STOCKS

News


సెబీ షాక్‌తో మోతీలాల్‌, ఐఐఎఫ్‌ఎల్ షేర్ల పతనం

Monday 25th February 2019
Markets_main1551075127.png-24318

ఎన్‌ఎస్‌ఈఎల్‌కు చెందిన కేసులో మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ హెచ్చరికలు జారీ చేయడంతో మోతీలాల్‌ ఓస్వాల్‌, ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్‌ షేర్లు సోమవారం ట్రేడింగ్‌లో 5నుంచి 9శాతం భారీగా పతనమయ్యాయి. రూ.5,600 కోట్ల ఎన్‌ఎస్‌ఈఎల్‌ కుంభకోణంలో ప్రధాన భూమిక పోషించిన ఈ రెండు రెండు సంస్థలకు చెందిన కమోడిటీ విభాగాలకు డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌ చేసే అర్హత లేదని శుక్రవారం సెబీ వెల్లడించింది. ఎన్‌ఎస్‌ఈఎల్‌కు చెందిన మోసపూరిత కాంట్రాక్టుల విక్రయాలకు ఆ రెండు సంస్థలు ఉద్దేశపూర్వకంగా సహకరించాయి. అలాగే వినియోగదారులంతా 45రోజుల్లోపు తమ సెక్యూరిటీలను 45రోజుల్లోపు వేరే బ్రోకింగ్‌ సంస్థలకు మార్పించుకోవాలని సూచించింది. ఫలితంగా నేటి ట్రేడింగ్‌లో ఈ రెండు కంపెనీలకు చెందిన షేర్లు నేడు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే అ‍మ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌:- నేడు బీఎస్‌ఈలో శుక్రవారం ముగింపు(రూ.612.3)తో పోలిస్తే 4శాతం నష్టంతో రూ.585.50ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 5శాతం వరకు నష్టపోయి రూ. 581.00ల కనిష్టానికి పతనమైంది. ఉదయం గం.11:00లకు షేరు 2.50శాతం నష్టంతో రూ.595ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట గరిష్ట ధరలు వరుసగా రూ.549.75  రూ.1212.65లుగా నమోదయ్యాయి.
ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్‌:- నేడు బీఎస్‌ఈలో శుక్రవారం ముగింపు(రూ.365.35)తో పోలిస్తే 3శాతం నష్టంతో రూ.354.05ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 9శాతం వరకు నష్టపోయి రూ.332.50ల కనిష్టానికి పతనమైంది. అయితే క్రమంగా అమ్మకాలు తగ్గడంతో తిరిగి కోలుకున్న షేరు ఉదయం గం.11:00లకు షేరు 2శాతం నష్టంతో రూ.357.50ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట గరిష్ట ధరలు వరుసగా రూ.297.50 రూ.872.70లుగా నమోదయ్యాయి.You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ జంప్‌

Monday 25th February 2019

ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ అండతో సోమవారం బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 27000 మార్కును అందుకుంది. మార్కెట్‌ లాభాల ర్యాలీలో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు 1శాతం వరకు ర్యాలీ చేయడంతో నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 172 పాయింట్లు(0.75 శాతం)లాభపడి 27,039.45 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:45ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(26867)తో పోలిస్తే అరశాతం లాభంతో 27,022 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

లాభసాటి పెట్టుబడులు!

Monday 25th February 2019

లాభసాటి పెట్టుబడులు! ఎస్‌బీఐ ఫోకస్డ్‌ ఈక్విటీ ఫండ్‌ ఈక్విటీ పెట్టుబడులపై తగినంత రాబడులు కోరుకునే వారికి ఎస్‌బీఐ ఫోకస్డ్‌ ఈక్విటీ ఫండ్‌ మంచి ఎంపికే అవుతుంది. అన్ని రకాల మార్కెట్లలోనూ లాభాలు ఇవ్వగల స్టాక్స్‌ను గుర్తించి ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా రాబడులు ఇచ్చే విధానంలో ఈ పథకం పనిచేస్తుంటుంది. కనుక ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లకు ఇదొక మంచి పెట్టుబడి ఆప్షన్‌ అవుతుంది. ఈ పథకానికి ఆర్‌ శ్రీనివాసన్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు.  పెట్టుబడుల విధానం ఫోకస్డ్‌

Most from this category