STOCKS

News


కొత్త ఏడాదిపై మోర్గాన్‌స్టాన్లీ పాజిటివ్‌

Thursday 13th December 2018
Markets_main1544695621.png-22899

సార్వత్రిక ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు వస్తే వచ్చే ఏడాది చివరి నాటికి సెన్సెక్స్‌ ప్రస్తుత స్థాయిల నుంచి మరో 20 శాతం వరకు ర్యాలీ జరపవచ్చని అంతర్జాతీయ బ్రోకింగ్‌ సంస్థ మోర్గాన్‌స్టాన్లీ అంచనా వేసింది. ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన తీర్పు రాకుండా అతుకుల బొంత ప్రభుత్వం ఏర్పడితే సూచీల్లో భారీ పతనం తప్పకపోవచ్చని అభిప్రాయపడింది. ఈ పరిస్థితుల్లో నిఫ్టీ 33వేల పాయింట్లకు పడిపోవచ్చని పేర్కొంది. బుల్‌కేస్‌కు 30 శాతం, బేర్‌ కేస్‌కు 20 శాతం అవకాశం ఉందని తెలిపింది. బేస్‌కేస్‌లో సెన్సెక్స్‌ 42వేల పాయింట్లను చేరుతుందని, ఇందుకు 50 శాతం ఛాన్స్‌ ఉందని అంచనా వేసింది. కొత్త సంవత్సరం ప్రధమార్ధమంతా ఒడిదుడుకులతో ఉంటుందని అంచనా వేసింది. క్రూడాయిల్‌ ధర తగ్గడం, యూఎస్‌- చైనా ట్రేడ్‌ వార్‌ క్రమంగా సమసిపోతుండడం, బ్యాంకుల క్రెడిట్‌ గ్రోత్‌లో మెరుగుదల.. ఎర్నింగ్స్‌పై పాజిటివ్‌ ప్రభావం చూపుతాయని తెలిపింది. అందువల్ల సూచీల్లో ర్యాలీ ఉంటుందని తెలిపింది.
ఎన్‌డీఏకి 245 సీట్లు?
 వచ్చే ఎన్నికల్లో ఎన్‌డీఏకి ప్రస్తుతమున్న సీట్లకన్నా తక్కువ సీట్లు రావచ్చని మరో బ్రోకరేజ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ తెలిపింది. ఎన్నికల్లో బీజేపీకి కీలక రాష్ట్రాల్లో పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలతో బీజేపీకి చెందిన సుమారు 42- 69 ఎంపీ సీట్లపై నెగిటివ్‌ ప్రభావం ఉంటుందని తెలిపింది. ఇదే సమయంలో ఈశాన్యరాష్ట్రాల్లో విజయాలతో 7- 17 సీట్లు పెరగవచ్చని పేర్కొంది. బీజేపీ మిత్రపక్షాలకు 25 సీట్లవరకు రావచ్చని తెలిపింది. మొత్తం మీద ఎన్‌డీఏకి 245- 280 సీట్ల వరకు వచ్చే ఛాన్సులున్నాయని అంచనా వేసింది. రాబోయే ఎన్నికల్లో 5-7 శాతం ఓట్‌షేర్‌లో తేడాలు రావచ్చని పేర్కొంది. 
ఫండమెంటల్స్‌ అన్నీ కొత్త ఎకనమిక్‌ సైకిల్‌ ఆరంభాన్ని చూపుతున్నాయని, వాల్యూషన్లు చక్రీయ వలయం మధ్య భాగంలో ఉన్నాయని, సెంటిమెంట్‌ మాత్రం పూర్తిగా నెగిటివ్‌గా ఉందని మోర్గాన్‌ స్టాన్లీ తెలిపింది. ఎర్నింగ్స్‌లో మెరుగుదల సూచీలను ముందుకు నడుపుతుందని అంచనా వేసింది. 2011 తర్వాత ఎఫ్‌పీఐలు ఈ ఏడాదే అమ్మకాలకు దిగారు. ఇప్పటివరకు 2018లో ఎఫ్‌పీఐలు దాదాపు 32 వేల కోట్ల రూపాయలు ఉపసంహరించుకున్నాయి. అయితే ప్రస్తుతం ఎమర్జింగ్‌ మార్కెట్లలో ఇండియా ఆకర్షణీయంగా ఉందని, అందువల్ల కొత్త ఏడాది ఎఫ్‌పీఐల ప్రవాహం ఆరంభం కావచ్చని మోర్గాన్‌స్టాన్లీ అంచనా వేసింది. 
కొత్త ఏడాది కోసం ఆర్‌ఐఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐటీసీ, ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌, ఏసియన్‌ పెయింట్స్‌, టైటాన్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్స్‌, బజాజ్‌ ఆటో షేర్లను సిఫార్సు చేసింది. You may be interested

వచ్చే ఏడాది ఓ మోస్తరు రాబడులే

Thursday 13th December 2018

వచ్చే ఏడాది తొలి అర్ధ భాగంలో ఎన్నికలు ఉండటం వల్ల మార్కెట్లు రేంజ్‌బౌండ్‌లో ఉంటాయని, రెండో అర్ధ భాగంలో మోస్తరు రాబడులను అందిస్తాయని ఏబీఎస్‌ఎల్‌ ఎంఎఫ్‌ కో-సీఐవో మహేశ్‌ పాటిల్‌ తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే ఏడాదిలో స్థూల ఆర్థికాంశాలు మెరుగుదలను చూడొచ్చన్నారు. గత రెండు నెలల కాలం నుంచే పరిస్థితుల్లో మార్పులు వచ్చాయని తెలిపారు. గత రెండు త్రైమాసికాలను గమనిస్తే

పండుగ చేసుకుంటున్న హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు

Thursday 13th December 2018

వచ్చే ద్రవ్యసమీక్ష పరపతి సమావేశంలో ఆర్‌బీఐ రెపో రేటును తగ్గించవచ్చనే అంచనాలతో  హౌసింగ్‌ ఫైనాన్షింగ్‌ షేర్లు గురువారం పండుగ చేసుకుంటున్నాయి. రెపో రేట్ల తగ్గింపుతో నెలవారీ వాయిదాల (ఇఎంఐ) భారం తగ్గుతుంది. అత్యధికంగా ఎన్‌సీడీల జారీ ఇష్యూ ద్వారా రూ. 250 కోట్లను సమీకరణకు సిద్ధమైన ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ అత్యధికంగా లాభపడింది. నేటి ఇంట్రాడేలో హోమ్‌ ఫైనాన్షింగ్‌ షేర్లైన ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, రెప్కో హోమ్‌, కెన్‌ఫిన్‌ హోమ్స్‌,

Most from this category