STOCKS

News


ఆర్‌బీఎల్‌పై సిఫార్సు... మాటమార్చిన మోర్గాన్‌ స్టాన్లీ

Tuesday 23rd October 2018
Markets_main1540277395.png-21403

ఆర్‌బీఐఎల్‌ బ్యాంక్‌కు మోర్గాన్‌ స్టాన్లీ గట్టి షాకిచ్చింది. అధిక వ్యాల్యుయేషన్స్‌ నేపథ్యంలో స్టాక్‌ రేటింగ్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ షేరు సోమవారం ఏడు శాతంమేర పతనమైంది. షేరు ఒక్కరోజులో ఈమేర పతనం కావడం ఇదే తొలిసారి. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ తన లిస్టింగ్‌ (2016, ఆగస్ట్‌ 31) దగ్గరి నుంచి చూస్తే దాదాపు 80 శాతంమేర ఎగసింది. ఇదే సమయంలో బీఎస్‌ఈ బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ 23 శాతంమేర పెరిగింది. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ షేరు ధర సోమవారం రూ.469 వద్ద ముగిసింది. గత ఏడు నెలల్లో ఇదే కనిష్ట ముగింపు స్థాయి. 
ఆర్‌బీఐ బ్యాంక్‌ రేటింగ్‌ తగ్గించిన మోర్గాన్‌ స్టాన్లీ... బ్యాంక్‌ వ్యాల్యుయేషన్స్‌ ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. షేరు ధర 2018-19 ఆర్థిక సంవత్సరపు బుక్‌ వ్యాల్యు అంచనాలకు 2.8 రెట్లు వద్ద, 2019-20 ఆర్థిక సంవత్సరపు ఆర్‌వోఈ 13 శాతంగా ఉందని పేర్కొంది. వీటి ఆధారంగా చూస్తే స్టాక్‌ ఏమాత్రం ఆకర్షణీయంగా లేదని తెలిపింది. ఇతర బ్యాంకులతో పోలిస్తే తక్కువ అప్‌సైడ్‌ను కలిగి ఉందని పేర్కొంది. 
‘సమీప కాలంలో బ్యాంక్‌ ఫండింగ్‌ వ్యయాలు అంచనాల కన్నా ఎక్కువగా పెరగొచ్చు. ఇది మార్జిన్లపై ఒత్తిడిని పెంచుతుంది. వృద్ధి అంచనాలపై కూడా ప్రభావం ఉండొచ్చు. అందువల్ల ఎర్నింగ్స్‌ అంచనాలను తగ్గిస్తున్నాం’ అని మోర్గాన్‌ స్టాన్లీ వివరించింది. ఆర్‌బీఐ బ్యాంక్‌ అలాగే అన్‌సెక్యూ‍ర్డ్‌ రుణాలకు ఎక్కువగా అందిస్తోందని, ఈ అంశాన్ని గమనించాల్సి ఉందని పేర్కొంది. 
మోర్గాన్‌ స్టాన్లీ కేవలం 11 రోజుల వ్యవధిలోనే ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ టార్గెట్‌ ప్రైస్‌ను దాదాపు 33 శాతంమేర తగ్గించడం ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. మోర్గాన్‌ స్టాన్లీ అక్టోబర్‌ 10న ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ టార్గెట్‌ ప్రైస్‌ను రూ.500 నుంచి రూ.675కి పెంచింది. అప్పుడు స్టాక్‌ రూ.599 వద్ద ట్రేడయ్యింది. తాజాగా మోర్గాన్‌ స్టాన్లీ ఈ షేరు టార్గెట్‌ ధరను రూ. 450 స్థాయికి తగ్గించింది.

ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌కు బ్రోకరేజ్‌ సంస్థల టార్గెట్‌ ప్రైస్‌లను గమనిస్తే.. 
సంస్థ            రికమెండేషన్‌    టార్గెట్‌ ప్రైస్‌ (రూ)
యాక్సిస్‌ క్యాపిటల్‌    కొనొచ్చు    650
మోతీలాల్‌ ఓస్వాల్‌    కొనొచ్చు    700
నిర్మల్‌ బ్యాంగ్‌        కొనొచ్చు    647
ఇన్వెస్టెక్‌            కొనొచ్చు    660
ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌    కొనొచ్చు    793
అంబిత్‌ క్యాపిటల్‌        అమ్మొచ్చు    397
కోటక్‌ సెక్యూరిటీస్‌    తగ్గించుకోవచ్చు500
మోర్గాన్‌ స్టాన్లీ        అండర్‌వెయిట్‌    450



You may be interested

ఫార్మా షేర్లలో అమ్మకాలు

Tuesday 23rd October 2018

ఫార్మా ఐటీ షేర్ల పతనంతో మార్కెట్‌ మిడ్‌ సెషన్‌ సెషన్‌ సమయానికి అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. అత్యధికంగా ఫార్మా షేర్లు నష్టపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఫార్మా ఇండెక్స్‌ నేటి ఇంట్రాడేలో 3శాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.1:30లకు ఇండెక్స్‌ గత ముగింపు(9,646.65)తో పోలిస్తే 2.50శాతం నష్టపోయి 9,392.40 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలో భాగమైన మొత్తం 10 షేర్లలో 8షేర్లు నష్టాల్లో ట్రేడ్‌

పెట్రో మార్కెటింగ్‌ షేర్లకు రేటింగ్‌ షాక్‌

Tuesday 23rd October 2018

ముంబై:- విదేశీ బ్రోకింగ్‌ సంస్థ నోమురా పెట్రో మార్కెటింగ్‌ కంపెనీ షేర్లపై రేటింగ్‌ను తగ్గించడంతో మంగళవారం ఐఓసీ, హెచ్‌సీఎల్‌, బీపీసీఎల్‌ షేర్లు 4శాతం నష్టపోయాయి.  ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ముడిచమురు ధరలు, డాలర్‌ మారకంలో రూపాయి రోజు రోజుకూ తరుగుతున్న రూపాయి విలువలు పెట్రో మార్కెటింగ్‌ కంపెనీలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని నోమురా అంచనా వేస్తుంది. ఇరాన్‌ నుంచి దిగుమతయ్యే ముడిచమురు అమెరికా విధించి ఆంక్షలు అమెరికా నవంబర్‌ 4నుంచి

Most from this category