STOCKS

News


రెండేళ్లలో సత్తా చూపించే స్టాక్స్‌: మోర్గాన్‌ స్టాన్లీ

Sunday 14th April 2019
Markets_main1555265153.png-25120

అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు మోర్గాన్‌ స్టాన్లీ వచ్చే రెండేళ్లలో ఎర్నింగ్స్‌ పరంగా మంచి పనితీరు చూపించే 22 స్టాక్స్‌ను గుర్తించింది. వీటిల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, మహింద్రా అండ్‌ మహింద్రా, ఐసీఐసీఐ బ్యాంకు తదితర కంపెనీలు ఉన్నాయి. రూపాయి తక్కువ వ్యాల్యూషన్లలో ఉండడం, ప్రభుత్వ వ్యయాలు పెరగడం, వడ్డీ రేట్లు తగ్గడం, సానుకూల వృద్ధి అంచనాలతో ఈ కంపెనీలు ప్రయోజనం పొందగలవన్నది మోర్గాన్‌స్టాన్లీ అంచనా. అయితే, ఎన్నికల ఫలితాలు, చమురు ధరల పెరుగుదల, ద్రవ్య క్రమశిక్షణ, అంతర్జాతీయ మందగమనం వంటి అంశాలు కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌పై ప్రభావం చూపిస్తాయన్న అప్రమత్తతనూ సూచించింది. 

 

క్యాచ్‌ 22
మోర్గాన్‌ స్టాన్లీ తన జాబితాలో సిఫారసు చేసిన 22 స్టాక్స్‌ (క్యాచ్‌ 22)ను గమనిస్తే... హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, డాబర్‌ ఇండియా, యాక్సిస్‌ బ్యాంకు, అశోక్‌ లేలాండ్‌, బయోకాన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, గుజరాత్‌ గ్యాస్‌, హావెల్స్‌ ఇండియా, ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ, ఇన్ఫో ఎడ్స్‌, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌, జస్ట్‌ డయల్‌, లార్సెన్‌ అండ్‌ టుబ్రో, మహింద్రా అండ్‌ మహింద్రా, ఓబెరాయ్‌ రియాలిటీ, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌, టైటాన్‌ ఇండస్ట్రీస్‌, యునెటైడ్‌ స్పిరిట్స్‌, అపోలో హాస్పిటల్స్‌ ఇందులో ఉన్నాయి.

 

భారత్‌ ఆశాకిరణం
భారత్‌ జీడీపీలో లాభాల నిష్పత్తి కనిష్ట స్థాయి నుంచి బయటకు వచ్చిందని, జీడీపీ వృద్ధిలో కార్పొరేట్‌ లాభాల వాటా పెరగనుందని మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేసింది. వచ్చే నాలుగైదేళ్లలో ఎర్నింగ్స్‌ కాంపౌండెడ్‌గా 20 శాతం వృద్ధి ఉంటుందని పేర్కొంది. పెట్టుబడుల్లో బలహీనత, రిస్క్‌ తీసుకోలేకపోవడం, కొన్ని విధానపరమైన చర్యల వల్ల అంతర్జాతీయంగా పోటీ దేశాలతో భారత్‌ వెనుకబడి ఉండడానికి కారణాలని తెలిపింది. అయితే, వీటిల్లో చాలా వరకు రివర్స్‌ అయ్యాని, కొత్త ఎర్నింగ్స్‌ సైకిల్‌ ప్రారంభమైనట్టు పేర్కొంది. ఇది 4-5 ఏళ్ల పాటు ఉంటుందని, అధిక సామర్థ్య వినియోగం, పెట్టుబడుల వృద్ధి, రిస్క్‌ సామర్థ్యం తిరిగి ఏర్పడడం, వడ్డీ రేట్లు సులభంగా మారడం ఇందుకు సానుకూలతలుగా పేర్కొంది. దేశీయ సైక్లికల్స్‌, ఫైనాన్షియల్స్‌ స్టాక్స్‌ కొనుగోలుకు సిఫారసు చేసింది. కన్జ్యూమర్‌, ఇండస్ట్రియల్స్‌, ఆటోమొబైల్స్‌, హోటల్స్‌, ఎయిర్‌లైన్స్‌, సిమెంట్‌ రంగాలను సూచించింది. అలాగే, బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ, రియల్‌ ఎస్టేట్‌ రంగాల పట్ల సానుకూలంగా ఉంది. 

 

రిస్క్‌ తీసుకునే సామర్థ్యం కంపెనీల్లో పెరగడంతో వాటి ఈక్విటీలో డెట్‌ రేషియో ప్రస్తుతం పెరుగుతోందని మోర్గాన్‌ స్టాన్లీ పేర్కొంది. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌తో ఎక్స్‌పోజర్‌ కలిగిన ఐటీ, ఫార్మా రంగాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. చమురు ధరల ‍ప్రభావంతో సమీప కాలంలో ఎర్నింగ్స్‌ను పరిశీలించాలని సూచించింది. 
 



You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 16 పాయింట్లు డౌన్‌

Monday 15th April 2019

ఆసియా మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నా, సోమవారం భారత్‌ సూచీలు స్వల్ప తగ్గుదలతో ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానమై సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 9.50 నిముషాలకు 16 పాయింట్ల క్షీణతతో 11,687 పాయింట్ల వద్ద కదులుతోంది. శుక్రవారం ఇక్కడ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ 11,703 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదిలా వుండగా, శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లు 1 శాతం వరకూ

పడ్డవి ఎప్పుడూ చెడ్డవి కావు!?

Sunday 14th April 2019

ఎన్నికల ముందు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) భారీ కొనుగోళ్లకు దిగిన విషయం స్పష్టంగా చూస్తున్నాం. దీంతో ఫిబ్రవరి 19 తర్వాత కొన్ని స్టాక్స్‌ మంచి రికవరీ నమోదు చేశాయి. కొన్ని స్టాక్స్‌లో అయితే ఎఫ్‌పీఐలు మార్చి త్రైమాసికంలో ఏకంగా 10 శాతం వాటాలను కొనుగోలు చేయడం వారి దాహాన్ని తెలియజేస్తోంది. ఈ స్టాక్స్‌ ఏకంగా 41 శాతం ఇప్పటికే ర్యాలీ జరిపాయి. విదేశీ ఇన్వెస్టర్ల నిధుల రాకతో మరిన్ని

Most from this category