STOCKS

News


ఈ స్టాక్స్‌పై సానుకూలత: మోతీలాల్‌ ఓస్వాల్‌

Sunday 2nd December 2018
Markets_main1543774818.png-22574

నిఫ్టీ తన డౌన్‌లెగ్‌లో 10,880 సమీపంలో 50 శాతం రీట్రేస్‌మెంట్‌ను పూర్తి చేసిందని, ఇక కీలకమైన 11,000 మార్కును చేరుకోవాలంటే 10,777-10,800పైన నిలదొక్కుకోవాల్సి ఉందని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చందన్‌ తపారియా తెలిపారు. దిగువ వైపు 10,650 వద్ద కీలక మద్దతుగా నిలుస్తుందన్నారు. ‘‘నిఫ్టీ నవంబర్‌ సిరీస్‌లో 734 పాయింట్ల మేర లేదా 7.25 శాతం పెరిగింది. 2016 మార్చి తర్వాత చూస్తే ఒక డెరివేటివ్‌ సిరీస్‌ ఆరంభం నుంచి ముగింపులో అధికంగా లాభపడిన సందర్భం ఇదే. నిఫ్టీ ఫ్యూచర్స్‌ రోలోవర్‌ 71.23 శాతమే ఉంది. ఇది గత సిరీస్‌లో 75.83 శాతంగా ఉంది. బ్యాంకు నిఫ్టీ రోలోవర్‌ 72.17 శాతం (గత సిరీస్‌లో 78.63 శాతం) ఉంది’’అని తపారియా తెలిపారు. ఆప్షన్ల వారీగా చూస్తే నిఫ్టీ 10,700-11,000 స్థాయిలో ట్రేడ్‌ అవుతుందని తెలుస్తోందన్నారు. ఆర్‌బీఐ పాలసీ భేటీ, రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వీఐఎక్స్‌ ఇప్పటికీ ఫ్లాటిష్‌గానే ఉందన్నారు. 

 

‘‘బ్యాంకు నిఫ్టీ నవంబర్‌ 30న కన్సాలిడేషన్‌లో ఉంది. 26,350 పాయింట్లను బ్రేక్‌ చేయడం ద్వారా మంచి మూమెంటమ్‌ చూపించింది. వారం వారీగా బుల్లిష్‌ క్యాండిల్‌ను నమోదు చేసింది. గత కొన్ని వారాలుగా గరిష్టాల్లో గరిష్టాలను నమోదు చేయడాన్ని చూస్తుంటే ఇండెక్స్‌లో సానుకూల బలం తోడైనట్టు తెలుస్తోంది. ఇది 26,350పైన నిలదొక్కుకోవాలి.దా తర్వాత తక్షణ ట్రేడింగ్‌ జోన్‌ 26,666. తదుపరి 27,200, 27,500 స్థాయి వరకు వెళ్లొచ్చు. ఆర్‌బీఐ పాలసీ, ప్రపంచ సంకేతాలు, రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అంశాల కారణంగా ఆటుపోట్లు కొనసాగుతాయి’’ అని చందన్‌ తపారియా తెలిపారు. కోటక్‌ మహీంద్రా బ్యాంకు, బాటా ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎస్కార్ట్స్‌, మెక్‌డొవెల్‌ హోల్డింగ్స్‌, టీసీఎస్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల్లో సానుకూలత నెలకొన్నట్టు చెప్పారు. You may be interested

జీవిత బీమా చౌక... ఆరోగ్య బీమా ఖరీదు!

Sunday 2nd December 2018

జీవిత బీమా పాలసీలు అందుబాటు ధరలకు దిగిరానున్నాయి. అదే సమయంలో ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియం కాస్త భారం కానుంది. ప్రజల ఆయుర్ధాయం పెరిగిపోతుండడం ఇందుకు కారణం. ఇక ఆరోగ్య బీమా పాలసీల్లో మినహాయింపులను తగ్గించేయాలని పలు కోర్టులు ఆదేశాలు జారీ చేసినందున వీటి ప్రీమియం పెరగనుంది. ‘‘నూతన మోర్టాలిటీ (మరణాలకు సంబంధించి) టేబుల్‌లో 10 శాతం మెరుగుదల ఉంది. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ యాక్చురీస్‌ ఇండియా దీన్ని రూపొందించింది. ఈ

స్వల్పకాలానికి 3 ట్రేడింగ్‌ ఐడియాలు..!

Saturday 1st December 2018

ముంబై: టెక్నికల్‌గా నిఫ్టీ 11,100 పాయిం‍ట్లకు సమీపాన ఉందని, వచ్చే రెండు రోజుల్లో ఈ దశలో కన్సాలిడేషన్‌కు అవకాశం ఉందని స్వతంత్ర మార్కెట్‌ అనలిస్ట్‌ కునాల్‌ బోత్ర అన్నారు. ముడిచమురు ధరలు భారీగా తగ్గిన నేపథ్యంలో సూచీలకు నూతన ఉత్సాహం వచ్చిందని ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. యస్‌ బ్యాంక్‌ బోటమ్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు ఉందని విశ్లేషించిన ఆయన డీఎల్‌ఎఫ్‌. రెప్కో హోమ్స్‌లో ఆకర్షణీయ కదలికలు నమోదు కాగా..

Most from this category