STOCKS

News


42,000లకు సెన్సెక్స్-మోర్గాన్‌స్టాన్లీ అంచనా

Friday 14th September 2018
Markets_main1536921580.png-20257

ప్రముఖ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ తాజాగా బీఎస్‌ఈ సెన్సెక్స్‌ టార్గెట్‌ను పెంచింది. వచ్చే ఏడాది సెప్టెంబర్‌ నాటికి సెన్సెక్స్‌ 42,000 పాయింట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. 
కాగా మోర్గాన్‌ స్టాన్లీ ఇదివరకు 2019 జూన్‌ నాటికి సెన్సెక్స్‌ 36,000 పాయింట్లకు వెళ్తుందని అంచనా వేసింది. అయితే 2018 జూలైలోనే సెన్సెక్స్‌ ఈ మార్క్‌ను అధిగమించేసింది. ఇండెక్స్‌ ప్రస్తుత ఏడాది ఇప్పటి వరకు దాదాపు 11 శాతంమేర ర్యాలీ చేసింది. దేశీ ఇన్వెస్ట్‌మెంట్లు పెరగడం, జూన్‌ క్వార్టర్‌ ఎర్నింగ్స్‌ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణం. క్రూడ్‌ ధరలు పెరుగుదల, రూపాయి క్షీణత ఉన్నా కూడా బ్రోకరేజ్‌ సంస్థలు ఇండియాపై బుల్లిష్‌గా ఉన్నాయి. 
మోర్గాన్‌ స్టాన్లీ తన 2018 జూన్‌ నివేదికలో బుల్‌ ట్రెండ్‌ కొనసాగితే సెన్సెక్స్‌ 44,000కు చేరొచ్చని పేర్కొంది. అయితే ఎర్నింగ్స్‌ వృద్ధి రివకరీ ఆలస్యం కావడం వల్ల ఇన్వెస్టర్లు ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లపై బుల్లిష్‌గా లేరని తాజా నివేదికలో పేర్కొంది. రానున్న త్రైమాసికాల్లో వృద్ధి పుంజుకుంటే ఈ ధోరణిలో మార్పు రావొచ్చని తెలిపింది. ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లు అప్‌ట్రెండ్‌లో కొనసాగుతాయని, ఇన్వెస్టర్లు మంచి పనితీరు కనబర్చని వాటికి ప్రాధాన్యమివ్వొచ్చని పేర్కొంది. మెరుగైన ఎర్నింగ్స్‌ ఔట్‌లుక్‌ కలిగిన అండర్‌పర్ఫార్మ్‌ చేస్తున్న స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని తెలిపింది. అలాగే స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌కు ప్రాధాన్యత ఇవ్వొచ్చని పేర్కొంది. తన ఫోకస్‌ జాబితాలో ఎస్‌బీఐ, ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌, అపోలో హాస్పిటల్స్‌కు చోటు కల్పించింది. ఇక ఇన్ఫోసిస్‌, హావెల్స్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లను తొలగించింది. 



You may be interested

జేఎల్‌ఆర్‌ అవుట్‌లుక్‌ను తగ్గించిన ఫిచ్‌

Saturday 15th September 2018

ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ టాటా మోటార్స్‌ అనుబంధ కంపెనీ జేఎల్‌ఆర్‌ అవుట్‌లుక్‌ను స్థిరత్వం నుంచి నెగెటివ్‌కు మార్చింది. అయితే బీబీప్లస్‌ను మాత్రం యథాతథంగా కొనసాగించింది. 2010 నుంచి టాటా మోటార్స్‌కు పాడి ఆవుగా మారిన జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జీఎల్‌ఆర్‌) 2018లో మాత్రం గుదిబండగా మారింది. జూన్‌ క్వార్టర్లో నష్టాలను ప్రకటించాల్సి వచ్చింది. డీజిల్‌ కార్లకు వినియోగదారులు ప్రాధాన్యం తగ్గించడం, బ్రెగ్జిట్‌ (ఈయూ నుంచి బ్రిటన్‌ ఎగ్జిట్‌)

11500 పైన నిఫ్టీ

Friday 14th September 2018

38వేల పైన సెన్సెక్స్‌ రాణించిన బ్యాంకింగ్‌, మెటల్‌, ఫార్మా షేర్లు మార్కెట్‌  వారంతపు రోజైన శుక్రవారం లాభంతో ముగిసింది. రూపాయి బలపడటం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరల దిగిరావడంతో పాటు టోకు ద్రవ్యోల్బణ సూచీ 4నెలల కనిష్టానికి చేరుకుందనే వార్తలు ఇన్వెస్టర్లకు ఉత్సాహానిచ్చాయి. బ్యాంకింగ్‌, అటోమొబైల్‌, మెటల్‌, ఫార్మా రంగ షేర్లలో కొనుగోలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 38వేల స్థాయిని, నిఫ్టీ 11500 మార్కును అందుకున్నాయి. చివరికి సెన్సెక్స్‌ 373 పాయింట్ల లాభంతో 38090

Most from this category