News


మిడ్‌క్యాప్స్‌లో మోర్గాన్‌ స్టాన్లీ నచ్చిన స్టాక్స్‌!

Saturday 9th March 2019
Markets_main1552072430.png-24498

దాదాపు రెండేళ్ల కనిష్ట ధరలకు కొన్ని, 52 వారాల కనిష్ట ధరలకు ఎక్కువ శాతం మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ ఇటీవల పడిపోయాయి. ఎక్కువ మంది విశ్లేషకులు స్టాక్స్‌ కొనుగోలుకు ఇది సరైన తరుణంగా భావిస్తున్నారు. ‘‘చమురు ధరలు పెరగకపోవచ్చు. గత ఎనిమిది వారాల్లో రాజకీయంగా పరిణామాలను పరిశీలిస్తే... ఎన్నికల ముందస్తు ఎన్నో భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం, రైతులకు నగదు బదిలీ, సరిహద్దుల్లో సైనిక చర్యతో ప్రజల్లో ఏకీకరణ జరిగి రానున్న ఎన్నికల తర్వాత బలమైన ప్రభుత్వం ఏర్పడడానికి అవకాశాలు పెరిగాయి’’ అని మోర్గాన్‌స్టాన్లీ పేర్కొంది. పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ విస్తరణతో వృద్ధి పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయని, రుణాల వృద్ధి ఎన్నో సంవత్సరాల గరిష్ట స్థాయికి, కార్పొరేట్‌ ఆదాయ వృద్ధి 20 త్రైమాసికాల గరిష్ట స్థాయి, కార్పొరేట్‌ లాభాలు 25 త్రైమాసికాల గరిష్టాల్లో ఉన్న విషయాన్ని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ గుర్తు చేసింది.

 

‘‘ఎన్నికల ముందస్తు ర్యాలీకి అవకాశాలున్నాయి. ఎందుకంటే లిక్విడిటీ, మార్కెట్‌ సెంటిమెంట్‌ ప్రస్తుతం ఎగువ స్థాయిల్లో ఉన్నాయి. భారత ఆర్థిక వ్యవస్థలో బలహీనత ఉన్నప్పటికీ... అంతర్జాతీయంగా అమెరికా-చైనా మధ్య వాణిజ్య డీల్‌ మార్కెట్లను ఎగువ స్థాయిలకు తీసుకెళుతుంది’’ అని అవెండస్‌ క్యాపిటల్‌ ఆల్టర్నేట్‌ స్ట్రాటజీస్‌ సీఈవో ఆండ్ర్యూ హోలండ్‌ పేర్కొన్నారు. సరిహద్దు ఉద్రిక్తతల పట్ల ప్రభుత్వం గట్టి ప్రతిస్పందన బీజేపీకి మరిన్ని సీట్లను తెచ్చిపెడుతుందని, దీంతో మెజారిటీ వస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జీడీపీ 6 శాతంగా ఉంటే ఆర్‌బీఐ తదుపరి సమావేశంలో రేట్లను అర శాతం తగ్గించొచ్చన్నారు. మోర్గాన్‌ స్టాన్లీ 2019 చివరికి సెన్సెక్స్‌కు 42,000 లక్ష్యాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే. లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే ఇతర స్టాక్స్‌ మధ్య పనితీరు పరంగా అంతరం కొంత తగ్గిందని, కనుక మిగిలిన స్టాక్స్‌ మంచి పనితీరు చూపించొచ్చని అంచనా వేసింది. ఇంద్రప్రస్థ గ్యాస్‌, సైయంట్‌, జస్ట్‌ డయల్‌, ఎడెల్వీజ్‌, ఎబెరాయ్‌ రియాలిటీ, ఇండియన్‌ హోటల్స్‌, అమరరాజా బ్యాటరీస్‌, అపోలో హాస్పిటల్స్‌, ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌, జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌, ఇప్కా ల్యాబ్స్‌ను ఫేవరేట్‌ మిడ్‌క్యాప్‌ స్టా‍క్స్‌గా మోర్గాన్‌ స్టాన్లీ పేర్కొంది.
 



You may be interested

పిజ్జా అదిరెన్‌... డోనట్‌ ఎగిరేన్‌...!!!

Saturday 9th March 2019

జుబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌కు ముందున్నాయి మంచి రోజులు అంటున్నాయి బ్రోకరేజీ సంస్థలు. ఎందుకంటే నిర్ణీత లక్ష్యానికంటే ఒక త్రైమాసికం ముందుగానే డంకిన్‌ డోనట్స్‌ బ్రేక్‌ఈవెన్‌ (లాభ, నష్ట రహిత) దశకు వచ్చేసింది. డంకిన్‌ డోనట్స్‌ యూనిట్‌ కారణంగా జుబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌ ఎబిట్డా 250 బేసిస్‌ పాయింట్లను నష్టపోవాల్సి వస్తోంది. మరోవైపు కంపెనీకి సంబంధించి అతిపెద్ద ఆదాయం తెచ్చిపెట్టే డామినోస్‌ మాత్రం మంచి పనితీరు చూపిస్తోంది. ముడిపదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడంతో డామినోస్‌

నాలుగురోజుల లాభాలకు బ్రేక్‌

Friday 8th March 2019

11050 మార్కును కోల్పోయి నిఫ్టీ ప్రపంచమార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ శుక్రవారం నష్టంతో ముగిసింది. సెన్సెక్స్‌ 54 పాయింట్లను కోల్పోయి 36,671 వద్ద, నిఫ్టీ 10500 మార్కును చేజార్చుకుని 23 పాయింట్లు నష్టపోయి 11,035 వద్ద ముగిసింది. దీంతో  నాలుగు రోజుల ర్యాలీకి బ్రేక్‌పడినట్లైంది.  అటో, బ్యాంక్‌, మెటల్‌, ఫార్మా, ఐటీ షేర్ల అమ్మకాలు జరగ్గా, ఎఫ్‌ఎంజీసీ, ఇన్ఫ్రా రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. కీలకమైన

Most from this category