదు. దీంతో ఈ స్టాక్స్‌లో సత్తా దాగి ఉంటుంది. ఏదో ఒక సమయంలో వీటిపట్ల ఇన్వెస్టర్లలో ఒక్కసారిగా ఆసక్తి ఏర్పడుతుంది. దీంతో ఇవి ర్యాలీ చేయడం వల్ల రాబడులు అధికంగా ఉంటాయన్నది మోతీలాల్‌ అధ్యయనం. మార్కెట్లో సెల్‌ రికమండేషన్లకు అంత ఆదరణ లేదని, కేవలం 14 శాతమే సెల్‌ రికమండేషన్లు ఉండగా, బై రికమండేషన్ల శాతం 64 అని, న్యూట్రల్‌ రికమండేషన్లు 22 శాతంగా ఉన్నట్టు మోతీలాల్‌ తెలిపింది. ఈ అధ్యయనం ప్రకారం... మంచి వృద్ధి అవకాశాలు, ఆకర్షణీయమైన విలువలతో ఉన్న అంతగా ప్రాచుర్యం పొందని స్టాక్స్‌ను కొనుగోలు చేస్తే దీర్ఘకాలంలో మంచి రాబడులు తప్పకుండా వచ్చే అవకాశాలే ఎక్కువని తెలుస్తోంది. You may be interested

వచ్చే ఏడాదే భారీ మిడ్‌క్యాప్‌ ర్యాలీ?! అమిత్‌జస్వాని

Tuesday 23rd April 2019

వచ్చే బుల్‌ ర్యాలీలో ఏదో ఒక రంగం లీడ్‌ రోల్‌ పోషిస్తుందని, ఆ రంగం స్టాక్స్‌ను కొనుగోలు చేసుకోవాలని స్టాలియన్‌ అస్సెట్‌ సీఐవో అమిత్‌జస్వాని సూచించారు. కన్జ్యూమర్‌, ఫైనాన్షియల్స్‌ పట్ల తాము సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. వృద్ధి లేకుండా కేవలం వృద్ధి అంచనాల ఆధారంగా పోర్ట్‌ఫోలియో మేనేజర్లు అధిక పీఈ ‍స్టాక్స్‌ను కొనుగోలు చేయడం అంత సులభం కాదని, దీనివల్ల సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. పలు అంశాలపై ఆయన ఓ

లార్జ్‌క్యాప్స్‌ను నమ్ముకోండి!

Monday 22nd April 2019

ఇప్పుడున్న పరిస్థితుల్లో మిడ్‌, స్మాల్‌క్యాప్స్‌ కన్నా లార్జ్‌క్యాప్స్‌ను నమ్ముకోవడం మంచిదని యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఈక్విటీ హెడ్‌ జినేశ్‌ గోపాని సూచించారు. స్థూల ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు, మైక్రో ఎకానమీలో ఆటుపోట్లు కనిపిస్తున్న నేపథ్యంలో పెద్దస్టాకులతోనే క్యాపిటల్‌కు రక్షణ ఉంటుందన్నారు. ఎకానమీ మెరుగుపడితే అప్పుడు చిన్న కంపెనీల ఎర్నింగ్స్‌ మెరుగుపడతాయని, అప్పుడు వాటి గ్రోత్‌ లార్జ్‌క్యాప్స్‌ కన్నా ఎక్కువగా ఉంటుందని, అలాంటప్పుడు వీటిపై కన్నేయవచ్చని సూచించారు. కానీ ప్రస్తుతం మాత్రం

Most from this category